నయా టెక్నాలజీతో క్యాన్సర్‌కు చెక్
క్యాన్సర్ అంటేనే ప్రాణాంతకవ్యాధి. ఇది సంక్రమిస్తే ప్రాణాలు పోతాయన్న భావన ప్రజల్లో ఉంది. ఇకపై ఇటువంటి భయం లేకుండా మేమున్నామంటూ భరోసానిస్తోంది శేరిలింగంపల్లి నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్.
అమెరికాలోని పిట్స్‌బర్గ్ గ్రూప్ భాగస్వామ్యంతో క్యాన్సర్ రోగులకు అధునాతన సేవలందించడంతో పాటు వారిలో మనోధైర్యం నింపేలా కౌన్సెలింగ్‌ను అందిస్తోంది. రోగులను జాగ్రత్తగా చూసుకునే ప్రొఫెషనల్ నర్సులు ఉండటం కూడా ఈ ఆస్పత్రికి రోగులు క్యూ కట్టడానికి ప్లస్ అవుతోంది. దేశంలో మరెక్కడా లేని అధునాతన యంత్రాలను కొనుగోలు చేయడంతో పాటు బెస్ట్ ట్రీట్‌మెంట్‌ను ఇస్తోంది. ఎలాంటి క్యాన్సర్ వ్యాధినైనా మటుమాయం చేస్తామన్న ధీమా కల్పిస్తోంది. అందుకే ఇప్పటి వరకు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా బాట పట్టే నగరవాసులు అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు దారి మళ్లారు. యూఎస్‌ఏకు వెళ్తే అయ్యే ఖర్చుతో పొలిస్తే ఇక్కడ ట్రీట్‌మెంట్ ఖర్చు కూడా తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం.
అన్నీ కొత్తవే...
రూ.30 కోట్ల ఖర్చుతో నగరంలోనే తొలిసారిగా రేడియో సర్జరీ టెక్నాలజీ ‘ట్రూ బీమ్ ఎస్‌టీఎక్స్’ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అది ఆర్డినరీ మెషీన్‌లకన్నా ఆరు రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. బ్రెయిన్, లంగ్, లివర్, పాంక్రియాస్, ప్రొస్టేట్... ఇలా రకరకాల క్యాన్సర్ రోగులకు సౌకర్యవంతమైన ట్రీట్‌మెంట్ అందించేందుకు ‘ట్రూ బీమ్’ వైద్యులకు ఉపయోగపడుతోంది. రోజుల వ్యవధిలోనే ఈ చికిత్స విధానం పూర్తవుతుండటం విశేషం. ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు ఆసియాలోనే తొలిసారిగా క్యాలీ పీఎస్‌వో సిస్టమ్ ఏర్పాటుచేశారు. క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించేందుకు జీపీఎస్‌ను వినియోగిస్తున్నారు. ఇది రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ కణాలను గుర్తించి నిర్దేశిత భాగంలో మెడిసిన్ ఇస్తుంది. దీనికి ట్యూమర్ ట్రాకింగ్ ఉపయోగపడుతుంది. రోగుల సమాచారం కోసం ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులనూ మెయిన్‌టెన్ చేస్తున్న ఈ ఆస్పత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ‘బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్’ను త్వరలో నెలకొల్పనుంది.
అందరూ స్పెషలిస్టులే...
బ్రెయిన్ ట్యూమర్, ప్రొస్టేట్, లంగ్, బ్రెస్ట్, లూకేమియా క్యాన్సర్... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. ఇటువంటి వాటి కోసం కొందరు వైద్యులుంటే సరిపోదు. అందుకే సంబంధిత క్యాన్సర్ విభాగానికి స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులో ఉంచింది. ప్రతి రోగిపై నర్సులు కేర్ తీసుకుంటారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా నర్సులను తీసుకొచ్చి ఇక్కడి నర్సులకు శిక్షణ కూడా ఇచ్చారు. క్యాన్సర్ రోగుల కోసం బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ సమీపంలో అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ సలహా కేంద్రాన్ని కూడా ఇటీవలే ఏర్పాటుచేశారు. ‘ఇక్కడకు వచ్చే రోగులకు అమెరికా తరహా ఆధునిక సాంకేతికతతో చికిత్స అందిస్తున్నాం. వారి జీవిత కాలవ్యవధిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. వారికి ట్రీట్‌మెంట్‌తో పాటు మనోధైర్యం నింపేందుకోసం కౌన్సెలింగ్ కూడా చేస్తున్నాం. బ్రెయిన్ ట్యూమర్, ప్రస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్‌లకు కేవలం రెండు, మూడు రోజుల్లోనే పూర్తి చికిత్స చేస్తున్నామ’ని డాక్టర్ ఎం.బాబయ్య తెలిపారు.
Adress
Dr.Babaiah
Medial Director
American Oncology Institute
Serlingampally, Hyderabad.
Ph: 77020 22733 - 040 6719 9999
advetorial