విమాన కంపెనీల మధ్య పోటీ:ఆఫర్ల మీద ఆఫర్లు! | Competition between the flight companies | Sakshi
Sakshi News home page

విమాన కంపెనీల మధ్య పోటీ:ఆఫర్ల మీద ఆఫర్లు!

Published Thu, Sep 4 2014 4:09 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

విమాన కంపెనీల మధ్య పోటీ:ఆఫర్ల మీద ఆఫర్లు! - Sakshi

విమాన కంపెనీల మధ్య పోటీ:ఆఫర్ల మీద ఆఫర్లు!

విమాన కంపెనీలు పోటీ పడి ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటించాయి. స్పైస్‌జెట్‌ 500 రూపాయలకు వన్‌వే టికెట్‌ ప్రకటించడంతో కస్టమర్ల నుంచి బాగా రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో జెట్ ఎయిర్‌వేస్‌, ఇండిగో సంస్థలు కూడా తగ్గింపు ధరలతో టికెట్లు అమ్మాయి. విమాన ప్రయాణికుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.   ఎయిరిండియా కూడా చవక ధరల టిక్కెట్ల ప్రకటించింది. ఏకంగా వంద రూపాయలకే పరిమిత కాలానికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆ సైట్ ఒక్కసారిగా క్రాష్ కూడా అయింది.

కొన్ని విమాన సంస్థల ఆఫర్లు ఆగస్టు నెలతో ముగిసిపోయాయి.  స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది.ఈ నెల 3వ తేదీతో ఈ ఆఫర్ ముగిసింది.  స్పందన చూసి  స్పైస్‌జెట్‌ ఆఫర్ కాల పరిమితిని ఈ నెల 5వ తేదీ 23.59 గంటల వరకు పొడిగించింది. 2015 జనవరి 16 నుంచి అక్టోబరు 24 వరకు ప్రయాణించే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.  బడ్జెట్ విమానయాన సంస్థ  ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ  విమాన టిక్కెట్ ప్రారంభ ధరను 600 రూపాయలుగా ప్రకటించింది.  అయితే ఆ ఆఫర్ ఆగస్టు 31తో ముగిసిపోయింది.

ఎయిర్ ఏషియా ఇండియా  మరో ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలిపి వివిధ మార్గాల్లో ప్రయాణాలకు  1290 రూపాయలకే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్లను ఈ నెల 7వ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 11వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement