ఈ వారం యూట్యుబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

Published Sun, Jan 15 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

లూయిస్‌ ఫాన్సీ: డెస్పసీతో ఫీట్‌ డాడీ యాంకీ
నిడివి: 4 ని. 41 సె.; హిట్స్‌ : 46,59,571

హాయ్‌ గైస్‌! గర్ల్స్‌ భీ. కొత్త పార్టీసాంగ్‌ కోసం చూస్తున్నారా? లూయిస్‌ ఫాన్సీ, డాడీ యాంకీ కలిసి ఫీచరింగ్‌ చేసిన ‘డెస్పసీతో’ టూ డేస్‌ క్రితమే రిలీజ్‌ అయింది. పార్టీ సాంగ్‌కి ఏమేం కావాలో అన్నీ... ‘అన్నీ’ ఇందులో ఉన్నాయి. బట్‌.. వితౌట్‌ పార్టనర్‌’్స పర్మిషన్‌.. అవన్నీ చేస్తే పార్టీ కాస్తా.. ఫెయిల్‌ అయిపోయే ప్రమాదం ఉంది. లూయీ ఫాన్సీ 78లో పుట్టిన ముదురు కుర్రాడు. లాటిన్‌ సింగర్‌. డాడీ యాంకీ ప్యూర్టోరికో సింగర్‌. 77 బర్త్‌ బ్యాచ్‌. డెస్పసీతో అంటే స్లోలీ అని అర్థం. స్పానిష్‌ లాంగ్వేజ్‌. ‘యస్, నేను నిన్ను చూస్తున్నానని నీకు తెలుసు. నీనివ్వాళ నీతో కలిసి డాన్స్‌ చెయ్యాలి. గమనించావా.. నీ కళ్లు నన్ను పిలుస్తున్నాయి..’ అంటూ మొదలయ్యే ఈ ప్రణయ గీతం.. మెల్లి మెల్లిగా గాఢమై, దీర్ఘమై, ఉద్ధృతమై.. ‘నీ ప్రమాదకరమైన మలుపుల్లో నన్ను తిరగనివ్వు, నీలో నీకు ఇష్టమైన విహార కేంద్రాలను నన్ను చూడనివ్వు’ అని ముగుస్తుంది. లిరిక్‌లో ఉన్న భావావేశాన్నంతా ఈ ఇద్దరు నిష్ణాతులు ఒంట్లో ఉష్ణాన్ని రేకెత్తించేలా దృశ్యీకరించారు. వీడియో స్టార్ట్‌ అవగానే గొప్ప జీవన స్పృహ అలలు అలలుగా వచ్చి తాకుతుంది. మెల్లిమెల్లిగా.. అది దేహ స్పృహగా మారి క్లబ్బులోకి దూరిపోతుంది. కుర్రాళ్లకు, కుర్రతనం వీడలేని వాళ్లకు ఈ డెస్పసీతో నచ్చి తీరుతుంది. కిక్‌ ఉంది బాస్‌ ఇందులో. ఎక్కడ కిక్‌ ఉందో వీడియో చూసి మీరే వెతుక్కోండి.


కార్స్‌ 3 : లైటెనింగ్‌ ్రస్ట్రయిక్‌
నిడివి : 1 ని. 30 సె.; హిట్స్‌ : 36,83,105

‘కార్స్‌ 3’ ఈ ఏడాది జూన్‌ 16న రిలీజ్‌ అవబోతున్న అమెరికన్‌ 3డి కంప్యూటర్‌ ఏనిమేటెడ్‌ స్పోర్ట్స్‌ మూవీ. పిక్సర్‌ ఏనిమేటెడ్‌ స్టూడియోస్, వాల్డ్‌ డిస్నీ పిక్చర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్స్, కార్స్‌2 వరుసలో వస్తున్న మూడో చిత్రం ఈ కార్స్‌ 3. లెజెండ్‌ రేసర్‌ లైటెనింగ్‌ మెక్‌క్వీన్‌ ను కొత్త జనరేషన్‌ వచ్చి పక్కకు తోసేస్తుంది. బ్లేజింగ్‌ ఫాస్ట్‌ రేసర్స్‌ మధ్యలో నువ్వు పనికిరావని తప్పించడంతో హర్ట్‌ అవుతాడు మెక్‌క్వీన్‌. తను ఎంతగానో ప్రేమించే  కార్‌ రేసింగ్‌కి దూరం అవడాన్ని భరించలేకపోతాడు. క్రూజ్‌ రెమిరెస్‌ అనే యంగ్‌ ఫిమేల్‌ రేస్‌ టెక్నీషియన్‌ హెల్ప్‌ తీసుకుని ట్రాక్‌లో చోటు సంపాదించి తన ప్రత్యర్థి జాక్‌సన్‌ స్ట్రామ్‌తో పోటీ పడతాడు. ‘లైటెనింగ్‌ స్ట్రైక్‌’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో మెక్‌క్వీన్‌ రేస్‌కార్‌ 95.. ట్రాక్‌లో ధ్వంసమైపోవడం మీకు నిరాశను కలిగించినా, ఆ తర్వాత రెన్నోవేషన్‌తో అతడు బరిలోకి రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. బే ది వే.. 2009లో బాబీ హకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘కార్స్‌ 3’కి, ఈ చిత్రానికీ సంబంధం లేదు.

బావరా మన్‌ రా తాంకే : జాలీ ఎల్‌ఎల్‌బి2
నిడివి : 2 ని. 18 సె.; హిట్స్‌ : 48,20,020

బాలీవుడ్‌ కోర్ట్‌ రూమ్‌ కామెడీ డ్రామా మూవీ ‘జాలీ ఎల్‌ఎల్‌బి2’ లోని రెండో సాంగ్‌గా టీ సీరీస్‌ ఈ ‘బావరా మన్‌’ పాటను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. అక్షయ్‌కుమార్, హ్యూమా ఖురేషీ మధ్య ఈ సాంగ్‌ నడుస్తుంది. మోచేతి కట్టుతో అక్షయ్‌.. హీరోయిన్‌ స్కూటీ వెనక కూర్చొని పాట పాడే సన్నివేశంలో హీరోయ్‌న్‌ కంఠం దగ్గర నరం కనిపించడం పాట మెలడీని ధ్వంసం చేస్తుంది. సారీ టు సే. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల్ని ఎందుకు విస్మరిస్తారో! జుబిన్‌ నాతియల్, నీతీ మోహన్‌ గానాలాపన చేశారు. మ్యూజిక్‌ చిర్రంతన్‌ భట్‌. డైరెక్టర్‌ సుభాష్‌ కపూర్‌. 2013 నాటలి జాలీ ఎల్‌ఎల్‌బి కి సీక్వెల్‌గా వస్తున్న ఈ ఎల్‌ఎల్‌బి2 ఫిబ్రవరి 10న థియేటర్స్‌లోకి వస్తోంది. ‘పిచ్చి మనసు నీ కోసం ఎదురుచూస్తోంది. నువ్వు లేకుండా నేను అసంపూర్ణం అయిపోయాను. ఈ ప్రపంచంలోని ఏ పరిమళమూ నన్ను తాకడం లేదు’ అంటూ సాగే ఈ మెలyీ  మనసుకు హత్తుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement