ఇలా చేయాలి!
ముందుగా రెండు కాళ్లనూ ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడలపై బోర్లించి ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచుకుని సమస్థితిలో కూర్చోవాలి.
నిదానంగా రెండు అరచేతులను శరీరానికి ఇరువైపులా నేలపైన ఉంచి రెండు మోచేతులను ఒకదాని తర్వాత ఒకటి నేలపైన తాకిస్తూ శరీర బరువు మోచేతులపైన ఉంచుతూ వెనుకకు వంగాలి.
ఇప్పుడు తలను నేల మీద ఆనించి రెండు చేతివేళ్లను ఇంటర్‌లాక్ చేసి తలకింద ఉంచుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద మడిచి రెండు అరిపాదాలను ఒకదానికి ఒకటి పూర్తిగా తాకించి ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్లు పరస్పరం వ్యతిరేక దిశలో పక్కకు వాలి ఉంటాయి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
నిర్వచనం
నేలపై పడుకున్న స్థితిలో రెండు కాళ్లనూ కోణాకృతిలో బంధించి ఉంచే స్థితిని సుప్తబద్ధకోణాసనం అంటారు.
జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు.
ఉపయోగాలు
స్త్రీలు గర్భం ధరించిన నాటి నుండి ప్రసవించే వరకు చేయవచ్చును. ఈ ఆసనం సుఖప్రసవం కావడానికి దోహదం చేస్తుంది.
పునరుత్పత్తి వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది.
మెన్‌స్ట్రువల్ సమస్యలు పరిష్కారమవుతాయి.
మగవారిలో లైంగిక సమస్యలు తొలగిపోతాయి.
స్త్రీలకు గర్భధారణకు అవరోధంగా సమస్యలు తొలగిపోతాయి.
మోకాళ్ల నొప్పులు పోతాయి.
తొడలలో కొవ్వు కరిగిపోతుంది. తొడల లోపలి కండరాలు శక్తిమంతం అవుతాయి.
థైరాయిడ్, గొంతు సమస్యలు, ఆస్త్మా సమస్యలు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల