City youth
-
నిరుద్యోగమే పెద్ద సమస్య
న్యూఢిల్లీ: నిరుద్యోగమొక్కటే తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని దేశంలోని నగరాల యువతలో సగం మంది అభిప్రాయపడుతున్నారు. దేశం సరైన దారిలోనే వెళ్తోందని నగర యువతలో 69 శాతం మంది తెలిపినట్లు ఇప్సోస్ అనే సంస్థ తెలిపింది. ‘వాట్ వర్రీస్ ద వరల్డ్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమతౌల్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇప్సోస్ తెలిపింది. ‘పట్టణాల్లో ఉన్న వారిని అక్టోబరులో ప్రశ్నించినప్పుడు సుమారు 46 శాతం మంది నిరుద్యోగం లేదా ఉపాధి లేకపోవడమన్నది అతిపెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు. నవంబరులో ఈ సంఖ్య మరో మూడు శాతం పెరిగింది’అని సర్వే తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో పౌరులు అతిపెద్ద సమస్యలుగా పేదరికం, సామాజిక అసమతౌల్యతగా గుర్తించారని, తరువాతి స్థానాల్లో నిరుద్యో గం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్యం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. -
అమ్మకు వందనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమానురాగాలు పంచే ఆత్మీ య మాతృమూర్తితో మదర్స్‌డే రోజంతా గడిపేందుకు మెజార్టీ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారట. ఈ నెల 13న మదర్స్‌డే సందర్భంగా భారత్ మ్యాట్రిమోని సంస్థ 6,448 మంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలను ఆన్లైన్లో సేకరించింది. ఇందులో 80 శాతం మంది మదర్స్‌డేను జరుపుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు ఈ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మదర్స్‌డే రోజున తల్లితో రోజంతా గడిపేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. అమ్మతో కలిసి లంచ్, డిన్నర్ చేయడం, షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యువతీ, యువకులు మదర్స్‌డే రోజున ఇంటిపని, వంట పనులతో సతమతÐమవుతున్న అమ్మకు విశ్రాంతినిస్తే ఆమె సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడటం విశేషం. 40 శాతం మంది పురుషులు అమ్మకు అధిక తీరిక సమయం అవసరమని అభిప్రాయపడగా.. 30 శాతం మంది స్త్రీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పిల్లల సంతోషమే తల్లికి ఆనందం కలిగిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడినట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించిన భారత్ మ్యాట్రిమోని మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ తెలిపారు. -
ఫ్లోట్ సీట్.. ఫీల్ గుడ్
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న నగర యువత నూతనఆవిష్కరణలపై ఆసక్తి చూపుతోంది. సామాజిక, ఆరోగ్య స్పృహతో అత్యాధునిక సాధనాలు కనుగొంటోంది. నగర రోడ్లపై ప్రయాణంలో తమకు ఎదురైన సమస్యల పరిష్కారానికి శ్రమించిన సిటీ మిత్రత్రయం... సాఫీ ప్రయాణానికి ఫ్లోట్లు రూపొందించింది. నగరానికి చెందిన మాధవ్ సాయిరామ్ కొల్లి, విశ్వనాథ్ మల్లాది, సంతోష్‌కుమార్ సామల సూరత్‌లోని ఎన్ఐటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. అక్కడ స్నేహితులైన వీరు స్టార్టప్ ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. 2015లో చదువు పూర్తయ్యాక సిటీకి వచ్చి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. అయితే సిటీ రోడ్లపై ప్రయాణం వారిని ఆలోచనలో పడేసింది. చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. 70 శాతం మంది ‘కంఫర్ట్’ జర్నీ చేయలేకపోతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. దీనికి పరిష్కారం కనుగొనాలని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ‘ఫీల్ గుడ్ ఇన్నోవేషన్’ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. అనూహ్య స్పందన.. డ్రైవింగ్ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ‘ఫ్లోట్’లను రూపొందించారు వీరు. వీటిని కార్లు, బైకులలోని సీటుపై అమర్చుకుంటే హాయిగా ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు. ‘నగర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే గంటలకొద్దీ నిరీక్షించాలి. సుదూర ప్రయాణం చేసే సందర్భాల్లో వెన్నునొప్పి సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ జరగక తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు అతి చౌక ధరకే ఫ్లోట్లు తయారు చేశామ’ని చెప్పారీ మిత్రులు. ‘ఇటీవల గుజరాత్లో జరిగిన ఐక్రియేట్ స్టార్టప్‌ల కార్యక్రమంలో నగరం నుంచి మేం ఒక్కరమే పాల్గొన్నాం. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మా ఐడియాకు మెచ్చుకున్నారు. మా ప్రొడక్ట్స్‌కు నగర వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 1500 ఆర్డర్లు వచ్చాయి. కావాల్సినవారు https://www.fueladream.com/ వెబ్సైట్లో సంప్రదించొచ్చు. పనిచేస్తుందిలా... ‘గాలి ప్రసరణ జరిగి రైడర్‌కు హాయిని కలిగించేంచేలా ప్యూర్ లెదర్‌తో తయారు చేసిన ఫ్లోట్ బ్రీతబుల్ మెషిన్లో ఎయిర్ ప్యాకెట్లు ఉండేలా చూశాం. ఇవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటంతో లోపల ఎయిర్ ప్యాకెట్లలో గాలి కదలాడుతుంటుంది. అవసరాన్ని బట్టి 30–70 శాతం మేర గాలి నింపుకొని బైక్, కార్లకు సీటుగా ఉపయోగించుకోవచ్చు. తొలుత 10వేల కిలోమీటర్లు పరీక్షలు చేశాం. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహకారాన్ని తీసుకున్నాం. సత్ఫలితాలు వచ్చాకే మార్కెట్లోకి వచ్చామ’ని వివరించారు. -
కీసరగుట్ట వద్ద నగర యువకుల హల్ చల్
- సర్పంచ్, ఎంపీటీసీలపై దాడి, పరారీ కీసర: రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన యువకుల బృందం కీసర గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మరో ఇద్దరిపై దాడిచేసిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే హౌదరాబాద్ నగరంలోని లాలాపేటకు చెందిన కొందరు యువకులు బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆదివారం సాయంత్రం కీసరగుట్ట వెళ్లారు. అదేసమయంలో కీరస సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ రమేష్ గుప్తాలతోపాటు, మరో ముగ్గురు గ్రామస్తులు కూడా పనిమీద వెళ్లొస్తున్నారు. జెడ్పీగెస్ట్ హౌస్ వద్ద అనుకోకుండా ఇరువర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో 20 మందివరకున్న యువకులు.. సర్పంచ్, ఎంపీటీసీ, మరో ముగ్గురిని చితకబాదారు. ఎంపీటీసీ రమేష్ గుప్తా అక్కడి నుంచి తప్పించుకొని కీసర గ్రామానికి వెళ్లి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో గ్రాస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి పరుగుతీశారు. దాడిచేసిన యువకుల్లో ఇద్దరు మాత్రమే చిక్కగా మిగతావారు పరారయ్యారు. దొరికిన ఇద్దరికి దేహశుద్ధిచేసిన పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ గణేష్, వెంకట్‌ను ఈసీఐఎల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్ టూ ఐఎస్ఐఎస్
హైదరాబాద్: నగరం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లిన విద్యార్థులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్‌ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద బాట పట్టడం కలకలం రేపింది. మాస్టర్ డిగ్రీ కోసం లండన్ వెళ్లిన శాస్త్రీపురానికి చెందిన అలీ పెద్ద కుమారుడు మహ్మద్ అతీఫ్ వసీమ్ (28) పది రోజుల క్రితం సిరియాలో జరిగిన ఉగ్ర యుద్ధంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక్క వసీమే కాదు.. గతంలో కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులై ఇరాక్, సిరియా వెళ్లేందుకు యత్నించిన అనేక మంది ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి పెద్ద దిక్కు అవుతారని కలలు కంటున్న తల్లిదండ్రులకు వసీమ్ లాంటి ఉదంతాలు దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ జాడలు నగరంలో ఏడాదికాలంగా కనిపిస్తున్నాయి. మొదటిసారిగా గతేడాది ఆగస్టులో 18 మంది యువకులు ఫేస్బుక్ ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితులై ఇరాక్ వెళ్లేందుకు యత్నిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమబెంగాల్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరినీ అక్కడి పోలీసులు నగరపోలీసులకు అప్పగించారు. దీంతో అప్పట్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి పంపారు. వారు ఎలాంటి నేరాలు చేయకున్నా ఇప్పుడిప్పుడే అటువైపు ఆకర్షితులయ్యారని, వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహంచి పంపించామని అప్పట్లో పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. వారిపై నిఘా మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా, దుబాయ్‌లో స్థిరపడ్డ నగరానికి చెందిన ఓ యువతి (21)ని ఆమె స్నేహితురాలు ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు టర్కీ వరకు తీసుకెళ్లింది. అయితే, చివరి క్షణాల్లో మనసు మార్చుకుని ఆ యువతి రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది. బజార్‌ఘాట్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ (32) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో 2002-08లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత టక్సాస్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అమెరికాలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేసిన అతనికి ఫేస్బుక్ ద్వారా ఇంగ్లాడ్‌కు చెందిన జోసఫ్ అలియాస్ ఆయేషా (26)తో (ఇస్లాం మతం స్వీకరించి దుబాయ్‌లో ఉంటుంది) పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఆమె ఆమె సల్మాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ప్రపంచం మొత్తం ఇస్తామిక్ రాజ్యం స్థాపించేందుకు పవిత్ర యుద్ధం చేయాలని ఆమె కోరడంతో సల్మాన్ అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలోనే జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ముషీరాబాద్‌కు చెందిన కొందరు ఇంజినీరింగ్ చేసి యువకులు కూడా సిరియా వెళ్లేందుకు కుట్ర పన్నగా పోలీసులు మూడు నెలల క్రితం బైండోవర్ చేశారు. సిరియాలో ఎవరైనా ఇంకా ఉన్నారా... వసీమ్‌లా సిరియాకు వెళ్లిన వారిలో నగరానికి చెందిన వారు ఎవరైనా విద్యార్థులు, యువకులు ఉన్నారా? అనే విషయంపై నగర నిఘా విభాగం పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నగరం నుంచి చదువు, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా తమకు వీసా మంజూరైన దేశంలోనే ఉన్నారా? అక్కడి నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లారా అనే విషయంపై దృష్టి సారించారు. గతంలో ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులైన సుమారు 87 మంది యువకులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీరంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారా? లేదా అనేది ఆరా తీస్తున్నారు. వారి ఫేస్బుక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు... ఐఎస్ఐఎస్ జాడలు మరోసారి తెరపైకి రావడంతో జంటపోలీసు కమిషనరేట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
హైదరాబాద్ టూ ఐఎస్ఐఎస్
-
ఐఎస్‌లో చేరిన నగర యువకుడి మృతి
హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి... ఇటు కుటుంబానికి.. అటు సమాజానికి పేరు తెస్తాడనుకున్న ఆ యువ ఇంజనీర్ ఉగ్ర యుద్ధంలో విగతజీవిగా మారాడు. పది రోజుల క్రితం సిరియాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అదిలాబాద్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ అలీ కుమారుల ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం తన కుటుంబాన్ని నగరానికి మార్చాడు. శాస్త్రీపురంలో నివాసముం టున్న అలీ పెద్ద కుమారుడు మహ్మద్ అతీఫ్ వసీమ్(28) షాదన్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. కొడుకు లండన్ వెళ్తానని పట్టుబట్టడంతో అలీ అప్పులు చేసి మరీ గత ఏడాది నవంబర్‌లో లండన్‌కు పంపించాడు. అక్కడ అతను ఫేస్బుక్ ద్వారా ఇస్లామిక్ స్టేట్స్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు ఆకర్షితుడై సిరియాకు వెళ్లాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను పవిత్ర యుద్దం కోసం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరానని చెప్పాడు. అప్పటి నుంచి ఆందోళనలో ఉన్న అలీ కుటుంబ సభ్యులకు రెండు రోజుల క్రితం పిడుగు లాంటి వార్త తెలిసింది. వసీమ్ సిరియా ఇస్లామిక్ పవిత్ర యుద్దంలో ఏప్రిల్ 24న అమరుడయ్యాడని అక్కడి ఉగ్రవాదులు నగరంలో ఉంటున్న వసీమ్ సోదరుడి ఈ-మెయిల్‌కు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వసీమ్‌ను చూసేందుకు తమకు కడసారి అవకాశం కూడా లేకుండా పోయిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రేసు పావురం
పీజియన్ రేసింగ్! ఈ ట్రెండ్ కుతుబ్‌షాహీలు, నిజామ్ల కాలం నాటిది. నిజామ్లు, రాజ్యాలు పోయినా వాళ్ల అభిరుచులు మాత్రం మిగిలాయి. పీజియన్ రేసింగ్ కొంచెం మోడర్న్ టచ్‌తో ఇప్పుడు సిటీ యూత్‌కి లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. కష్టమైన ఈ హాబీని ఇష్టంగా కొనసాగిస్తున్న హైదరాబాదీ ఫ్యాన్సీయర్స్ గురించి.. - కట్ట కవిత వందల ఏళ్ల కిందటి పీజియన్ రేసింగ్‌ని రివైవ్ చేసి మళ్లీ ట్రెండ్‌గా మార్చింది సిటీ యూత్. ఇప్పుడు పీజియన్ స్పోర్ట్స్ ఓల్డ్ సిటీలో పాపులర్. ఇందుకోసం క్లబ్స్ కూడా ఉన్నాయి. పావురాల ఓనర్స్‌ని ఫ్యాన్సీయర్స్ అంటారు. హైదరాబాద్‌లో గ్రే కలర్ పావురాలే ఎక్కువగా క నబడుతుంటాయి. కానీ వీటిలో జాతులు అనేకం. వాటిలో రేసింగ్‌కు అనుకూలంగా ఉండేవి కొన్నే. తుగుడి, హోమెర్, టంబ్లర్ పీజియన్స్ రేసింగ్‌లో నెంబర్వన్స్. హోమర్ డిస్టెన్స్రేస్లో పాల్గొంటే, టంబ్లర్ తన ఓర్పును పరీక్షించమంటుంది. ఇక తుగుడి తోటిపావురాల్లో తానెంత స్పెషలో చెబుతుంది. గ్రూప్ స్పోర్ట్స్‌లో ఇది చాలా యాక్టివ్. ‘50 ఏళ్ల కిందట ఈ కల్చర్ డిసప్పియర్ అయ్యింది. మళ్లీ 2010లో షకీర్ నోమన్‌తో కలిసి ‘హైదరాబాద్ హోమర్ పీజియన్ క్లబ్’ ప్రారంభించాం. ప్రస్తుతం 14 మంది సభ్యులున్నారు’ అంటున్నారు హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్ సయ్యద్ ఆరిఫ్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ క్లబ్లో టెకీలు, డాక్టర్స్, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. కాస్ట్లీ హాబీ... 8 నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న హోమర్ బ్రీడ్ పావురాలు రేసింగ్‌కి అనుకూలం. మూడు నెలల వయసు నుంచే వీటికి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఏడాది పాటు ఇంటి చుట్టూ తిప్పుతారు. పావురాలు రేసింగ్‌కి పనికొస్తాయా లేదా అనేది వాటి కళ్లను చూస్తే తెలిసిపోతుందంటారు ఫ్యాన్సీయర్స్. వీటి డైట్ ప్రత్యేకం. పది రకాల ధాన్యాలు, మొక్కజొన్నలు, జొన్నలు, కుంకుమపూలు కలిపి ఆహారంగా పెడతారు. రోజూ మూడు పూటలా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ‘ఇది ఎంత మంచి హాబీనో అంతే కాస్ట్లీ కూడా. నెలనెలా రూ. 8 వేల వరకు ఖర్చవుతుంది. వ్యాక్సిన్స్, మెడిసిన్ యూఎస్ నుంచి తెప్పిస్తాం’ అని చెప్పారు హెచ్‌హెచ్‌పీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణ. ఓన్లీ ప్యాషన్... రేసింగ్ కోసం ఆదిలాబాద్, నిర్మల్, వార్దా, బీతుల్, భోపాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పావురాలను.. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి పంపుతారు. ప్రతి పావురానికి రింగ్ నంబర్, కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఉదయమే మంచినీరు తాగించి వదిలేస్తారు. ఆయా పావురాల యజమానుల ఇళ్లలో రిఫరీ ఉంటారు. పావురం ఏ టైమ్‌కు వచ్చిందో చూసుకుని.. దూరాన్ని బట్టి స్పీడ్‌ను కాలిక్యులేట్ చేస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎంత దూరంలో వదిలిపెట్టినా తిరిగి ఇంటికి కరెక్టుగా వచ్చేస్తాయివి.కావాల్సిందల్లా వాటికి డెరైక్షన్ ఇచ్చే టెక్నిక్ మాత్రమే. కొన్నిసార్లు పావురం ఏడాది తరువాత కూడా ఇంటికి చేరుకోవచ్చు. రేసింగ్‌లో కుతుబ్‌షాహీల కాలంలో ఉన్న నిబంధనలనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేసర్స్. పూర్తిగా న్యాయసమ్మతమైన ఈ రేసింగ్‌లో పాల్గొనేవాళ్లు కచ్చితంగా పావురాల ప్రేమికులై ఉండాలనేది నిబంధన. ఇది పూర్తిగా ప్యాషన్‌తో కూడుకున్నది. ఎలాంటి బెట్టింగ్స్ ఉండవు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నయ్, కోల్‌కతాల్లో కూడా రేసింగ్ క్లబ్స్ ఉన్నాయి. అథ్లెట్‌లా... పీజియన్స్ను సంరక్షించాలనే ఆకాంక్షతోనే రేసింగ్‌ను నిర్వహిస్తున్నాం. జంగ్లీ పీజియన్కు, హోమర్‌కి.. లాబ్రడార్, సాధారణ శునకానికి ఉన్న తేడా ఉంటుంది. నా దగ్గర వంద పావురాలున్నాయి. వీటికోసం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు స్పెండ్ చేస్తుంటాను. రేసింగ్ అంత ఈజీ కాదు. వాటికి మంచి పౌష్టికాహారం అందించాలి. ఓ అథ్లెట్‌ను తయారు చేసినట్టు చేయాలి. బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్‌లో ఇదో ఇండస్ట్రీ. దీనికి అక్కడి ప్రభుత్వాల సపోర్ట్ కూడా ఉంది. పక్షులు, జంతువుల కోసం మనమూ ఎంతో కొంత చేయాలి. మన నిర్లక్ష్యం వల్ల పిచ్చుకలు దాదాపు అంతరించిపోయాయి. మేల్కోకుంటే భవిష్యత్‌లో పావురాలుదీ అదే పరిస్థితి. - సయ్యద్ ఆరిఫ్, హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్ -
మాన్సూన్.. మ్యాజిక్
లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వడంలో సిటీ యువతులు ఎప్పుడూ ముందుంటారు. అదే టైంలో సీజనల్ వేరింగ్ కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు. సీజన్‌ను కలర్ఫుల్గా మార్చుకోవడమే కాదు.. కమ్‌ఫర్టబుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ మాన్సూన్ జీన్ మబ్బులు, వర్షపు జల్లులతో వెదర్ డల్‌గా ఉంటుంది. అంతేకాదు చల్లగానూ ఉంటుంది. డల్‌గా ఉండే ఈ సీజన్‌ని గ్రేస్‌ఫుల్‌గా మార్చే టెక్నిక్స్ ఉన్నాయి. అవి తెలుసుకుని ఆచరణలో పెడితే మాన్సూన్ మోస్ట్ వండర్‌ఫుల్‌గా మెరిసిపోతుంది. డ్రెస్సింగ్‌లో వండర్ అనే కితాబులు మీకు బోలెడన్ని అందుతాయి. ప్లెయిన్ ఈజ్ పవర్ఫుల్... వెదర్ డల్‌గా ఉంది కదా అని చాలామంది పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నవాటిని సెలక్ట్ చేస్తుంటారు. కానీ ప్లెయిన్ క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులు ఈ సీజన్‌కి పర్ఫెక్ట్గా సూటవుతాయి. బ్రైట్ కలర్స్, పేస్టల్ షేడ్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. చీరలు సైతం ఇదే తరహాలో ఎంపిక చేసుకోవాలి. బ్రైట్ వైట్... మిమ్మల్ని ఏంజిల్లా మెరిపించే రంగు తెలుపు. కానీ వర్షంలో మెయింటెనెన్స్ కష్టం అని పక్కనపెట్టేస్తుంటారంతా. కానీ కొంచెం అలర్ట్‌గా ఉంటే వీటిని ఎంచక్కా ధరించవచ్చు. లైట్ వెయిట్... సింథటిక్, కాటన్స్లో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డ్రెస్సులనే ఎంచుకోవాలి. ఇవి వానలో తడిసినా త్వరగా ఆరిపోతాయి. కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. వీటిపైకి నెక్ కవర్ అయ్యేలా ప్రింటెడ్ స్కార్ఫ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. లైట్‌వెయిట్ ఫ్యాబ్రిక్‌లో ఏవయసువారికైనా ఇట్టే నప్పే మల్ మల్ కాటన్ బెస్ట్ ఆప్షన్. వీటిలోనే బ్రైట్ కలర్, ఫెస్టివల్ షేడ్స్ ఎంచుకోవచ్చు. చమ్మక్ చుంకీ... బంగారు ఆభరణాలను కాస్త పక్కన పెట్టేసి, మిక్స్డ్ అండ్ ప్లెయిన్ కలర్స్‌లో ఉండే చుంకీ జ్యూవెలరీ ధరించాలి. ప్లెయిన్ డ్రెస్ ధరించి, ఒక పెద్ద చుంకీ జ్యూవెలరీ వేసుకున్నారంటే ఎక్కడున్నా మీరే స్పెషల్ ఎట్రాక్షన్. నప్పనివి... షిఫాన్, క్రేప్స్, హెవీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు ఈ వెదర్లో అంత బాగుండవు. అలాగే హెవీ జీన్స్, హెవీ స్కర్ట్స్ ఈ సీజన్‌కి అవాయిడ్ చేయడమే బెస్ట్. - అర్చితా నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్ archithanarayanam@gmail.com -
కరో కరో..జాల్సా
పబ్ కల్చర్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న సిటీ యుూత్.. వీకెండ్ వస్తే చాలు కరో కరో జర జల్సా అంటున్నారు. డీజే హోరు.. కుర్రకారు జోరు కలగలిసి.. శనివారం సోమాజిగూడలోని కిస్మత్ పబ్ ఊగిపోరుుంది. అదిరిపోయే ఆటపాటలతో సండే సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ వెల్కం చెప్పారు. వుసక వుసక చీకటి.. యుంగ్ హైదరాబాదీస్ కేరింతలకు వేదికైంది. న్యూ ట్రెండ్స్ డిజైనింగ్స్‌లో తళుక్కువున్న యుువతులు కిర్రాక్ డ్యాన్సులతో వుతులు పోగొట్టారు. -
ఫిట్ టూ గేదర్
కాఫీ షాప్‌లు, క్లబ్‌లూ, పార్క్‌లూ, పబ్లూ... ఇవేనా... యువతీ యువకులు చిల్అవుట్ అవడానికి.. ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేయడానికి అంతకు మించిన హెల్దీ ప్లేస్‌లు ఏమీ లేవా? ఉన్నాయ్ అంటున్నారు సిటీ యూత్. వెల్నెస్ సెంటర్లూ, జిమ్‌లూ, ఫిట్నెస్ స్టూడియోలూ... యువతీ యువకులకు లేటెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్‌లుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ‘మాయ’ సినిమా షూటింగ్ గ్యాప్‌లో జూబ్లీహిల్స్‌లోని ఓ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న హీరో హీరోయిన్లు హర్షవర్ధన్, అవంతికా మిశ్రాలు ఫ్రెండ్షిప్నూ.. ఫిట్‌నెస్‌నూ కంబైన్డ్‌గా మనకు చూపిస్తున్నారు. మరోవైపు సరైన, నచ్చిన కంపెనీ ఉంటే వర్కవుట్స్.. మంచి రిజల్ట్స్ ఇస్తాయని ట్రైనర్లు చెబుతున్నారు. సరైన కంపెనీ ఉంటే తీరైన ఫిజిక్ ఎక్సర్సైజ్లు చేసేటైమ్లో మంచి కంపెనీ ఉండడం అవసరం. దీని వల్ల రెగ్యులారిటీ పెరుగుతుంది. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఉత్సాహం రెట్టింపవుతుంది. ఎక్సర్సైజ్లు చేయడంలో క్వాలిటీతో పాటు టైమ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. అందుకే మేం కలిసి వర్కవుట్స్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాం. - ఎమ్.శేఖర్‌రెడ్డి, హెలియోస్ జిమ్ అబ్డామినల్ వర్కవుట్కు ఆసరా... జిమ్బాల్ ఆధారంగా చేసే అబ్డామిన్ వర్కవుట్ ద్వారా పొట్ట భాగం చదునుగా మారుతుంది. అయితే తొలి దశలో ఈ వర్కవుట్ చేయడానికి మరొకరి సాయం తీసుకోవడం అవసరం. - సత్యబాబు -
టెక్నాలజీ కోర్సులు.. కొలువుల బాట
ఇటీవల కాలంలో సిటీ యువతలో రోబోటిక్స్, నానోటెక్నాలజీ, ఏరోనాటిక్స్ వంటి కోర్సులపట్ల ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా విభిన్నమైన కొలువులు తెరపైకి వస్తున్నాయి. ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సమకాలీన జాబ్మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 3డీ ప్రింటింగ్, అటానమస్ యూఏవీలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఫ్యూయల్ సెల్స్, నానో టెక్నాలజీస్, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, రోబోటిక్స్, సిమ్యులేషన్ టూల్స్, స్మార్ట్ స్ట్రక్చర్స్ వంటి టెక్నాలజీస్ సమీప భవిష్యత్తులో చాలారకాల వ్యాపారాలకు చోదక శక్తిగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా అప్‌కమింగ్ టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి కొలువులు లభించే అవకాశముంది. 3డీ ప్రింటింగ్: జాతీయ అంతర్జాతీయస్థాయిలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. 3డీ ప్రింటింగ్. ఏరోనాటిక్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, కాస్టింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ గూడ్స్, హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జువెల్లరీ, మెడికల్ ఇంప్లాంట్స్, స్పోర్ట్స్ గూడ్స్, స్పేస్ సిస్టమ్స్ వంటి వాటిలో 3డీ ప్రింటింగ్ ప్రాధాన్యం పెరిగిపోతోంది. బజాజ్, బార్క్, బీఈఎల్, జనరల్ ఎలక్ట్రిక్, హెచ్ఏఎల్, హనీవెల్, ఇన్ఫోటెక్, లూకాస్, మహీంద్రా, మారుతి, నోకియా, టాటా మోటార్స్, టైటాన్, టీవీఎస్, విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. యూఏవీ డెవలప్మెంట్స్: ఏరియల్ సర్వే, ఉగ్రవాదులపై ఎదురుదాడి, పర్యావరణ అధ్యయనం, కల్లోలిత ప్రాంతాలపై నిఘా, రహదారులపై ట్రాఫిక్ పర్యవేక్షణ వంటి చాలా పనులకు యూఏవీ(అన్మానడ్ ఏరియల్ వెహికల్)మానవ రహిత విమానాలను వినియోగిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో యూఏవీతో పిజ్జాను సైతం వినియోగదారుడికి అందించారు. యూఏవీలను సాధారణంగా ‘డ్రోన్’ అని అంటారు. యూఏవీలను మరింత అభివృద్ధి పర్చేందుకు ఏడీఈ, డీసీ డిజైన్స్, డ్రోన్ ఏరోస్పేస్, ఐడియా పోర్జ్, ఎన్ఏఎల్, ఎన్డీఆర్ ఎఫ్ వంటి సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. యూఏవీల విభాగంలో భవిష్యత్‌లో ఉద్యోగావకాశాల సంఖ్య పెరుగుతుందని నిపుణుల అంచనా. సిమ్యులేషన్ టూల్స్: మానవ శరీర వ్యవస్థ నుంచి మోటార్‌బైక్‌లో ఇంజన్ వ్యవస్థ వరకూ.. ఏదైనా ఒక సిస్టమ్ పనితీరును తెలుసుకొనేందుకు సిమ్యులేషన్ టూల్స్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా వ్యవస్థ నిర్మాణం, పనితీరు, కాలపరిమితి వంటివి సులభంగా తెలుసుకోవచ్చు. హెల్త్‌కేర్, గేమింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో సిమ్యులేషన్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. బీపీ ఎక్స్‌ప్లోరేషన్, జీఈ ఆయిల్ అండ్ గ్యాస్ వంటి సంస్థల్లో సిమ్యులేషన్ టూల్స్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. అడ్వాన్స్డ్ మెటీరియల్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ పరిశోధనల్లోంచి పుట్టిందే అడ్వాన్స్డ్ మెటీరియల్స్. పరిశోధనా రంగంలో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కెమికల్ ఇంజనీర్లకు అడ్వాన్స్డ్ మెటీరియల్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ విభాగంలో కోర్సులు చేసినవారికి జీఈ హెల్త్‌కేర్, టాటా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లిమిటెడ్, బేయర్ క్రాప్ సైన్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థల్లో అవకాశాలున్నాయి. ఫ్యూయెల్ సెల్స్ : కెమికల్ ఇంజనీరింగ్‌లో ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ ..ఫ్యూయెల్ సెల్స్. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఇంధన వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత పెరిగింది. ప్రత్యామ్నాయ వనరులతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను సృష్టించేందుకు దోహదపడే కోర్సు.. ఫ్యూయెల్ సెల్స్. ఈ కోర్సు చేసినవారికి ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో అవకాశాలుంటాయి. ప్రస్తుతం దేశంలో ఫ్యూయెల్ సెల్స్ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నానోటెక్ : భవిష్యత్తంతా నానో టెక్నాలజీదేనని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఐఐటీలు ఇప్పటికే పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు నానో టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఎనర్జీ సిస్టమ్స్: ఒక దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే.. ఆ దేశంలోని విద్యుత్, ఇంధన ఉత్పత్తులదే ప్రధాన పాత్ర. ఇలాంటి ఉత్పత్తులు తయారయ్యేందుకు ఉపయోగపడేవే ఎనర్జీ సిస్టమ్స్. సీమెన్స్ ఎనర్జీ, బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు ఎనర్జీ సిస్టమ్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. రోబోటిక్స్: ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానికల్ ఇంజనీరింగ్ల కలయికతో రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఆవిర్భవానికి పునాది పడిందని చెప్పుకోవచ్చు. హెల్త్‌కేర్ రంగంలో సర్జరీలకు రోబోల వినియోగం పెరిగింది. రోబోటిక్స్ రంగంలో పట్టు సాధిస్తే ఆకాశమే హద్దుగా కెరీర్లో ఎదగొచ్చు. దేశ విదేశాల్లో చాలా అవకాశాలున్నాయి. భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత ప్రగతి సాధించనుంది. సెంటర్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్... ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌లో రోబోటిక్స్ పరిశోధకులకు సహకరిస్తోంది.