రేసు పావురం | city youth new trend as Pigeon racing | Sakshi
Sakshi News home page

రేసు పావురం

Published Thu, Apr 23 2015 10:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

రేసు పావురం

రేసు పావురం

పీజియన్ రేసింగ్! ఈ ట్రెండ్ కుతుబ్‌షాహీలు, నిజామ్‌ల కాలం నాటిది. నిజామ్‌లు, రాజ్యాలు పోయినా వాళ్ల అభిరుచులు మాత్రం మిగిలాయి. పీజియన్ రేసింగ్ కొంచెం మోడర్న్ టచ్‌తో ఇప్పుడు సిటీ యూత్‌కి లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. కష్టమైన ఈ హాబీని ఇష్టంగా కొనసాగిస్తున్న హైదరాబాదీ ఫ్యాన్సీయర్స్ గురించి..
- కట్ట కవిత
 
వందల ఏళ్ల కిందటి పీజియన్ రేసింగ్‌ని రివైవ్ చేసి మళ్లీ ట్రెండ్‌గా మార్చింది సిటీ యూత్. ఇప్పుడు పీజియన్ స్పోర్ట్స్ ఓల్డ్ సిటీలో పాపులర్. ఇందుకోసం క్లబ్స్ కూడా ఉన్నాయి. పావురాల ఓనర్స్‌ని ఫ్యాన్సీయర్స్ అంటారు. హైదరాబాద్‌లో గ్రే కలర్ పావురాలే ఎక్కువగా క నబడుతుంటాయి. కానీ వీటిలో జాతులు అనేకం. వాటిలో రేసింగ్‌కు అనుకూలంగా ఉండేవి కొన్నే. తుగుడి, హోమెర్, టంబ్లర్ పీజియన్స్ రేసింగ్‌లో నెంబర్‌వన్స్. హోమర్  డిస్టెన్స్‌రేస్‌లో పాల్గొంటే, టంబ్లర్ తన ఓర్పును పరీక్షించమంటుంది.
 
ఇక తుగుడి తోటిపావురాల్లో తానెంత స్పెషలో చెబుతుంది. గ్రూప్ స్పోర్ట్స్‌లో ఇది చాలా యాక్టివ్. ‘50 ఏళ్ల కిందట ఈ కల్చర్ డిసప్పియర్ అయ్యింది. మళ్లీ 2010లో షకీర్ నోమన్‌తో కలిసి ‘హైదరాబాద్ హోమర్ పీజియన్ క్లబ్’ ప్రారంభించాం. ప్రస్తుతం 14 మంది సభ్యులున్నారు’ అంటున్నారు హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్ సయ్యద్ ఆరిఫ్. ఈయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ క్లబ్‌లో టెకీలు, డాక్టర్స్, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు.
 
కాస్ట్‌లీ హాబీ...
8 నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న హోమర్ బ్రీడ్ పావురాలు రేసింగ్‌కి అనుకూలం. మూడు నెలల వయసు నుంచే వీటికి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఏడాది పాటు ఇంటి చుట్టూ తిప్పుతారు. పావురాలు రేసింగ్‌కి పనికొస్తాయా లేదా అనేది వాటి కళ్లను చూస్తే తెలిసిపోతుందంటారు ఫ్యాన్సీయర్స్. వీటి డైట్ ప్రత్యేకం. పది రకాల ధాన్యాలు, మొక్కజొన్నలు, జొన్నలు, కుంకుమపూలు కలిపి ఆహారంగా పెడతారు. రోజూ మూడు పూటలా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ‘ఇది ఎంత మంచి హాబీనో అంతే కాస్ట్‌లీ కూడా. నెలనెలా రూ. 8 వేల వరకు ఖర్చవుతుంది. వ్యాక్సిన్స్, మెడిసిన్ యూఎస్ నుంచి తెప్పిస్తాం’ అని చెప్పారు హెచ్‌హెచ్‌పీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణ.
 
ఓన్లీ ప్యాషన్...
రేసింగ్ కోసం ఆదిలాబాద్, నిర్మల్, వార్దా, బీతుల్, భోపాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పావురాలను.. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి పంపుతారు. ప్రతి పావురానికి రింగ్ నంబర్, కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఉదయమే మంచినీరు తాగించి వదిలేస్తారు. ఆయా పావురాల యజమానుల ఇళ్లలో రిఫరీ ఉంటారు. పావురం ఏ టైమ్‌కు వచ్చిందో చూసుకుని.. దూరాన్ని బట్టి స్పీడ్‌ను కాలిక్యులేట్ చేస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు.

ఎంత దూరంలో వదిలిపెట్టినా తిరిగి ఇంటికి కరెక్టుగా వచ్చేస్తాయివి.కావాల్సిందల్లా వాటికి డెరైక్షన్ ఇచ్చే టెక్నిక్ మాత్రమే. కొన్నిసార్లు పావురం ఏడాది తరువాత కూడా ఇంటికి చేరుకోవచ్చు. రేసింగ్‌లో కుతుబ్‌షాహీల కాలంలో ఉన్న నిబంధనలనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేసర్స్. పూర్తిగా న్యాయసమ్మతమైన ఈ రేసింగ్‌లో పాల్గొనేవాళ్లు కచ్చితంగా పావురాల ప్రేమికులై ఉండాలనేది నిబంధన. ఇది పూర్తిగా ప్యాషన్‌తో కూడుకున్నది. ఎలాంటి బెట్టింగ్స్ ఉండవు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నయ్, కోల్‌కతాల్లో కూడా రేసింగ్ క్లబ్స్ ఉన్నాయి.
 
అథ్లెట్‌లా...
పీజియన్స్‌ను సంరక్షించాలనే ఆకాంక్షతోనే రేసింగ్‌ను నిర్వహిస్తున్నాం. జంగ్లీ పీజియన్‌కు, హోమర్‌కి.. లాబ్రడార్, సాధారణ శునకానికి ఉన్న తేడా ఉంటుంది. నా దగ్గర వంద పావురాలున్నాయి. వీటికోసం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు స్పెండ్ చేస్తుంటాను. రేసింగ్ అంత ఈజీ కాదు. వాటికి మంచి పౌష్టికాహారం అందించాలి. ఓ అథ్లెట్‌ను తయారు చేసినట్టు చేయాలి. బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్‌లో ఇదో ఇండస్ట్రీ. దీనికి అక్కడి ప్రభుత్వాల సపోర్ట్ కూడా ఉంది. పక్షులు, జంతువుల కోసం మనమూ ఎంతో కొంత చేయాలి. మన నిర్లక్ష్యం వల్ల పిచ్చుకలు దాదాపు అంతరించిపోయాయి. మేల్కోకుంటే భవిష్యత్‌లో పావురాలుదీ అదే పరిస్థితి.
 - సయ్యద్ ఆరిఫ్, హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement