బాల ప్రేక్షకుల కోసం నాటకోత్సవం..
బాలల దినోత్సవం సందర్భంగా బాల ప్రేక్షకుల కోసం ‘థియేటర్ ఔట్‌రీచ్ యూనిట్’ శుక్ర, శనివారాల్లో ‘థియేటర్ ఫెస్టివల్ ఫర్ యంగ్ ఆడియన్స్’ పేరిట నాటకోత్సవాన్ని నిర్వహిస్తోంది. అబిడ్స్-నాంపల్లి స్టేషన్‌రోడ్డులోని గోల్డెన్ త్రెషోల్డ్‌లో జరగనున్న ఈ కార్యక్రమం వివరాలు.. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ‘భూమిక’ సంస్థ గరికిపాటి ఉదయభాను దర్శకత్వంలో ‘ఏడుచేపల కథ’ నాటికను ప్రదర్శిస్తుంది.
దీని తర్వాత సాయంత్రం 7.30 గంటలకు పాప్‌కార్న్ థియేటర్స్ సహకారంతో క్యామ్స్ హైదరాబాద్ సంస్థ కొరియన్ జానపద కథ ఆధారంగా రూపొందించిన ‘నా వల్ల కాదు’ నాటికను తిరువీర్ దర్శకత్వంలో ప్రదర్శించనుంది. శనివారం సాయంత్రం 6.30 గంటలకు బమ్మిడి సరోజిని, బమ్మిడి జగదీశ్వరరావు రచన ‘అమ్మ చెప్పిన కథ’ను తిరువీర్ దర్శకత్వంలో పాప్‌కార్న్ థియేటర్స్ ప్రదర్శించనుంది. అనంతరం సాయంత్రం 7.30 గంటలకు పీఈపీ థియేటర్స్ షేక్ జాన్ బషీర్ దర్శకత్వంలో ‘ద విజిల్’ నాటికను ప్రదర్శిస్తుంది.
-సాక్షి, సిటీప్లస్