Playboy magazine
-
ఫ్యాట్ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి
వాషింగ్టన్: సినిమాలు, యాడ్లు అన్ని స్త్రీని ఓ లైంగిక వస్తువుగా చూపిస్తున్నాయి. ఆమె శరీరానికి ఒక ప్రత్యేక కొలతలు.. రంగును సెట్ చేశాయి. ఇక ప్రపంచంలోని మెజారిటీ మహిళలు ఆ కొలతల్లో సెట్ కాకపోతే.. ఆ రంగు లేకపోతే తాము అసలు మనుషులమే కాదనే భావంలోకి దిగజారిపోయాలా వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. అసలు స్త్రీ అంటేనే ఇలా ఉండాలి.. లేదంటే వారి జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో అనే భావాన్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ విషయం పట్ల సమాజంలో చైతన్యం కలుగుతుంది. మహిళలు ఈ బంధనాలు తెంచుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ నటి, అమెరికన్ ప్రసిద్ధ మ్యాగ్జైన్ ప్లేబాయ్ ఫౌండర్ హ్యూ హెఫ్నర్ మూడో భార్య క్రిస్టల్ హెఫ్పర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న అందం ప్రమాణాల గురించి.. వాటి వల్ల మహిళల్లో పాతుకుపోయిన అభద్రతాభావం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘గతేడాది అక్టోబర్ 16న నాకు ఫ్యాట్ ట్రాన్స్ఫర్ సర్జరీ జరిగింది. కానీ అది సవ్యంగా కొనసాగలేదు. ఈ శస్త్ర చికిత్స వల్ల నేను నా శరీరంలో సగం రక్తాన్ని కోల్పోయాను. చివరకు రక్తం ఎక్కించకునే పరిస్థితులు తలెత్తాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకోగల్గుతున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. ఒకప్పుడు అందం అని భ్రమించి.. ఈ ఫీల్డ్‌లో పని చేయడం కోసం తప్పని సరి పరిస్థితుల్లో 2016 సంవత్సరంలో నా శరీరంలోకి కొన్ని విషపూరిత పదార్థాలను, ఇంప్లాట్స్ని పంపించాను. వాటి వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. సర్జరీతో వీటన్నింటిని తొలగించాను. ఈ సంఘటనలు తొలిసారి నాకు ఒక పాఠాన్ని నేర్పాయి. మరో విషయం ఏంటంటే మనం నేర్చుకునే వరకు విశ్వం ఈ పాఠాలను పంపుతూనే ఉంటుందని నేను గ్రహించాను. ఈ అనుభవం తర్వాతే నేను సహజంగా మనం మనలా ఉండటమే సరైందని మీతో చెప్పగల్గుతున్నాను’ అన్నారు క్రిస్టల్. (చదవండి: అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి) View this post on Instagram A post shared by Crystal Hefner (@crystalhefner) ఇక ప్లేబాయ్ మ్యాగ్జైన్, సైట్లో కనిపించిన క్రిస్టల్.. వీటన్నింటిని విషపూరిత సంస్కృతితో పోల్చారు. ఇక సినిమాలు మహిళలను తమను చూసుకుని తామే భయపడే స్థితికి తీసుకెళ్లాయని వాపోయారు. సినిమాలు, ప్రకటనలు, సోషల్ మీడియా తదితర చెత్త, శారీరకంగా నకిలీ వ్యక్తులు మహిళల పరిస్థితులను మరింత దిగజార్చయని.. వాటిలో తాను కూడా ఉన్నానని అంగీకరించారు. ఇవన్ని మహిళల్ని కేవలం లైంగిక వస్తువుగా మాత్రమే చూపిస్తాయని ఆరోపించారు. ఇక గత పదేళ్లుగా తన బాహ్యరూప అందం మీదనే తన విలువ, జీవనాధారం ఆధారపడ్డాయని తెలిపారు క్రిస్టల్. ఇక ఈ రోజు తన బాహ్యరూపంతో సంబంధం లేకుండా తాను ఎంత విలువైనదో అనే విషయం తెలుసుకున్నానని.. బాహ్యసౌందర్యంతో సంబంధం లేకుండా తనను తాను ప్రేమించుకుంటానని.. గౌరవించుకుంటానన్నారు క్రిస్టల్. (చదవండి: యువతి బద్ధకం ఎంత పని చేసింది!) ఇక తర్వాతి తరాలను తలుచుకుంటే తనకు ఎంతో బాధగా ఉందని... వారంతా కేవలం డబ్బు, మేకప్, ఫిల్టర్స్ అనే నకిలీ ముసుగులతో జీవించబోతున్నారని క్రిస్టల్ వాపోయారు. ఇప్పటికైనా మహిళలు ఈ పద్దతికి స్వస్థి పలకాలని.. బాహ్య రూపం గురించి కాకుండా ఆత్మవిశ్వాసం, తన పట్ల తనకు ప్రేమ, నమ్మకం, గౌరవం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలని కోరుతున్నాను అన్నారు. ఇప్పటికైనా తనకు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక క్రిస్టల్ 2012లో హ్యూ హెఫ్నర్ని వివాహం చేసుకుని మూడో భార్యగా ఆయన జీవితంలోకి ప్రవేశించారు. అయితే పైళ్లెన ఐదేళ్లకే అంటే 2017లో తన 91వ ఏట హ్యూ మరణించారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. -
ప్లేబాయ్’ హెఫ్నర్ కన్నుమూత
లాస్ఏంజెలిస్: ప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. గురువారం స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్లేబాయ్ భవనంలో, 91 ఏళ్ల వయసులో, తన ఆత్మీయుల నడుమ, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు’ అని వెల్లడించింది. 1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944–1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. 1949లో ఇలినాయి యూనివర్సిటీ నుంచి బీఏ సైకాలజీలో పట్టా పుచ్చుకున్నారు. తన వద్ద ఉన్న 600 డాలర్లతోపాటు తన తల్లి వద్ద మరో వెయ్యి డాలర్లు తీసుకుని 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను హెఫ్నర్ ప్రారంభించారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో ప్లేబాయ్‌ని తెచ్చారు. అనతికాలంలోనే ప్రపంచంలోని గొప్ప బ్రాండ్లలో ఒకటిగా మ్యాగజైన్‌ను నిలిపారు. తొలి ఏడాది సెంటర్ఫోల్డ్లో ప్లేమేట్‌గా ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్ మాన్రో ఫొటోను ప్రచురించారు. 2015లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించడాన్ని నిలిపివేశారు. 1960ల్లో చాలాచోట్ల నైట్ క్లబ్బులను ప్రారంభించారు. ప్లేబాయ్ మ్యాగజైన్ తొలి కవర్ గర్ల్, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో సమాధి పక్కనే హ్యూ హెఫ్నర్ను ఖననం చేయనున్నారు. 25 ఏళ్ల క్రితమే 75 వేల డాలర్లు వెచ్చించి మార్లిన్ మన్రో సమాధి పక్క స్థలాన్ని హెఫ్నర్ కొనుగోలు చేశారు. -
ప్లేబాయ్ వ్యవస్థాపకుడి కన్నుమూత
సాక్షి : నగ్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ మాగ్జైన్ ‘ప్లే బాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెన్ఫర్ ఇక లేరు. 91 ఏళ్ల హెన్ఫర్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్లే బాయ్ సంస్థ ట్విట్టర్లో తెలియజేసింది. 1926లో చికాగోలో జన్మించిన హ్యూ కాపీ రైటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 1600 డాలర్లతో 1953లో ప్లే బాయ్‌ను ప్రారంభించారు. తొలినాళ్లలో క్యాలెండర్‌గా దర్శనమిచ్చిన ప్లే బాయ్ తర్వాతి కాలంలో మాగ్జైన్గా మారిపోయింది. కవర్ పేజీతోసహా మొత్తం న్యూడ్ఫోటోలతో కథనాలను ప్రచురించేంది. సెక్స్ కు సంబంధించిన ఆరోగ్యకర అంశాలను చర్చించాలనే లక్ష్యంతోనే తాను ప్లేబాయ్ కి రూపమిచ్చినట్లు హ్యూ హెన్ఫర్ తరచూ చెబుతుండేవారు. అలా మొదలైన ప్లే బాయ్ ప్రస్థానం సుమారు ఆరు దశాబ్దాలపాటు నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇంటర్వ్యూలు, కల్పిత గాథలు, ఫిమేల్ సెలబ్రిటీల న్యూడ్ ఫోటో షూట్లు ఇలా సంచికలో పలు విషయాలను ప్రచురించేవారు. అయితే మధ్యలో చాలా వివాదాలు సంచికను చుట్టుముట్టాయి కూడా. నగ్నత్వాన్ని మరీ ఎక్కువగా ప్రదర్శిస్తుండటంతో నిషేధం విధించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. అదే సమయంలో యూఎస్ తపాలా శాఖ మాగ్జైన్ను బట్వాడా చేయకుండా నిలుపుదల చేసింది. దీంతో ఆయన న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. అలా వివాదాల తర్వాత కాస్త సర్యులేషన్ తగ్గినప్పటికీ... ప్లే బాయ్ అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. అలాంటి సంచిక ఏడాదిన్నర క్రితం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నగ్న చిత్రాలను ప్రచురించబోమని సంచలన ప్రకటన చేసింది. అయితే, ఏడాది గడవకముందే ప్లే బాయ్ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మళ్లీ మార్చి నుంచి మళ్లీ పాత తరహాలో నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ని తీసుకొచ్చేసింది. హ్యూ హెన్ఫర్ ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది కూడా. వయసు పై బడటంతో ప్లేబాయ్ చీఫ్ బాధ్యతలను కొడుకు జూనియర్ హెన్ఫర్కు అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. -
