రూరల్ కనెక్ట్
వాగులు, వంకలు తిరుగుతూ... పల్లె బాట పట్టారు బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ కామర్స్ విద్యార్థులు. వరంగల్ జిల్లా సీతంపేట గ్రామంలో పర్యటించారు. ఈ ‘రూరల్ కనెక్ట్’ టూర్‌లో పల్లె వాసులు, వ్యవసాయ కూలీల ఆహార, ఆచార వ్యవహారాలు తెలుసుకున్నారు. అదే ప్రాంతంలోని మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ సంస్థను సందర్శించి విద్యార్థులకు వస్త్రాలు, దుప్పట్లు, ఆహార పదార్థాలు అందించారు.
- జూబ్లీహిల్స్