ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు.. సంతాన ప్రాప్తిరస్తు! | Infertility specialist: lack of parenting increases day by day | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు.. సంతాన ప్రాప్తిరస్తు!

Published Sun, Jul 6 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు.. సంతాన ప్రాప్తిరస్తు!

ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు.. సంతాన ప్రాప్తిరస్తు!

అప్‌కమింగ్ కెరీర్: మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి ఒక మధుర మైన భావన, మరిచిపోలేని తియ్యటి అనుభూతి. ఆధునిక యుగంలో అలాంటి అనుభూతికి దూరమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. సంతానలేమి సమస్య తీవ్రమవుతోంది. అయితే, కాలానుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం రంగ ప్రవేశం చేయడంతో ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతోంది. ఫెర్టిలిటీ సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సంతానం లేని వారి ఆకాంక్షలను తీరుస్తూ వారి కుటుంబాల్లో ఆనందం నింపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాల సంఖ్య పెరిగిపోతోంది. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఇన్‌ఫెర్టిలిటీ స్ట్రీమ్‌లోకి ప్రవేశించొచ్చు. ఈ కెరీర్‌లో ప్రవేశిస్తే వృత్తిపరమైన సంతృప్తితోపాటు అధిక వేతనాలు అందుకోవచ్చు.   
 
 అనుభవం సంపాదించాకే ప్రాక్టీస్
 ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టులు పునరుత్పత్తి సామర్థ్యం లేనివారికి చికిత్స చేయాల్సి ఉంటుంది. సింపుల్ మెడికేషన్ నుంచి ఆపరేటివ్ లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ వరకు ఈ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఈ చికిత్సలు ఫలించకపోతే.. ఐయూఐ (ఇంట్రా యుటేరిన్ ఇన్‌సెమినేషన్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), ఐవీఎఫ్- ఐసీఎస్‌ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్), పీజీడీ (ప్రి ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్) వంటి అత్యాధునిక విధానాల ద్వారా నిస్సంతులకు సంతాన భాగ్యం కలిగించొచ్చు. ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టులుగా కెరీర్ ప్రారంభించాలనుకొనేవారు ముందుగా ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్‌లో చేరి తగిన అనుభవం గడించిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.
 
పరిజ్ఞానం పెంచుకోవడం తప్పనిసరి
 ఫెర్టిలిటీ రంగంలో రోజురోజుకీ మార్పులు జరుగుతుంటాయి. నూతన పరిజ్ఞానం, విధానాలు తెరపైకి వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉంటేనే వృత్తిలో పేరు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు కొందరికి ఎలాంటి  చికిత్సలు పనిచేయకపోవచ్చు. సంతానం కలగకపోవచ్చు. అయినా నిరాశపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. ప్రతి శాస్త్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసుకోవాలి. వైద్యులు తమ వంతు ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇన్‌ఫెర్టిలిటీ నిపుణులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది.  నగరాలతోపాటు చిన్నస్థాయి పట్టణాల్లోనూ సాంతన సాఫల్య కేంద్రాలు విరివిగా ఏర్పాటవుతున్నాయి. వీటిలో నిపుణులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి.
 
 వేతనాలు: ఇన్‌ఫెర్టిలిటీ వైద్యులకు మంచి వేతనాలు అందుతున్నాయి. ప్రారంభంలో నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. కొంత అనుభవం ఉన్నవారికి నెలకు రూ.50 వేలకు పైగా వేతనం ఉంది. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే అధిక ఆదాయం ఆర్జించొచ్చు.
 
 కావల్సిన స్కిల్స్: ఇన్‌ఫెర్టిలిటీ నిపుణులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సెలింగ్ స్కిల్స్ ఉండడం అవసరం. కొందరికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉండ కపోవచ్చు. వారికి ఆ విషయాన్ని సున్నితంగా చెప్పగలిగే నేర్పు ఇన్‌ఫెర్టిలిటీ నిపుణులకు ఉండాలి. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement