కిడ్స్ వరల్డ్.. పిల్లల ప్రపంచం
అదో పిల్లల ప్రపంచం. వారి సృజనాత్మకతను పెంచే విధంగా ఉంటుంది అక్కడి వాతావరణం. బోల్డన్ని ఆటవస్తువులుంటారుు. అవన్నీ పరిశీలించు... ప్రశ్నించు... తెలుసుకో... అని ప్రేరేపిస్తుంటారుు. అదే.. నగర బాలల సరికొత్త నేస్తం.. పిల్లల వుూ్యజియుం.. కిడిహో..
పదేళ్లకు పైగా అమెరికాలోనే గడిపిన నిరంజన్ వాసిరెడ్డి కొన్నాళ్ల కిందట హైదరాబాద్ వచ్చేశారు. ఆయున అమెరికాలో ఉన్నప్పుడు తరచూ తమ పిల్లలతో బయటికి వెళ్లేవారు. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలకు టీవీనే ప్రపంచం అయిపోయింది. దాంతో పిల్లల భవిష్యత్తు గురించి ఆయునలో ఆందోళన మొదలైంది. బయటికి తీసుకువెళ్దామంటే పిల్లలకు ప్రత్యేకమైన పార్కులు గాని చెప్పుకోదగ్గ ఆటస్థలాలు గాని లేవు. ఈ అంతర్మథనం నుంచి వచ్చిన ఆలోచనే.. కిడిహో.
వినోదంతోపాటు విజ్ఞానం
కిడిహోలో ఉన్న ఆటవస్తువులు కేవలం వినోదాన్ని పంచడానికే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవి పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచడమే కాకుండా నలుగురితో కలసి పోయేందుకు తోడ్పడతాయి. వీటితో ఇలానే ఆడుకోవాలి అనే రూల్ లేదు. ఇక్కడ అడుగు పెట్టగానే ముందుగా పాత టైర్లు వేర్వేరు రంగుల్లో దర్శనమిస్తాయి. కొంతమంది చిన్నారులు వాటిని చేత్తో కొట్టి ముందుకు నడుస్తారు. కొందరు ఒకే రంగులోని వాటన్నింటిని ఒకచోట చేరుస్తారు. మరొకరు వాటిని ఎత్తుకోసం ఉపయోగిస్తారు. సో మొత్తంగా ఎవరికి నచ్చిన విధంగా వారు ఇక్కడ ఆడుకోవచ్చు. క్రియేట్ చేయొచ్చు. తెలుసుకోవచ్చు. అంతేకాదు.. షాపింగ్ ఎలా చేయాలి, డబ్బులెలా చెల్లించాలి, వంట ఎలా చేస్తారు. బిల్డింగ్‌లు ఎలా కడతారు ఇలా నిత్యం మనకు అవసరమయ్యే ప్రతి అంశంపైనా ఇక్కడి వస్తువులు అవగాహన కల్పిస్తాయి.
నియువు నిబంధనలు నిల్
పిల్లల ఆలోచనలకు పరిధులు లేనట్లే. కిడిహోలో నియమ నిబంధనలు ఉండవు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. పిల్లలు తమ సృజనకు పదును పెడుతుంటే తల్లిదండ్రులు దగ్గరే ఉండి చూడొచ్చు. అయితే ఫ్రీగా వస్తే దేనికీ విలువ ఉండ దు కాబట్టి ఫీజు నిర్ణయించారు కిడిహో వ్యవస్థాపకులు నిరంజన్‌రెడ్డి. ఫీజు పిల్లలకు రూ. 300, తల్లిదండ్రులకు రూ. 200.
చదువుల్లో తేడా అమెరికా చదువులకూ మనకూ చాలా తేడా ఉంది. కారణం సృజన. మన దగ్గర నూటికి వంద మార్కులు వస్తాయి. కానీ పిల్లలు ఏదైనా వినూత్నంగా చేస్తారా అంటే చాలా వరకూ అరుదనే చెప్పాలి. అందుకే పిల్లల్లో సృజనని పెంపొందించాలి. ఇక్కడ మేం చేసేది అదే. పనికిరాని వుస్తువులకు చిన్న చిన్న మార్పులు చేసి తిరిగి వాటిని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాం. పాత బకెట్లను కూర్చీలుగా మార్చటం, కార్డుబోర్డుతో చెప్పుల స్టాండ్... ఇలా ఏదైనా చేయగలం అనే ఆలోచన పిల్లల్లో వచ్చేలా చేయడమే మా లక్ష్యం. కొత్త విషయాలు నేర్చుకోవడం, వినూత్నంగా ఆలోచించడం అలవరచుకుంటారు.
- నిరంజన్ వాసిరెడ్డి, కిడిహో వ్యవస్థాపకుడు
- విజయారెడ్డి