
ఇండీ ఫీస్టా 2015
షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌ను ప్రోత్సహించేందుకు సంస్కృత క్రియేటివ్ ఏజెన్సీ ముందుకొచ్చింది. చలనచిత్ర రంగంలోనే తొలిసారిగా షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేస్తోందీ సంస్థ. ఇందులో భాగంగా ‘ఇండీ ఫీస్టా 2015’ నిర్వహిస్తోంది. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌తో పాటు ఇతర విభాగాల్లో కూడా అవార్డులు ఇవ్వనుంది. దీని కోసం ఔత్సాహికులైన లఘు చిత్రాల రూపకర్తల నుంచి ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్టు మంగళవారం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు చెప్పారు. దీంతో పాటు ‘గ్రాండ్ ఇండీ ఫీస్టా అవార్డ్స్’ కూడా ఉన్నాయని, మొత్తం ప్రైజ్ మనీ రూ.10 లక్షలని చెప్పారు. ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ ఈ నెల 31. ఇతర వివరాలకు ‘ఇండీ ఫీస్టా డాట్ కామ్’లో లాగిన్ కావచ్చు. కార్యక్రమంలో మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ రుచికా శర్మ కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.