న్యూ ప్లేబాయ్
సిటీలోని పార్టీక్రౌడ్‌కు ప్లేబాయ్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ అమెరికా పబ్.. ఇండియాలో కాలుపెట్టడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. చివరకు మన సిటీ ఈ పబ్‌కి వెల్‌కమ్ చెబుతోంది. శనివారం ఈ పబ్ లాంచింగ్ ఉండటంతో సిటీలోని పేజ్‌త్రీ, పార్టీ పీపుల్ ఫుల్ అటెన్షన్‌లోకి వచ్చేశారు. పాస్‌ల కోసం క్యూ కట్టేశారు. లాంచ్‌పార్టీకి ఇన్వైట్ రావడం స్టేటస్ సింబల్‌గా మారింది. ముంబైకి చెందిన పీబీఐ లైఫ్‌స్టైల్ సంస్థ భాగస్వామ్యంతో ఈ పబ్ సిటీలో ఏర్పాటవుతోంది.
వాటీజ్ ప్లేబాయ్?
న్యూడ్ పిక్చర్స్‌తో మతులు పోగొట్టే కాలిఫోర్నియాకు చెందిన ప్లేబాయ్ మేగ్‌జైన్ బ్రాండ్ గురించి వినని వారు అరుదే. ఈ మ్యాగజైన్ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే దాదాపు 40కిపైగా క్లబ్స్ విదేశాల్లో ఉర్రూతలూగిస్తున్నాయి. బన్నీలని పిలిచే సగం దుస్తుల వెయిట్రెసెస్, విభిన్న రకాల గెటప్స్‌లో ఉండే టీజింగ్ క్వీన్స్ ఈ క్లబ్స్, పబ్స్ స్పెషాలిటీ. ఇక హాట్ హాట్ మ్యూజిక్, పార్టీ యానిమల్స్‌కు ఫుల్ ఫ్రీడమ్.. సరేసరి. మ్యాగజైన్ తరహాలోనే ఈ పబ్‌కు కూడా ఇండియాలో ఇంతకాలం అనుమతి దొరకలేదని.. గోవాలో మాత్రం 22వేల చదరపు అడుగుల్లో సన్‌షైన్ రిసార్ట్ పేరుతో ఇలాంటి క్లబ్ నడుస్తోందని సమాచారం.
స్టైల్ మార్చి.. సిటీకి వస్తోంది
ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో.. ప్లేబాయ్ పబ్ నిర్వాహకులు దిగివచ్చి ఎటువంటి వల్గారిటీకి తావులేకుండా పబ్ ఏర్పాటుకు ఓకే చెప్పారట. దీని ఫలితంగానే మన సిటీలోకి రాగలిగింది ప్లేబాయ్. అమెరికాకు చెందిన డిజైనర్ మోహిని తాడికొండ మన సంప్రదాయాలు ఒప్పుకునే రీతిలో డ్రెస్‌లు డిజైన్ చేశారని తెలుస్తోంది. భారతీయ విలువలకు అనుగుణంగానే బన్నీస్ ఉంటారని ప్లేబాయ్ నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. సిటీలో బన్నీలుగా సేవలందించే అరడజను మంది విదేశీ యువతులకు ఇండియన్ వాల్యూస్, డ్రెస్సింగ్ విషయంలో ఇప్పటికే అవసరమైన శిక్షణ ఇచ్చారట. చాలా మందిలో ప్లేబాయ్‌కి ఉన్న ‘ఎ’ సర్టిఫికెట్ ముద్రను తొలగించుకుంటూ.. దీన్ని ఒక లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా ప్రాచుర్యంలోకి తేవడమే తమ లక్ష్యమని ఈ బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తొలి ప్లేబాయ్ క్లబ్‌కు వేదిక అవుతున్న సిటీ.. ఈ మోస్ట్ హాటెస్ట్ ట్రెండ్‌ని ఎలా ట్రీట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ!
- ఎస్బీ