
అవార్డు అందుకుంటున్న రహీం
వనపర్తి క్రైం : వనపర్తికి చెందిన రహీం రూపొందించిన ‘నిర్భయ చట్టం’ షార్ట్ ఫిలింకు అవార్డు లభించింది. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలకు 72 షార్ట్ ఫిలింలు రాగా, అందులో ఖదీర్ నిర్మాణ సారథ్యంలో రహీం రూపొందించిన చిత్రం అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాచం ఫౌండేషన్ నిర్వాహకులు కాచం సత్యనారాయణ గుప్తా చేతులమీదుగా రహీం అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహరావు గేయ రచయిత చంద్రబోస్, ఆర్‌ఎక్స్ 100 సినిమా హీరో కార్తీకేయరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment