ఊర్ధ్వ పాద సంచాలన ఆసనం | Yoga in Sancalana foot vertical seat | Sakshi
Sakshi News home page

ఊర్ధ్వ పాద సంచాలన ఆసనం

Published Mon, Jan 6 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

Yoga in Sancalana foot vertical seat

నిర్వచనం
పాదాన్ని ఊర్ధ్వ ముఖంగా తిప్పుతూ చేసే ఆసనం. కాబట్టి దీనిని ఊర్ధ్వ పాద సంచాలన ఆసనం ఉంటారు.
 
చేసే విధానం
ముందుగా వెల్లకిలా పడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి.
 
నిదానంగా ఎడమకాలిని ఎడమవైపుకి వలయాకారంగా తిప్పుతూ పైకి తీసుకురావాలి. అదే కాలిని కుడివైపుకి కూడా తిప్పుతూ మళ్లీ పైకి తీసుకురావాలి. అలా ఆరుసార్లు తిప్పిన తర్వాత కాలిని కిందకు దించి నేలకు ఆనించి విశ్రాంతి స్థితిలోకి రావాలి. తర్వాత అలాగే కుడికాలితో కూడా చేయాలి. ఆరుసార్లు క్లాక్‌వైజ్, ఆరుసార్లు యాంటీ క్లాక్ వైజ్‌గా తిప్పాలి. కాలిని గాలిలో తిప్పుతున్నప్పుడు మధ్యలో కాలు నేలకు ఆనకూడదు. చేస్తున్నంతసేపు చేతులను నేలకు తాకించి ఉంచాలి. తలను పైకి లేపకూడదు. శ్వాస సాధారణంగా ఉండాలి. శరీరాన్ని బిగించకూడదు. సౌకర్యంగా ఉన్నంత వరకే చేయాలి.
 
 ఇలా ఉదయం సాయంత్రం చేస్తుంటే ఫలితం ఉంటుంది.
 
 ఇలా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఏకకాలంలో రెండుకాళ్లతో చేయడానికి ప్రయత్నించాలి.
 
ప్రయోజనాలు
ఇది గర్భిణీ స్త్రీలు సాధన చేయదగిన ఆసనం. అయితే దేహభాగాలు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా సౌకర్యవంతంగా చేయగలిగినంత వరకే చేయాలి
 
 మోకాళ్ల నొప్పులు పోతాయి. కీళ్లు సరళతరమవుతాయి
 
 పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి.
 
 పొట్ట తగ్గుతుంది. ఊతొడలలోని కొవ్వు కరుగుతుంది.
 
 జాగ్రత్తలు
 గర్భిణీలు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే మంచిది.

 మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
 నేషనల్ యోగా చాంపియన్
 ఫొటోలు: శివ మల్లాల
 

 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు
 సప్తరుషి యోగవిద్యాకేంద్రం
 హైదరాబాద్

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement