ఫిట్ టూ గేదర్
కాఫీ షాప్‌లు, క్లబ్‌లూ, పార్క్‌లూ, పబ్‌లూ... ఇవేనా... యువతీ యువకులు చిల్‌అవుట్ అవడానికి.. ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేయడానికి అంతకు మించిన హెల్దీ ప్లేస్‌లు ఏమీ లేవా? ఉన్నాయ్ అంటున్నారు సిటీ యూత్. వెల్‌నెస్ సెంటర్లూ, జిమ్‌లూ, ఫిట్‌నెస్ స్టూడియోలూ... యువతీ యువకులకు లేటెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్‌లుగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
‘మాయ’ సినిమా షూటింగ్ గ్యాప్‌లో జూబ్లీహిల్స్‌లోని ఓ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న హీరో హీరోయిన్లు హర్షవర్ధన్, అవంతికా మిశ్రాలు ఫ్రెండ్‌షిప్‌నూ.. ఫిట్‌నెస్‌నూ కంబైన్డ్‌గా మనకు చూపిస్తున్నారు. మరోవైపు సరైన, నచ్చిన కంపెనీ ఉంటే వర్కవుట్స్.. మంచి రిజల్ట్స్ ఇస్తాయని ట్రైనర్లు చెబుతున్నారు.
సరైన కంపెనీ ఉంటే తీరైన ఫిజిక్
ఎక్సర్‌సైజ్‌లు చేసేటైమ్‌లో మంచి కంపెనీ ఉండడం అవసరం. దీని వల్ల రెగ్యులారిటీ పెరుగుతుంది. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఉత్సాహం రెట్టింపవుతుంది. ఎక్సర్‌సైజ్‌లు చేయడంలో క్వాలిటీతో పాటు టైమ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. అందుకే మేం కలిసి వర్కవుట్స్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాం.
- ఎమ్.శేఖర్‌రెడ్డి, హెలియోస్ జిమ్
అబ్డామినల్ వర్కవుట్‌కు ఆసరా...
జిమ్‌బాల్ ఆధారంగా చేసే అబ్డామిన్ వర్కవుట్ ద్వారా పొట్ట భాగం చదునుగా మారుతుంది. అయితే తొలి దశలో ఈ వర్కవుట్ చేయడానికి మరొకరి సాయం తీసుకోవడం అవసరం.
- సత్యబాబు