Modern Era
-
ఆధునిక యోగ పితామహుడు
యోగి కథ ఆధునిక యుగంలో హఠయోగానికి విశేష ప్రాచుర్యం కల్పించిన గురువుగా తిరుమల కృష్ణమాచార్య ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. అప్పటి మైసూరు రాజ్యంలోని చిత్రదుర్గ జిల్లా ముచికుందాపురంలో 1888 నవంబర్ 18న జన్మించిన ఆయన షడ్దర్శనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితుడు. పదేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకోవడంతో మైసూరు చేరుకున్నారు. మైసూరులోని చామరాజ సంస్కృత కళాశాల నుంచి ‘విద్వాన్’ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్క, వ్యాకరణ, వేదాంతాలలోనే కాకుండా, ఆయుర్వేదంలోనూ అసాధారణ నైపుణ్యాన్ని సాధించారు. హఠయోగంలో విశేష సాధన చేసిన కృష్ణమాచార్యను అప్పటి మైసూరు మహారాజా నాలుగో కృష్ణరాజ వడయార్ ఎంతగానో ప్రోత్సహించారు. వడయార్ ఆర్థిక సహాయంతో కృష్ణమాచార్య భారతదేశంలోని నలుమూలలా పర్యటించి, సనాతన యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించారు. హఠయోగ సాధనలో పలువురికి శిక్షణ ఇచ్చారు. బి.కె.ఎస్.అయ్యంగార్ వంటి సుప్రసిద్ధ యోగ గురువులు కృష్ణమాచార్య వద్ద శిక్షణ పొందినవారే. క్లిష్టమైన యోగవిద్యను సుబోధకం చేసేందుకు కృష్ణమాచార్య ‘యోగమకరంద’, ‘యోగాసనగళు’ (యోగాసనాలు), యోగరహస్య, యోగావళి అనే యోగవిద్యా గ్రంథాలను రచించి, ఆధునిక యోగ పితామహుడిగా ప్రసిద్ధి పొందారు. మైసూరులో కొన్నాళ్లు యోగ శిక్షణ సాగించిన తర్వాత కొద్దికాలం బెంగళూరులో గడిపారు. తర్వాత 1952లో మద్రాసుకు తరలిపోయి, అక్కడే స్థిరపడ్డారు. మద్రాసులోని వివేకానంద కాలేజీలో లెక్చరర్‌గా చేరి, అక్కడి విద్యార్థులకు యోగ విద్యను బోధించారు. తన 96వ ఏట ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరిగినా, శస్త్రచికిత్సకు నిరాకరించి, తనకు తెలిసిన యోగ, ఆయుర్వేద విద్యలతోనే నయం చేసుకున్నారు. నిండు నూరేళ్లు జీవించిన ఆయన 1989లో కోమాలోకి జారుకున్న కొద్దిరోజులకే తుదిశ్వాస విడిచారు. -
తరతరాలుగా వెట్టిచాకిరే..
- గిరిజనులను కదిలిస్తే కన్నీళ్లే - రూ.3 వేలు అప్పు చేసినందుకు ఏళ్లతరబడి శ్రమ చేస్తున్న వైనం - పట్టించుకోని రెవెన్యూ, కార్మికశాఖ గూడూరు: నేటి ఆధునిక యుగంలోనూ జిల్లాలోని గిరిజనులు వెట్టిచాకిరీలో మగ్గుతున్నారు. తరతరాలుగా భూస్వాముల చెప్పుచేతల్లో వేలాది మంది గిరిజనులు నలిగిపోతున్నారు.వారిని రక్షించాల్సిన ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా కార్మిక , రెవెన్యూశాఖలు వెట్టిచాకిరీకి గురవుతున్న గిరిజనులను కాపాడే విషయంలో ఘోరంగా వైఫల్యం చెందాయనే విమర్శలొస్తున్నాయి. కార్మికశాఖాధికారులకు గిరిజనుల వెట్టిచాకిరీ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. తొమ్మిది మందికి విముక్తి... ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో శనివారం ఏఆర్డీ సంస్థ డైరక్టర్ బషీర్ ఫిర్యాదు మేరకు వెట్టిచాకిరీ నుంచి విడుదలైన 9 మంది గిరిజనులు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీరు తెప్పించక మానదు. నర్రవారిపాళెంలోని కాల్తీరెడ్డి సుబ్రహ్మణ్యం అనే భూస్వామి వద్ద రెండు తరాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నామని బాధితులు తెలిపారు. దీనికి కారణం ఎన్నో ఏళ్ళ కిందట తాము తీసుకున్న రూ. 3వేలు అప్పు.. రెండు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా అక్కడే పనిచేస్తున్నా జీతాలు ఇవ్వకపోవగా ఆ ఆప్పు నేటికి రూ. 50వేలు అయినట్లు చెబుతున్నాడు. వారసత్వ అప్పుల్లో కూరుకుపోయిన వైనం... గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతే వెట్టిచాకిరీకి కారణమని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,272 హ్యామ్లెట్స్లో 65 వేల కుటుంబాల్లో సుమారు 2.85 లక్షల మంది గిరిజనులున్నారు. వీరి ప్రధాన వృత్తి చేపల పట్టడం. చెరువుల్లో, గుంతల్లో చేపలు పట్టుకునే హక్కును ఆయా ప్రాంతాల్లోని పంచాయతీలు, సొసైటీలు హస్తగతం చేసుకుంటుండడంతో వీరికి జీవనోపాధి ఉండటం లేదు. పేదరికంలో మగ్గుతున్న గిరిజనుల్లో ఎక్కువశాతం మంది భూస్వాముల రొయ్యల గుంతలు, ఇటుకబట్టీల వద్ద ఏళ్ల తరబడి తరతరాలుగా కుటుంబాలతో కలిసి వెట్టిచాకిరీకి గురవుతున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న భూస్వాములు వారికి కొద్ది మొత్తాల్లో అప్పులు ఇచ్చి వాటిని బూచిగా చూపుతూ ఎక్కడికీ కదలనివ్వకుండా వారసత్వంగా అప్పులను వారి పై రుద్దుతున్నారు. దీంతో గిరిజనులు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. పారిపోతే చిత్రహింసలే... ఎవరైనా ధైర్యం చేసి ఇతర ప్రాంతాలకు పారిపోతే వారిని వెతికి పట్టుకుని భూస్వాములు చిత్రహింసలకు గురిజేస్తారు. వారి కుటుంబసభ్యుల మధ్యనే శిక్షలు విధిస్తున్నారు. భూస్వాములు వారి వద్ద వెట్టిచాకిరీ చేసే గిరిజన కుటుంబాల్లోని మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. లైంగిక వేధింపులపై డీఎస్పీ విచారణ భూస్వామి గూడూరు ప్రాంతంలోని తాను నివాసముంటున్న ఇంట్లో వెట్టిచాకిరి చేయిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంపై ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. భూస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసు, చైల్డ్ లేబర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. నిందితుడు సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నందున గాలింపు చేపట్టామని తెలిపారు. -