ప్లేబాయ్‌లో.. ఇక ఆ బొమ్మలుండవు
న్యూయార్క్: 'పెద్దలకు మాత్రమే' వంటి శృంగార చిత్రాల తరహాలో.. కుర్రకారుకు మతులు పోగొట్టిన 'ప్లేబాయ్' మేగజైన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలు ప్రచురించరాదని యాజమాన్యం నిర్ణయించింది. రీ డిజైన్ చేసిన కొత్త మేగజైన్‌ను వచ్చే మార్చిలో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుత ప్లేబాయ్ ఎడిషన్‌లో రెచ్చగొట్టేలా మహిళ నగ్న చిత్రాలున్నా.. ఇక మీదట పూర్తి నగ్నచిత్రాలు కనిపించవు. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించరాదని ఎడిటర్ కోరీ జోన్స్ ప్రతిపాదించగా, ఇందుకు వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ అంగీకారం తెలిపారు. ఇంటర్నెట్లో పోర్న్, నగ్నచిత్రాలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో.. అడల్ట్ మేగజైన్లకు ఆదరణ తగ్గుతోందని ప్లేబాయ్ ప్రతినిధులు అంగీకరించారు. ప్లేబాయ్ సర్క్యులేషన్ భారీగా పడిపోయినట్టు చెప్పారు. 1975లో ప్లేబాయ్ సర్క్యులేషన్ 56 లక్షలు ఉండగా, ప్రస్తుతం 8 లక్షలకు పడిపోయింది. -
న్యూ ప్లేబాయ్
సిటీలోని పార్టీక్రౌడ్కు ప్లేబాయ్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ అమెరికా పబ్.. ఇండియాలో కాలుపెట్టడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. చివరకు మన సిటీ ఈ పబ్‌కి వెల్కమ్ చెబుతోంది. శనివారం ఈ పబ్ లాంచింగ్ ఉండటంతో సిటీలోని పేజ్‌త్రీ, పార్టీ పీపుల్ ఫుల్ అటెన్షన్లోకి వచ్చేశారు. పాస్‌ల కోసం క్యూ కట్టేశారు. లాంచ్పార్టీకి ఇన్వైట్ రావడం స్టేటస్ సింబల్‌గా మారింది. ముంబైకి చెందిన పీబీఐ లైఫ్‌స్టైల్ సంస్థ భాగస్వామ్యంతో ఈ పబ్ సిటీలో ఏర్పాటవుతోంది. వాటీజ్ ప్లేబాయ్? న్యూడ్ పిక్చర్స్‌తో మతులు పోగొట్టే కాలిఫోర్నియాకు చెందిన ప్లేబాయ్ మేగ్జైన్ బ్రాండ్ గురించి వినని వారు అరుదే. ఈ మ్యాగజైన్ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే దాదాపు 40కిపైగా క్లబ్స్ విదేశాల్లో ఉర్రూతలూగిస్తున్నాయి. బన్నీలని పిలిచే సగం దుస్తుల వెయిట్రెసెస్, విభిన్న రకాల గెటప్స్‌లో ఉండే టీజింగ్ క్వీన్స్ ఈ క్లబ్స్, పబ్స్ స్పెషాలిటీ. ఇక హాట్ హాట్ మ్యూజిక్, పార్టీ యానిమల్స్‌కు ఫుల్ ఫ్రీడమ్.. సరేసరి. మ్యాగజైన్ తరహాలోనే ఈ పబ్‌కు కూడా ఇండియాలో ఇంతకాలం అనుమతి దొరకలేదని.. గోవాలో మాత్రం 22వేల చదరపు అడుగుల్లో సన్‌షైన్ రిసార్ట్ పేరుతో ఇలాంటి క్లబ్ నడుస్తోందని సమాచారం. స్టైల్ మార్చి.. సిటీకి వస్తోంది ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో.. ప్లేబాయ్ పబ్ నిర్వాహకులు దిగివచ్చి ఎటువంటి వల్గారిటీకి తావులేకుండా పబ్ ఏర్పాటుకు ఓకే చెప్పారట. దీని ఫలితంగానే మన సిటీలోకి రాగలిగింది ప్లేబాయ్. అమెరికాకు చెందిన డిజైనర్ మోహిని తాడికొండ మన సంప్రదాయాలు ఒప్పుకునే రీతిలో డ్రెస్‌లు డిజైన్ చేశారని తెలుస్తోంది. భారతీయ విలువలకు అనుగుణంగానే బన్నీస్ ఉంటారని ప్లేబాయ్ నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. సిటీలో బన్నీలుగా సేవలందించే అరడజను మంది విదేశీ యువతులకు ఇండియన్ వాల్యూస్, డ్రెస్సింగ్ విషయంలో ఇప్పటికే అవసరమైన శిక్షణ ఇచ్చారట. చాలా మందిలో ప్లేబాయ్‌కి ఉన్న ‘ఎ’ సర్టిఫికెట్ ముద్రను తొలగించుకుంటూ.. దీన్ని ఒక లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా ప్రాచుర్యంలోకి తేవడమే తమ లక్ష్యమని ఈ బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తొలి ప్లేబాయ్ క్లబ్‌కు వేదిక అవుతున్న సిటీ.. ఈ మోస్ట్ హాటెస్ట్ ట్రెండ్‌ని ఎలా ట్రీట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ! - ఎస్బీ