బద్ధ్ద కోణాసనం | Yoga of the day, baddha konasana | Sakshi
Sakshi News home page

బద్ధ్ద కోణాసనం

Published Tue, Nov 26 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

Yoga of the day, baddha konasana

బద్ధ కోణాసనాన్నే జాను భూతాడాసనం...బటర్‌ఫ్లై ఆసనం అని కూడా అంటారు
 
 నిర్వచనం: జాను అంటే మోకాలు. రెండు మోకాళ్లు భూమికి దగ్గరగా ఉంచడం వల్ల దీనిని జాను భూతాడాసనం అంటారు. మరొక విధంగా ఈ ఆసనం బటర్‌ఫ్లై (సీతాకోక చిలుక) ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి బటర్ ఫ్లై ఆసనం అంటారు.
 
 చేసే విధానం
 ముందుగా రెండు కాళ్లు చాపి, వెన్నెముక నిటారుగా ఉంచుకొని, రెండు అరచేతులు తొడల మీద ఉంచుకొని సమస్థితిలో కూర్చోవాలి. (ఫోటో 1)
     
 తర్వాత రెండు కాళ్లు మోకాళ్ల వద్ద మడిచి, రెండు అరి పాదాలను ఒక దానికి ఒకటి తాకిస్తూ రెండు చేతులను రెండు మోకాళ్ల మీద ఉంచాలి. (ఫోటో 2)
     
 ఇప్పుడు రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి (వేళ్లలోకి వేళ్లు చొప్పించి), రెండు పాదాలను కలిపి పట్టుకొని వీలైనంత  దగ్గరకు తీసుకురావాలి.
     
 ఆసన చివరిస్థితిలో వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు మోకాళ్లు వీలైనంతగా  నేలకి దగ్గరగా ఉండాలి. (ఫోటో 3)
     
 ఈ ఆసన స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకుంటూ ఉండాలి. ఈ ఆసన పూర్తి స్థితిలోకి వెళ్లడానికి ముందు కొద్దిసేపు రెండు మోకాళ్లను పైకి క్రిందికి వేగంగా ఆడించాలి. ఆ సమయంలో రెండు చేతులతో పాదాలు పట్టుకొని ఉండాలి.
     
 చివరగా ఆసన స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.      


 ఇలా ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేయాలి.   


 ఈ ఆసనం ఎప్పుడైనా వేయవచ్చు.
 
 ఉపయోగాలు
 గర్భిణుల సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. గర్భం ధరించిన దగ్గర నుండి తొమ్మిదో నెల వరకు చేయవచ్చు.
     
 ఋతుకాలంలో వచ్చే సమస్యలను తొలగిస్తుంది.
     
 పురుషులలో హెర్నియాను తొలగిస్తుంది.


 మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
     
 తొడకి, నడుముకి మధ్య భాగంలోని కీళ్లు తేలికగా కదులుతాయి.
 
 చేయకూడని వాళ్ళు
 మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు గురువు పర్యవేక్షణలో చేయాలి.
 
 మోడల్
 ఎస్. దుర్గాహర్షిత,
 నేషనల్ యోగా చాంపియన్

 
 ఫొటోలు: శివ మల్లాల
 
 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు
 సప్తరుషి యోగవిద్యాకేంద్రం
 హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement