లండన్ : జీవనశైలి మార్పులతో మూడోవంతు క్యాన్సర్లను నిరోధించే అవకాశం ఉన్నా ఆయా ముప్పులపై ప్రజల్లో సరైన అవగాహన కొరవడిందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వాలు భారీగా ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నా క్యాన్సర్ ముప్పు కారకాలపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదని యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం తేల్చింది. క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం కిందిస్థాయికి చేరడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 1300 మంది పెద్దలపై జరిగిన ఈ అథ్యయనంలో క్యాన్సర్ ముప్పు కారకాలపై అత్యధికుల్లో అవగాహన లేదని తేలింది.
శాస్త్రీయ ఆధారాలున్న ముప్పు కారకాలను అంచనా వేయడంలో ప్రజలు గందరగోళంలో ఉన్నారని పేర్కొంది. ఊబకాయంతో క్యాన్సర్ రిస్క్ పొంచి ఉందా అనే దానిపై పలువురు సరిగ్గా బదులివ్వలేకపోయారని తెలిపింది. ముప్పు కారకాలను కొందరు సరిగ్గా గుర్తించలేకుంటే..మరికొందరు శాస్త్రీయ ఆధారాలు లేని ముప్పు కారకాలను నమ్ముతుండటం విస్తుగొలిపింది. ఒత్తిడితో క్యాన్సర్ ముప్పు పొంచిఉందని సగం మంది అభిప్రాయపడితే..నాలుగో వంతు మంది మొబైల్ ఫోన్లతో ముప్పు తప్పదని చెప్పుకొచ్చారు. ఐదుగురిలో ఒకరు మైక్రోవేవ్ ఓవెన్ వాడకం క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment