Pigeon racing
-
ఓ పావురమా.. పందెం గెలువుమా
పావురం.. స్వేచ్ఛకు ప్రతిరూపం. శాంతికి చిహ్నం. రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరే ఆ కపోతాలను చూసి మది పులకిస్తుంది. అనేకమంది ఏ గింజలో వేసి వాటిని తింటున్న ఆ పావురాలను చూస్తూ మైమరచిపోతారు. అటువంటి పావురాలకు కూడా పోటీలు పెడుతున్నారు కొందరు. ఆ పోటీల్లో పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. సాక్షి, నెల్లూరు: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లోనే కాదు.. మన దేశంలోను ఇవి జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్‌లు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడు కేంద్రంగా వెలిసిన క్లబ్‌ల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. చెన్నై ప్రాంతానికి చేరువగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో భారీ ఎత్తున బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్‌లు ఉన్నాయి. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్ సొసైటీలున్నాయి. చెన్నైలో అధికారికంగా రిజిస్టర్ చేసుకుని, పోలీస్, అటవీశాఖల అనుమతి తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్ కార్డ్స్‌తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇటీవల పందేల కోసం తీసుకొచ్చిన పావురాలను పోలీసులు పట్టుకోవడంతో పావురాల రేసింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి పావురాల రేసింగ్‌కు సిద్ధపడుతుండగా పోలీసులు ఏడుగురిని అరెస్టుచేసి 500 పావురాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో బెట్టింగ్ విషయం బయటపడింది. ఇటీవల ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద పోలీసులు దాదాపు వెయ్యి పావురాలను స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కర్నూలు జిల్లాలో పీజియన్ రేసింగ్ క్లబ్‌లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు పందెం రాయుళ్లు ముందుగా చెన్నై నిర్వాహకులతో కలిసి పావురాల రేసింగ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ముందుగా వచ్చిన పావురంపై బెట్టింగ్ కాసిన దానికి రెండింతల సొమ్ము వస్తుంది. ముందుగా కోడింగ్ ఉన్న ట్యాగ్‌లను ప్రత్యేక ఆన్లైన్లో ఉంచుతారు. అలా ఆన్లైన్లో చూసిన బెట్టింగ్ రాయుళ్లు తనకు నచ్చిన పావురంపై పందెం కాస్తారు. బెట్టింగ్‌ల నిర్వహణకు ప్రత్యేక టీం ఉంటుంది. ఒక్కో పందెంలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయంటే ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాతావరణ అనుకూలత దృష్ట్యా ఏటా శీతాకాలంలో మాత్రమే ఈ పందేలు జరుగుతాయి. ఈ క్లబ్‌ల సభ్యులు పెద్దసంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు. ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు. పావురం పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలికి క్లబ్‌కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్ కార్డ్‌తో కూడిన ట్యాగ్ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్‌కు వస్తున్నాయి. పావురాన్ని వదిలిన ప్రాంతం నుంచి యజమాని ఇంటికి చేరిన వెంటనే ట్యాగ్‌ను స్క్రాచ్ చేసి, అక్కడున్న సంఖ్యను ప్రత్యేక యాప్ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తుంటారు. దీన్లోని సమాచారం ఆధారంగా గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్‌లకూ చేరవేస్తారు. ఇప్పటికీ బ్రిటీష్ బ్లడ్లైనే.. కపోతాల్లో బ్లడ్‌లైన్ (వంశం) ఉంటుంది. బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్‌లకు చెందిన పావురాల బ్లడ్ లైనే (ఉమర్స్) ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలోని చాలా క్లబ్‌లు ఉమర్స్ జాతి పావురాలనే ఎక్కువగా పందేలకు ఉపయోగిస్తున్నాయి. ఈ పావురాల శక్తి సామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించి అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి అంచనా వేస్తారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే ఈ పావురాలకు ప్రొఫైల్ ఉంటుంది. వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబరు ఆధారంగా పెడిగ్రీగా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. పందెం పావురాలను స్వాధీనం చేసుకున్నాం నాయుడుపేట పరిధిలో పావురాల బెట్టింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఒక వాహనంలో ఉన్న పక్షులకు అనుమతి ఉన్న పత్రాలు చూపించారు. మరో వాహనంలో ఉన్న వాటికి మాత్రం ఫేక్ అనుమతి చూపించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి చేర్చాం. ఏడుగురు ని«ందితులను అరెస్ట్ చేశాం. బెట్టింగ్‌లు జరుగుతున్నాయని విచారణలో తేలింది. – వై.సోమయ్య,సీఐ, నాయుడుపేట -
ఏటా శీతాకాలంలో కపోతాల రేసింగ్స్
♦ ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లిన సైనికులు సందేశాలను బేస్ క్యాంప్‌లకు పంపడానికి పావురాలను వినియోగించే వాళ్లు. ప్రస్తుతం పీజియన్ క్లబ్బుల సభ్యులు ఎలాంటి బహుమతులు, నగదు లావాదేవీల వంటివి లేకుండా కేవలం సరదా, పేరు కోసం వీటితో పందేలు నిర్వహిస్తున్నారు. ♦ క్లబ్బులు కనిష్టంగా 50 కి.మీ. (వాయుమార్గం) దూరంతో పోటీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని క్లబ్బులు గరిష్టంగా 1,000 కి.మీ, చెన్నై కేంద్రంగా పని చేసేవి 1,700 కి.మీ వరకు దూరంతో పందాలు నిర్వహిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్దయెత్తున దేశ, విదేశాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్బులు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు చెన్నై, కర్నూలు, దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా పీజియన్ క్లబ్బులు ఉన్నాయి. యంగర్స్, ఓపెన్, డర్బీ కేటగిరీల్లో పోటీలు జరుగుతుండటం గమనార్హం. ఎక్కడో వెయ్యి, అంతకు మించిన దూరంలో వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఎంత సమయంలో అవి వాటి యజమానుల ఇళ్లకు చేరుకున్నాయన్నది నిర్దిష్ట పద్దతిలో లెక్కించి నిర్వాహకులు విజేతను ప్రకటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 250 క్లబ్బులు కోడి పందాలు, ఇతర పోటీల స్థాయిలో ప్రాచుర్యం లేకపోయినా పావురాల పందాలు ఏటా జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా పోటీలు జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్ కార్డ్స్‌తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశ వ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్బులు ఉండటం గమనార్హం. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్ సొసైటీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో హైదరాబాద్ హోమర్ పీజియన్స్ క్లబ్ (హెచ్ఎస్పీసీ), డెక్కన్ పీజియన్స్ స్పోర్ట్స్ క్లబ్ (డీపీఎస్సీ), హైదరాబాద్ హోమ్ పీజియన్ క్లబ్ (హెచ్‌హెచ్‌పీసీ) కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అధికారికంగా రిజిస్టర్ చేసుకుని.. పోలీస్, అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. వీటి నిర్వాహకులను పలకరిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ బ్రిటిష్ బ్లడ్లైనే.. మనుషుల్లో మాదిరిగానే కపోతాల్లో బ్లడ్ లైన్ (వంశం) ఉంటుంది. దశాబ్దాల క్రితం బ్రిటిషు వాళ్లు తీసుకువచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్‌లకు చెందిన పావురాల బ్లడ్ లైనే (ఉమర్స్) ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోని చాలా క్లబ్బులు ఉమర్స్ జాతికి చెందిన పావురాలనే ఎక్కువగా పందాల కోసం వాడుతున్నాయి. ప్రత్యేకంగా వెబ్‌సైట్స్, సహకరించే యాప్స్‌తో పాటు వాట్సాప్ గ్రూపుల సాయంతో పక్కా మాన్యువల్స్‌తో పని చేస్తుంటాయి. పందెం నిర్వహించే ఏడాది పుట్టిన వాటికి యంగర్స్ శ్రేణిలో, మిగిలిన వాటిని ఓపెన్ శ్రేణిలో రేసులు జరుగుతాయి. గతంలో జరిగిన పందాల్లో గెలిచిన వాటికి ప్రత్యేకంగా డర్బీ కేటగిరీ ఉంటుంది. ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు వాతావరణ అనుకూలత దృష్ట్యా ప్రతి ఏడాదీ శీతాకాలంలో మాత్రమే ఈ పందాలు జరుగుతాయి. ఈ క్లబ్‌లలో సభ్యులుగా> ఉన్న వాళ్లు పదులు, వందల సంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు. వీటికి ప్రతి రోజూ అరగంట, పందాల సీజన్లో దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా తాగునీరు, ఆహారం అందజేస్తారు. వీటికి తమను పెంచే యజమాని ఇల్లు బాగా గుర్తుండిపోతుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు. ఈ పావురాలు పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలుకు క్లబ్‌కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్ కార్డ్‌తో కూడిన ట్యాగ్ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్‌కు వస్తున్నాయి. పావురం వదిలిన ప్రాంతం నుంచి పావురం యజమాని ఇంటికి చేరిన వెంటనే ట్యాగ్‌ను స్క్రాచ్ చేసి, అక్కడ ఉన్న సంఖ్యను ప్రత్యేక యాప్ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తుంటారు. వీటిలోని సమాచారం ఆధారంగా పావురం ప్రయాణించి సమయం, ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకుని నిర్వాహకులు గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్బులకూ చేరవేస్తారు. తద్వారా క్లబ్బుల వివరాలు, పావురాల విశిష్టత తదితరాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతాయన్న మాట. రాష్ట్రంలోని షాద్‌నగర్, మెదక్ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పీజియన్ రేసింగ్ క్లబ్‌లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. దాడులు తప్పించుకునేందుకు దారి తప్పి పావురాలను నిర్ణీత ప్రాంతానికి తీసుకువెళ్లే నిర్వాహకులు అక్కడ ఒకేసారి విడిచిపెడతారు. అవన్నీ గుంపులుగానే ప్రయాణిస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ పావురాలు ఎగురుతాయి. మధ్యలో ఏదో ఒక చోట సేదతీరి, ఆహారం సేకరించి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తాయి. రోజుకు 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని అంచనా. కొన్ని సందర్భాల్లో పావురాలు గుంపును వదిలి పక్కకు వస్తుంటాయి. అలాంటి వాటిపై గద్దలు వంటి పక్షులు దాడులకు దిగుతాయి. అలాంటప్పుడు పావురాలు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయాణించాల్సిన మార్గం వదిలి వేరే మార్గంలో ప్రయాణిస్తాయి. ఇలాంటివే ఇటీవల ఖమ్మం తదితర ప్రాంతాల్లో కనిపించాయి. వాటి కాళ్లకు ఉన్న స్క్రాచ్ కార్డులపై ఉన్న చైనా అక్షరాలను చూసి అంతా అనుమానించారు. అయితే ఇవి పందెం పావురాలని తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ పావురాలు ప్రాణాలతో ఉంటే మాత్రం కాస్త ఆలస్యమైనా తమ యజమాని ఇంటికి వచ్చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ఈ పందాల్లో ఎక్కడా నగదు లావాదేవీలు, బహుమతులు ఉండవు. కేవలం గెలిచిన వాటికి ఓ ట్రోఫీ లభిస్తుంది. ఆ పేరుతో పాటు గెలుపొందిన పావురానికి పుట్టే పిల్లలకు (బ్రీడ్) మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.80 వేలకు అమ్మొచ్చు. హాబీగానూ, పేరు కోసం, ఇలా అమ్ముకునేందుకే పావురాలను పెంచి, పందాల్లో పాల్గొంటాం’అని ఓ క్లబ్ సభ్యుడు తెలిపారు. కళ్లు, రెక్కలే సామర్థ్యానికి కొలమానం ఈ పావురాల శక్తిసామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించిన నేపథ్యంలో అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి తెలుసుకుంటారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే... ఈ పావురాలకూ ప్రొఫైల్ ఉంటుంది. వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబర్ ఆధారంగా ‘పెడిగ్రీ’గా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. అందులో పావురం వయస్సు, దాని పుట్టుక వివరాలు, అవి ఏ రేసుల్లో పాల్గొన్నాయి? ఎన్నింటిలో గెలిచాయి? ఎంతెంత దూరం ఎగిరాయి? తదితర అంశాలు పొందుపరుస్తారు. వీటన్నిటినీ బట్టి ఆయా పావురాల సంతతికి డిమాండ్ ఉంటుంది. -
రేసు పావురం
పీజియన్ రేసింగ్! ఈ ట్రెండ్ కుతుబ్‌షాహీలు, నిజామ్ల కాలం నాటిది. నిజామ్లు, రాజ్యాలు పోయినా వాళ్ల అభిరుచులు మాత్రం మిగిలాయి. పీజియన్ రేసింగ్ కొంచెం మోడర్న్ టచ్‌తో ఇప్పుడు సిటీ యూత్‌కి లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. కష్టమైన ఈ హాబీని ఇష్టంగా కొనసాగిస్తున్న హైదరాబాదీ ఫ్యాన్సీయర్స్ గురించి.. - కట్ట కవిత వందల ఏళ్ల కిందటి పీజియన్ రేసింగ్‌ని రివైవ్ చేసి మళ్లీ ట్రెండ్‌గా మార్చింది సిటీ యూత్. ఇప్పుడు పీజియన్ స్పోర్ట్స్ ఓల్డ్ సిటీలో పాపులర్. ఇందుకోసం క్లబ్స్ కూడా ఉన్నాయి. పావురాల ఓనర్స్‌ని ఫ్యాన్సీయర్స్ అంటారు. హైదరాబాద్‌లో గ్రే కలర్ పావురాలే ఎక్కువగా క నబడుతుంటాయి. కానీ వీటిలో జాతులు అనేకం. వాటిలో రేసింగ్‌కు అనుకూలంగా ఉండేవి కొన్నే. తుగుడి, హోమెర్, టంబ్లర్ పీజియన్స్ రేసింగ్‌లో నెంబర్వన్స్. హోమర్ డిస్టెన్స్రేస్లో పాల్గొంటే, టంబ్లర్ తన ఓర్పును పరీక్షించమంటుంది. ఇక తుగుడి తోటిపావురాల్లో తానెంత స్పెషలో చెబుతుంది. గ్రూప్ స్పోర్ట్స్‌లో ఇది చాలా యాక్టివ్. ‘50 ఏళ్ల కిందట ఈ కల్చర్ డిసప్పియర్ అయ్యింది. మళ్లీ 2010లో షకీర్ నోమన్‌తో కలిసి ‘హైదరాబాద్ హోమర్ పీజియన్ క్లబ్’ ప్రారంభించాం. ప్రస్తుతం 14 మంది సభ్యులున్నారు’ అంటున్నారు హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్ సయ్యద్ ఆరిఫ్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ క్లబ్లో టెకీలు, డాక్టర్స్, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. కాస్ట్లీ హాబీ... 8 నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న హోమర్ బ్రీడ్ పావురాలు రేసింగ్‌కి అనుకూలం. మూడు నెలల వయసు నుంచే వీటికి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఏడాది పాటు ఇంటి చుట్టూ తిప్పుతారు. పావురాలు రేసింగ్‌కి పనికొస్తాయా లేదా అనేది వాటి కళ్లను చూస్తే తెలిసిపోతుందంటారు ఫ్యాన్సీయర్స్. వీటి డైట్ ప్రత్యేకం. పది రకాల ధాన్యాలు, మొక్కజొన్నలు, జొన్నలు, కుంకుమపూలు కలిపి ఆహారంగా పెడతారు. రోజూ మూడు పూటలా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ‘ఇది ఎంత మంచి హాబీనో అంతే కాస్ట్లీ కూడా. నెలనెలా రూ. 8 వేల వరకు ఖర్చవుతుంది. వ్యాక్సిన్స్, మెడిసిన్ యూఎస్ నుంచి తెప్పిస్తాం’ అని చెప్పారు హెచ్‌హెచ్‌పీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణ. ఓన్లీ ప్యాషన్... రేసింగ్ కోసం ఆదిలాబాద్, నిర్మల్, వార్దా, బీతుల్, భోపాల్ వంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పావురాలను.. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి పంపుతారు. ప్రతి పావురానికి రింగ్ నంబర్, కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఉదయమే మంచినీరు తాగించి వదిలేస్తారు. ఆయా పావురాల యజమానుల ఇళ్లలో రిఫరీ ఉంటారు. పావురం ఏ టైమ్‌కు వచ్చిందో చూసుకుని.. దూరాన్ని బట్టి స్పీడ్‌ను కాలిక్యులేట్ చేస్తారు. ముందుగా చేరుకున్న పావురాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎంత దూరంలో వదిలిపెట్టినా తిరిగి ఇంటికి కరెక్టుగా వచ్చేస్తాయివి.కావాల్సిందల్లా వాటికి డెరైక్షన్ ఇచ్చే టెక్నిక్ మాత్రమే. కొన్నిసార్లు పావురం ఏడాది తరువాత కూడా ఇంటికి చేరుకోవచ్చు. రేసింగ్‌లో కుతుబ్‌షాహీల కాలంలో ఉన్న నిబంధనలనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేసర్స్. పూర్తిగా న్యాయసమ్మతమైన ఈ రేసింగ్‌లో పాల్గొనేవాళ్లు కచ్చితంగా పావురాల ప్రేమికులై ఉండాలనేది నిబంధన. ఇది పూర్తిగా ప్యాషన్‌తో కూడుకున్నది. ఎలాంటి బెట్టింగ్స్ ఉండవు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నయ్, కోల్‌కతాల్లో కూడా రేసింగ్ క్లబ్స్ ఉన్నాయి. అథ్లెట్‌లా... పీజియన్స్ను సంరక్షించాలనే ఆకాంక్షతోనే రేసింగ్‌ను నిర్వహిస్తున్నాం. జంగ్లీ పీజియన్కు, హోమర్‌కి.. లాబ్రడార్, సాధారణ శునకానికి ఉన్న తేడా ఉంటుంది. నా దగ్గర వంద పావురాలున్నాయి. వీటికోసం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు స్పెండ్ చేస్తుంటాను. రేసింగ్ అంత ఈజీ కాదు. వాటికి మంచి పౌష్టికాహారం అందించాలి. ఓ అథ్లెట్‌ను తయారు చేసినట్టు చేయాలి. బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్‌లో ఇదో ఇండస్ట్రీ. దీనికి అక్కడి ప్రభుత్వాల సపోర్ట్ కూడా ఉంది. పక్షులు, జంతువుల కోసం మనమూ ఎంతో కొంత చేయాలి. మన నిర్లక్ష్యం వల్ల పిచ్చుకలు దాదాపు అంతరించిపోయాయి. మేల్కోకుంటే భవిష్యత్‌లో పావురాలుదీ అదే పరిస్థితి. - సయ్యద్ ఆరిఫ్, హెచ్‌హెచ్‌పీసీ ట్రెజరర్