పర్యావరణ పరిరక్షకుడు.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్
ఆధునిక యుగంలో పర్యావరణం ప్రమాదంలో పడింది. జీవజాలం కనుమరుగవుతోంది. ఫలితంగా విపత్తులు పంజా విసురుతున్నాయి. పర్యావరణా న్ని పరిరక్షించుకోవడంపై ప్రపంచంలో అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. కాలుష్య కారక పరిశ్రమల్లో వీరిని తప్పనిసరిగా నియమించాలనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విసృ్తతమవుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించాలి పర్యావరణ ఇంజనీరింగ్ కోర్సులు చేసినవారికి ప్రస్తుతం దేశ విదేశాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాల్లో వీరిని నియమించుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. కాలుష్యాన్ని గరిష్టస్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం పర్యావరణ ఇంజనీర్ల ప్రధాన బాధ్యత. ఇటీవలి కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో పర్యావరణ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఈ రంగంలో ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. స్కిల్స్ పెంచుకోవాలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ప్రకృతిపై మమకారం ఉండాలి. దాన్ని కాపాడుకోవాలనే తపన, వృత్తిపట్ల అంకితభావం తప్పనిసరి. పర్యావరణ చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరాన్ని బట్టి దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండాలి. టైమ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి. పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా.. నైపుణ్యాలను పెంచుకుంటే అధిక వేతనం అందుకోవచ్చు. అర్హతలు: మన దేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, బీటెక్‌లో చేరొచ్చు. అలాగే ప్రవేశ పరీక్ష లేకుండానే బీఎస్సీలో ప్రవేశం పొందొచ్చు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తిచేస్తే అధిక అవకాశాలు లభిస్తాయి. వేతనాలు: పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత నైపుణ్యాలు, పనితీరును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో ఇంకా అధిక వేతనాలుంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ, వెబ్సైట్: www.osmania.ac.in జేఎన్టీయూ-హైదరాబాద్, వెబ్సైట్: www.jntuhceh.ac.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ వెబ్సైట్: www.ismdhanbad.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెబ్సైట్: www.jee.iitd.ac.in నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.neeri.res.in పర్యావరణ కోర్సులతో అవకాశాలు పుష్కలం! ‘‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణల కారణంగా అభివృద్ధితోపాటు పర్యావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. దీని పరిష్కారానికి పర్యావరణ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. యునెస్కో, యూఎన్ ఈపీలతోపాటు దేశంలోనూ పలు సంస్థలు పర్యావరణ కోర్సులు చదువుతున్న వారికి ఫెలోషిప్‌లు అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోపాటు అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్ తదితర ప్రభుత్వ విభాగాల్లోనూ పర్యావరణ నిపుణులకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రైవేటు రంగంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లు, మైనింగ్ కంపెనీలు వీరికి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేస్తే శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా రాణించొచ్చు’’ - డా. టి.విజయలక్ష్మీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, జేఎన్టీయూ-హైదరాబాద్. జనరల్ నాలెడ్జ్: ఆరో పంచవర్ష ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం? ఆర్థిక ప్రణాళిక: పేదరిక నిర్మూలన, స్వావలంబన సాధన ఐదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలుగా నిర్దేశించారు. 1978 నుంచి 1983 వరకు జనతా ప్రభుత్వం నిరంతర ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చింది. నిరంతర ప్రణాళికా విధానంలో ప్రతి సంవత్సరం తరువాత ప్రణాళికను రాను న్న నాలుగేళ్లను దృష్టిలో ఉంచుకొని సవరిస్తూ ఒక సంవత్సరానికి ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్ 1, 1980 నుంచి మార్చి 31, 1985 వరకు ఆరో పంచవర్ష ప్రణాళిక కాలం. ఆరో పంచవర్ష ప్ర ణాళికలో ఇంధన రంగం అత్యధిక ప్రాధాన్యతను పొందింది. పేదరిక నిర్మూలన న్యాయంతో కూడిన వృద్ధి ఆరో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. ఆరో పంచవర్ష ప్రణాళిక 5.2 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకొని సాధించింది. మనదేశంలో ప్రముఖ నిర్మాణాలు తెలుసా? నిర్మాణం {పదేశం {పాధాన్యత అజంతా గుహలు ఔరంగాబాద్ కీ.పూ. 1 - క్రీ.శ. 7 శతాబ్దాల మధ్య చిత్రించిన బౌద్ధమత చిత్రాలు, శిల్పకళకు నిలయాలు అక్బర్ సమాధి సికింద్ర ఆగ్రాకు దగ్గర అక్బర్ సమాధి ఉంది అమర్నాథ్ గుహ కాశ్మీర్ హిందువుల పుణ్యక్షేత్రం, ఇక్కడ మంచు శివలింగం ఏర్పడుతుంది అంబర్ భవంతి జైపూర్ రాజపుత్రుల కట్టడం ఆనంద్ భవన్ అలహాబాద్ నెహ్రూ నివాసం బిర్లా ప్లానెటోరియం కోల్‌కతా నక్షత్రశాల బ్లాక్ పగోడ కోణార్క సూర్యదేవాలయం భోదిసత్వ అజంతా గుహలు బౌద్ధమతానికి చెందిన చిత్రకళ బృహదీశ్వర దేవాలయం తంజావూర్ మధ్యయుగంలో నిర్మించిన దేవాలయాల్లో పెద్దది భారత్‌లో ప్రధాన సరస్సులు తెలుసుకోండి సరస్సు రాష్ర్టం పరశురాం కుండ్ అరుణాచల్ ప్రదేశ్ వెంబనాడ్ కేరళ పులికాట్ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో మొరీరి జమ్మూకాశ్మీర్ లోక్తక్ మణిపూర్ పుష్కర్ రాజస్థాన్ భీమ్టాల్ ఉత్తరాఖండ్ నిక్కి రాజస్థాన్ ఉదయ్‌పూర్ రాజస్థాన్ మోయక్ గోవా కార్ జమ్మూకాశ్మీర్ -
మనిషిని అందంగా తీర్చిదిద్దే.. స్టైలిస్ట్
వెండితెరపై సినిమా తారలను, టీవీలో, వ్యాపార ప్రకటనల్లో మోడళ్లను చూస్తే.. వారు అంత అందంగా ఎలా తయారయ్యారా? అనిపిస్తుంది. కానీ, వారిని అలా రూపొందించేది స్టైలిస్ట్లే. ఎలాంటివారినైనా చక్కగా తీర్చిదిద్ది, కంటికి ఇంపుగా మార్చే నైపుణ్యం వీరి సొంతం. తల వెంట్రుకల నుంచి కాలి గోర్ల దాకా, ధరించే దుస్తులు, ఆభరణాలు.. ప్రతిదీ ఎలా ఉండాలో స్టైలిస్ట్‌ల మదిలో రూపుదిద్దుకుంటుంది. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి క్లయింట్‌ను అందంగా మార్చే స్టైలిస్ట్‌లకు దేశవిదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. అసలుసిసలు గ్లామర్ ఫీల్డ్ ఆధునిక యుగంలో కార్పొరేట్ కల్చర్ విస్తరిస్తుండడంతో నలుగురిలో ప్రత్యేకంగా, ఆకట్టుకొనేలా కనిపించాలనే భావన అందరిలోనూ మొదలైంది. సినీ, టీవీ నటులు, యాంకర్లు, మోడళ్లు, పేజ్ 3 ప్రముఖులు అందంగా కనిపించేందుకు స్టైలిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారు. కొందరు సొంత స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. దీంతో వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. ఇది అసలుసిసలైన గ్లామర్ ఫీల్డ్ కావడంతో యువత దీనిపై అమితాసక్తి చూపుతోంది. భారత్‌లో స్టైలిస్ట్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. ఫ్యాషన్ పబ్లికేషన్స్, మ్యాగజైన్లు, డిజైన్ సంస్థలు, రిటైల్ బ్రాండ్లు, టీవీ ఛానళ్లు, సినిమాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ తదితర రంగాల్లో వీరికి ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఇందులో ఫ్యాషన్, మేగజైన్, కమర్షియల్, సెలబ్రిటీ స్టైలిస్ట్ అనే విభాగాలుంటాయి. పార్ట్‌టైమ్‌గా, ఫుల్‌టైమ్‌గా పనిచేసుకోవచ్చు. టీవీ ఛానళ్లు, ప్రకటనల ఏజెన్సీలు పూర్తిస్థాయి స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. వివాహం వంటి శుభకార్యాల్లోనూ వీరికి మంచి అవకాశాలు, ఆదాయం లభిస్తున్నాయి. కావాల్సిన స్కిల్స్: స్టైలిస్ట్‌లకు సాధారణంగా మేక్ అప్ ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు, డిజైనర్లు, హెయిర్ స్టైలిస్ట్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తన ఆలోచనలను వారికి వివరించి, పనిచేయించాలి. స్టైలిస్ట్‌కు బృందాన్ని ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు ఉండాలి. టైమ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ తప్పనిసరి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ఈ రంగంలో ప్రపంచస్థాయిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను పసిగట్టే నేర్పు అవసరం. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకెళ్లాలి. ఫ్యాషన్ రంగంలో ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా రాత్రి పగలు ఎప్పుడైనా పనిచేయగలగాలి. అర్హతలు: మనదేశంలో పలు సంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీలో భాగంగా స్టైలిస్ట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సీనియర్ స్టైలిస్ట్ వద్ద కొంతకాలం పనిచేయడం మంచిది. దీనివల్ల క్షేత్రస్థాయి అనుభవంతోపాటు మార్కెట్ అవసరాలపై అవగాహన పెరుగుతుంది. వేతనాలు: ప్రారంభంలో సీనియర్ స్టైలిస్ట్ వద్ద సహాయకులుగా పనిచేస్తే నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా కెరీర్ ప్రారంభించి నెలకు రు.25 వేలకు పైగానే పొందొచ్చు. టీవీ ఛానళ్లు, మేగజైన్లలో సీనియర్లకు గంటల చొప్పున లక్షల్లో ఆదాయం ఉంటుంది. స్టైలిస్ట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: www.nift.ac.in ఏ పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్-ఢిల్లీ వెబ్సైట్: pearlacademy.com ఏ లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ వెబ్సైట్: www.arts.ac.uk/fashion అవకాశాలకు కొదవ లేదు ‘‘మారుతున్న జనరేషన్ టేస్ట్‌కు తగినట్లుగా ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది. అందరూ కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిచోటా స్టైలిష్ లుక్కే ప్రాధాన్యతనిస్తున్నారు. కేవలం వ్యక్తిగతంగా కాకుండా స్టోర్స్, షాప్స్ అన్నిచోట్లా సరికొత్తగా మార్కెట్‌ను ఆక ట్టుకునేలా డిజైన్ చేయటం స్టైలిష్‌లో భాగమే. ప్రస్తుతం స్టైలిస్ట్‌లకు అవకాశాలకు కొదవ లేదని నమ్మకంగా చెప్పొచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీలో ఏడాది కోర్సుకు దాదాపు రూ.70 వేలు ఖర్చవుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత ప్రారంభంలోనే రూ.15 వేల వేల వేతననం లభిస్తుంది. ఈ లెక్కన కోర్సు పూర్తిచేసేందుకు పెట్టిన పెట్టుబడిని ఐదారు నెలల్లో సంపాదించవచ్చు’’ -అజితారెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, హామ్స్టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ -
నాణ్యమైన ఆహారాన్నిచ్చే.. ఫుడ్ టెక్నాలజీ
అప్‌కమింగ్ కెరీర్: ప్రపంచంలో మనిషి మనుగడకు ఆధారం... ఆహారం. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం దాకా ఆహారంలో మార్పులు చోటుచేసు కుంటున్నాయి. దేశాలను, ప్రాంతాలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఆహార అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. బతకడానికి ఏదో ఒకటి తింటే చాలు అనే భావన కనుమరుగైంది. నాణ్యమైన ఆహార పదార్థాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలున్న భోజనంపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యత కలిగిన ఆహారాన్ని ప్రజలకు అందించే నిపుణులే.. ఫుడ్ టెక్నాలజిస్ట్‌లు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా యువతకు భరోసా కల్పిస్తున్న కెరీర్.. ఫుడ్ టెక్నాలజీ. 2015 నాటికి 2 లక్షల కొత్త కొలువులు భారత్‌లో ఫుడ్ ఇండస్ట్రీ క్రమంగా వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, హోటల్, అగ్రి-ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమల్లో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల కు భారీ డిమాండ్ ఉంది. క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, హైజీన్, లేబొరేటరీ వంటి విభాగాల్లో కొలువులు ఉన్నాయి. ఆహారం, అనుబంధ రంగాల్లో వచ్చే ఏడాది నాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు ఓ అంచనా. ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల ప్రధాన విధి.. ఆహారం ఎక్కువకాలంపాటు నిల్వ ఉండేలా చూడడం. ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్లలో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల పాత్ర కీలకం. జామ్‌లు, జెల్లీలు, ఫ్రూట్ డ్రింక్స్, జ్యూస్‌లు తదితర తయారీ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. ఫుడ్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టాలంటే.. ఫిజికల్ సెన్సైస్, బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పట్టు ఉండాలి. కార్యాలయాలతోపాటు ప్రయోగశాలల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయగల సామర్థ్యం అవసరం. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ అవసరాలను, వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవాలి. ప్రయోగాల ద్వారా కొత్త పదార్థాల తయారీకి ప్రయత్నించాలి. అర్హతలు: మనదేశంలో పలు కళాశాలలు/ విశ్వవిద్యాలయాలు ఫుడ్‌టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత బీఎస్సీలో చేరొచ్చు. పీజీ, పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: ఫుడ్ టెక్నాలజీలో బీఎస్సీ పూర్తిచేసినవారికి ప్రారంభంలో ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారికి ఇంకా అధిక వేతనం ఉంటుంది. ఈ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి రూ.5 లక్షలు అందుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వేతనం లభిస్తుంది. ఇక జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.15 లక్షలకు పైగా పొందొచ్చు. ఫుడ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.osmania.ac.in ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.angrau.ac.in సీఎస్ఐఆర్- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వెబ్సైట్: www.cftri.com భాస్కరాచార్య కాలేజీ ఆఫ్ అప్లయిడ్ సెన్సైస్-ఢిల్లీ యూనివర్సిటీ. వెబ్సైట్: www.bcas.du.ac.in యూనివర్సిటీ ఆఫ్ బాంబే. వెబ్సైట్: www.mu.ac.in ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది ‘‘ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందరూ పోషకాహారంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించినవారికి కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలున్నాయి. మనదేశంలో ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది. సాధారణ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులకంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. టీచింగ్, రీసెర్చ, జాబ్ దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత కోర్సుల్లో చేరడం మంచిది. లేబొరేటరీలు, విద్యాసంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. నైపుణ్యాలను పెంచుకుంటే కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. సైంటిస్ట్‌గా ఎదిగితే నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకోవచ్చు. - డాక్టర్ ఆవుల లక్ష్మయ్య, డిప్యూటీ డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హైదరాబాద్ -
దేహాన్ని, మనసును సేదతీర్చే.. స్పా థెరపిస్ట్
ఆధునిక యుగంలో మనిషి జీవితం ఒత్తిళ్లమయం. క్షణం తీరిక లేని ఉరుకుల పరుగుల కాలంలో జీవనం యాంత్రికంగా మారిపోయింది. శరీరం, మనసు అలసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పునరుత్తేజం పొందితేనే ఆరోగ్యం, ఆనందం చేకూరుతాయి. అలసిన దేహాన్ని, మనసును సేదతీర్చే నిపుణులే.. స్పా థెరపిస్ట్‌లు. దేశవిదేశాల్లో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పా థెరపీ. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో థెరపిస్ట్‌లకు చేతినిండా అవకాశాలు లభిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో 6 లక్షల మంది కావాలి స్పా థెరపీ ప్రధాన లక్ష్యం.. మనసు, దేహం, ఆత్మల మధ్య సమతూకం సాధించడం. ఇందులో హోలిస్టిక్ థెరపీ, బ్యూటీ థెరపీ, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ వంటి విభాగాలుంటాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) నివేదిక ప్రకారం.. మనదేశంలో వచ్చే ఐదేళ్లలో అదనంగా 6 లక్షల మంది స్కిల్డ్ స్పా థెరపిస్ట్‌లు అవసరం. గత పదేళ్లుగా ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నైపుణ్యం గల థెరపిస్ట్‌ల కొరత వేధిస్తోంది. స్పా థెరపీ కోర్సులు అభ్యసిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు ఉండదు. తగిన అనుభవం ఉన్నవారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. నేడు అన్ని నగరాల్లో స్పాలు వెలుస్తున్నాయి. దేశ విదేశాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. వనరులు అందుబాటులో ఉంటే సొంతంగా స్పాను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పా థెరపీలో అనుకూలమైన పనివేళలు ఉంటాయి. సాధారణంగా క్లయింట్లు ఎక్కువగా సాయంత్రం వేళలో వస్తుంటారు. ఇతర రంగాల తరహాలో ఇందులో ఎక్కువ ఒత్తిళ్లు ఉండవు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. మెరుగైన పనితీరుతో క్లయింట్లకు సంతృప్తి కలిగిస్తే మంచి ఆదాయం అందుతుంది. కెరీర్లో పేరు తెచ్చుకోవడానికి, వేగంగా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అర్హతలు: మనదేశంలో విద్యాసంస్థలు స్పా థెరపీపై సర్టిఫికెట్, డిప్లొమా, ఫౌండేషన్, స్పా మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి స్వల్పకాలిక కోర్సులే. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు వీటిలో చేరొచ్చు. వేతనాలు: క్వాలిఫైడ్ స్పా థెరపిస్ట్‌లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. ఐదేళ్లపాటు పనిచేసి తగిన అనుభవం సంపాదిస్తే నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. మేనేజ్మెంట్ స్థాయికి చేరుకుంటే నెలకు 30 వేల నుంచి రూ.80 వేల దాకా ఆర్జించొచ్చు. స్పా థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఇస్పా ఇంటర్నేషనల్ స్పా అకాడమీ-కొచ్చిన్ వెబ్సైట్: www.ispaa.com ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ స్పా థెరపీస్ వెబ్సైట్: www.elitebeautyschool.co.nz లెయిర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పా థెరపీ వెబ్సైట్: www.lairdinstitute.com ఆనంద స్పా ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ వెబ్సైట్: www.anandaspainstitute.com ఆరోగ్య థెరపీలో అవకాశాలెన్నో.. ‘‘శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలం. ఒత్తిడి, నొప్పులు వంటివి మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేద చికిత్సలో ఉన్న మార్గమే స్పా థెరపీ. ఇది కేవలం శరీరాన్ని మర్దనం చేయడమే కాదు.. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు అనువైన శాస్త్రీయ విధానంతో అందించే చికిత్స. ఈ కోర్సులు చదివినవారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. టూరిజం కేంద్రాలు, స్టార్ హోటళ్లు, ఆయుర్వేద ఆసుపత్రుల్లో బోలెడు అవకాశాలున్నాయి. సొంతంగా స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరో పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారికి స్థాయికి తగిన కొలువు గ్యారంటీగా లభిస్తుంది. థెరపిస్టుగా ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు సంపాదించవచ్చు. థెరపిస్టు సూపర్వైజర్, అసిస్టెంట్ స్పా మేనేజర్, స్పా మేనేజర్, స్పా డెరైక్టర్.. ఇలా కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. రూ.లక్ష వరకూ వేతనం అందుకునే వీలుంది. విదేశాల్లో అయితే మరింత ఎక్కువ ఆదాయం లభిస్తుంది’’ -డాక్టర్ మిలింద్ సాలుంకె, హెడ్ ఆఫ్ ఆనంద్ స్పా ఇనిస్టిట్యూట్ -
తెలుగు భాషను కాపాడుకోవాలి
నాంపల్లి: ఆధునిక యుగంలో తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో 2013- 14 సంవత్సరం సంస్కృతి పురస్కార ప్రదానోత్సవవేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆయన హాజరయ్యారు. మాతృ భాషలోని మాధుర్యాన్ని భావి తరతరాలకు అందించేందుకు అందరూ పాటుపడాలని కోరారు. తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు మండలి వెంకటకృష్ణారావు పాటుపడ్డారన్నారు. పొరుగు దేశాల్లో తెలుగును కాపాడుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం తక్కువచేసి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ జపాన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో మాతృభాషలోనే అన్ని వ్యవహారాలు కొనసాగుతాయని, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోందన్నారు. డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ప్రభుత్వాధినేతలకు భాషాభిమానం కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంఘాల పుట్టుకకు, భాష చైతన్యానికి మండలి వెంకట కృష్ణారావు స్ఫూర్తినిచ్చారని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి భాషాసంస్కృతికి,అభ్యుదయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిందన్నారు. అనంతరం బర్మా తెలుగు సంఘం(మయన్మార్)-2013) ఎర్ర నాయుడికి, ప్రపంచ తెలుగు సమాఖ్య(చెన్నై)-2014 ఆదిశేషయ్యలకు మండలి వెంక ట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ. 25వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం డెరైక్టర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం పాల్గొన్నారు. -
భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ
ప్రాచీన కాలంలో జంతువుల చర్మాన్నే మనుషులు దుస్తులుగా ధరించేవారు. ఆధునిక యుగంలో రకరకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జంతు చర్మంతో రూపొందించిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. తోలుతో తయారు చేసిన పాదరక్షలు, బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, రెయిన్ కోట్లకు మంచి డిమాండ్ ఉంది. తోలు వస్తువుల వాడకాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. భారత్‌లో తోలు పరిశ్రమ వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని కెరీర్‌గా ఎంచుకుంటే.. భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అవకాశాలు ఎన్నెన్నో.. లెదర్ టెక్నాలజీ కోర్సులను చదివిన వారికి మెరుగైన అవకాశాలు దక్కుతున్నాయి. ప్రధానంగా తోలు శుద్ధి పరిశ్రమల్లో లెదర్ టెక్నాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంది. మనదేశంలో హైదరాబాద్, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జలంధర్, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో తోలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. లెదర్ గూడ్స్, లెదర్ గార్మెంట్స్ కంపెనీలు లెదర్ టెక్నాలజిస్టులను నియమించుకుంటు న్నాయి. లెదర్ కెమికల్స్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. దేశ విదేశాల్లో తోళ్ల వ్యాపారం నిర్వహించే సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా లెదర్ ఫినిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తగిన ఆసక్తి ఉంటే యూనివర్సిటీ లు/కళాశాలల్లో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి లెదర్ టెక్నాలజిస్టుగా రాణించాలంటే.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, శ్రమించే తత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. తోలు శుద్ధి పరిశ్రమలు సాధారణంగా జనావాసాలకు దూరంగా ఏర్పాటవుతాయి. ఇందులో రసాయనాల వినియోగం ఎక్కువ. కాబట్టి అక్కడ పనిచేసేందుకు సిద్ధపడాలి. లెదర్ టెక్నాలజిస్టులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అర్హతలు: లెదర్ టెక్నాలజీలో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా/బీటెక్‌లో చేరొచ్చు. ఎంటెక్ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: లెదర్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన వారు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనం పెరుగుతుంది. లెదర్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ-గోల్కొండ, హైదరాబాద్ సెంట్రల్ లెదర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ - చెన్నై వెబ్సైట్: www.clri.org అన్నా యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.annauniv.edu వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-కోల్‌కతా వెబ్సైట్: www.wbut.ac.in హర్కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్-కాన్పూర్ వెబ్సైట్: www.hbti.ac.in విదేశాల్లోనూ అవకాశాలు ‘‘పాస్.. ఫెయిల్‌తో సంబంధం లేకుండా మెరుగైన కెరీర్‌ను అందించే కోర్సులు... లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ. మూడున్నరేళ్ల కోర్సు సమయంలో ఏడాదిపాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం రూ.10వేల వరకూ ఉంటుంది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ కోర్సులను అభ్యసిస్తే మంచి వేతనంతో కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు’’ - అన్నే శివాజీ, సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్ -
ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు.. సంతాన ప్రాప్తిరస్తు!
అప్‌కమింగ్ కెరీర్: మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి ఒక మధుర మైన భావన, మరిచిపోలేని తియ్యటి అనుభూతి. ఆధునిక యుగంలో అలాంటి అనుభూతికి దూరమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. సంతానలేమి సమస్య తీవ్రమవుతోంది. అయితే, కాలానుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం రంగ ప్రవేశం చేయడంతో ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతోంది. ఫెర్టిలిటీ సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సంతానం లేని వారి ఆకాంక్షలను తీరుస్తూ వారి కుటుంబాల్లో ఆనందం నింపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెర్టిలిటీ కేంద్రాల సంఖ్య పెరిగిపోతోంది. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ స్ట్రీమ్‌లోకి ప్రవేశించొచ్చు. ఈ కెరీర్లో ప్రవేశిస్తే వృత్తిపరమైన సంతృప్తితోపాటు అధిక వేతనాలు అందుకోవచ్చు. అనుభవం సంపాదించాకే ప్రాక్టీస్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టులు పునరుత్పత్తి సామర్థ్యం లేనివారికి చికిత్స చేయాల్సి ఉంటుంది. సింపుల్ మెడికేషన్ నుంచి ఆపరేటివ్ లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ వరకు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ చికిత్సలు ఫలించకపోతే.. ఐయూఐ (ఇంట్రా యుటేరిన్ ఇన్సెమినేషన్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), ఐవీఎఫ్- ఐసీఎస్ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్), పీజీడీ (ప్రి ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్) వంటి అత్యాధునిక విధానాల ద్వారా నిస్సంతులకు సంతాన భాగ్యం కలిగించొచ్చు. ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టులుగా కెరీర్ ప్రారంభించాలనుకొనేవారు ముందుగా ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్లో చేరి తగిన అనుభవం గడించిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. పరిజ్ఞానం పెంచుకోవడం తప్పనిసరి ఫెర్టిలిటీ రంగంలో రోజురోజుకీ మార్పులు జరుగుతుంటాయి. నూతన పరిజ్ఞానం, విధానాలు తెరపైకి వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉంటేనే వృత్తిలో పేరు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు కొందరికి ఎలాంటి చికిత్సలు పనిచేయకపోవచ్చు. సంతానం కలగకపోవచ్చు. అయినా నిరాశపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. ప్రతి శాస్త్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసుకోవాలి. వైద్యులు తమ వంతు ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇన్ఫెర్టిలిటీ నిపుణులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. నగరాలతోపాటు చిన్నస్థాయి పట్టణాల్లోనూ సాంతన సాఫల్య కేంద్రాలు విరివిగా ఏర్పాటవుతున్నాయి. వీటిలో నిపుణులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. వేతనాలు: ఇన్ఫెర్టిలిటీ వైద్యులకు మంచి వేతనాలు అందుతున్నాయి. ప్రారంభంలో నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. కొంత అనుభవం ఉన్నవారికి నెలకు రూ.50 వేలకు పైగా వేతనం ఉంది. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే అధిక ఆదాయం ఆర్జించొచ్చు. కావల్సిన స్కిల్స్: ఇన్ఫెర్టిలిటీ నిపుణులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సెలింగ్ స్కిల్స్ ఉండడం అవసరం. కొందరికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉండ కపోవచ్చు. వారికి ఆ విషయాన్ని సున్నితంగా చెప్పగలిగే నేర్పు ఇన్ఫెర్టిలిటీ నిపుణులకు ఉండాలి. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. -
హెల్త్‌కేర్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్
జాబ్ పాయింట్: ఆధునిక యుగంలో ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన విసృ్తతమవుతోంది. దీంతో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ నూతన సాంకేతిక సొబగులద్దుకొని వేగంగా వృద్ధి చెందుతోంది. హెల్త్‌కేర్‌లోనూ ఎన్నో రంగాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో బెస్టు కెరీర్ ఆప్షన్‌గా మారనున్న కొన్ని రంగాలు.. డైటీషియన్: సమాజంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండడంతో డైటీషియన్లకు డిమాండ్ అధికమవుతోంది. బరువు తగ్గించుకోవడం ఎలా? పెంచుకోవడం ఎలా? ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి విషయాలు తెలుసుకొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో సందేహాలు తీర్చి, ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి.. డైటీషియన్. ఒకప్పుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలోనే డైటీషియన్లు ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లోనూ వీరి సేవలు అందుతున్నాయి. డైటీషియన్ రంగాన్ని ఎంచుకుంటే ఆసుపత్రుల్లో పనిచేయడంతోపాటు సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైటీషియన్లకు భారీ అవకాశాలున్నాయనేది నిపుణుల మాట. స్పోర్ట్స్ సైకాలజీ: సైకాలజీలోని ఒక స్పెషలైజేషన్ స్పోర్ట్స్ సైకాలజీ. నేటి యువత క్రీడలను తమ కెరీర్‌గా మలచుకుంటోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ సైకాలజిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ అకాడమీల్లో క్రీడాకారులకు మానసికంగా మెరికలుగా తీర్చిదిద్దడం, వారిని ఆటకు సంసిద్ధులను చేయడం వీరి బాధ్యత. భారత క్రీడారంగంలోకి కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ క్రీడా సంస్థలు కూడా ప్రవేశిస్తుండడంతో స్పోర్ట్స్ సైకాలజిస్టులు అవకాశాలు మరింత మెరుగువుతున్నాయి. స్పీచ్ థెరపీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్పీచ్ థెరపిస్టులకు భారీ డిమాండ్ ఉంది. వీరికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలున్నాయి. స్పీచ్ థెరపిస్టులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్పెషల్ స్కూల్స్, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేయొచ్చు. నిపుణులైన స్పీచ్ థెరపిస్టులు అమెరికా/యూకే/కెనడా నిర్వహించే అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే కెరీర్లో సులువుగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్: భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రొఫెషన్ హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ట్రైనర్లకు మంచి డిమాండ్ ఉంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో వీరి అవసరం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. హెల్త్‌కేర్ ట్రైనర్లు ఆసుపత్రుల్లో సేవలందించడంతోపాటు స్వయం ఉపాధి పొందొచ్చు. హెల్త్‌కేర్ ఎడ్యుకేటర్ నైపుణ్యాలు పెంచుకొని, తగిన అనుభవం సంపాదిస్తే సూపర్వైజర్, సీనియర్ హెల్త్ ఎడ్యుకేటర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వంటి హోదాలను అందుకోవచ్చు. ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్: హెల్త్‌కేర్ రంగంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ట్రెండ్ ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. రోగులకు సంబంధించిన మెడికల్, ట్రీట్మెంట్ హిస్టరీని ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందించేవారే ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. వీరికి ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో టెక్నికల్ స్టాఫ్‌కు అధిక డిమాండ్ ఉంది. ఈ-హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.