మేం రెడీ.. | Memu Saitham, says film industry | Sakshi
Sakshi News home page

మేం రెడీ..

Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

మేం రెడీ.. - Sakshi

మేం రెడీ..

హుద్‌హుద్ ఎఫెక్ట్‌తో సర్వం కోల్పోయిన వైజాగ్‌వాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఉక్కు సంకల్పంతో దూసుకెళ్తోంది. ‘మేముసైతం’ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అయిన తారాలోకం.. ఈ రోజు అదరగొడతాం అంటోంది. శనివారం ప్రాక్టీస్ సెక్షన్‌లో ఆటవిడుపుగా ఫొటోకు ఇదిగో ఇలా పోజిచ్చారు.
 
మేమంతా ఒక్కటే..
హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం సినిమా లోకం చేస్తున్న ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా తారలంతా ఇందులో పాలుపంచుకుంటున్నారు. సినిమా జనాలను సెలబ్రిటీలుగా మార్చిన ఘనత ప్రేక్షక దేవుళ్లదే. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ వారే మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆ ప్రేక్షకులు కష్టంలో ఉన్నారు. వారికి జరిగిన నష్టాన్ని పూర్తిగా తీర్చలేం. కానీ, మావంతు సాయంగా ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చాం. మా స్పందన వారికి ఓదార్పునిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.

దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సురేష్‌బాబు, దామోదరప్రసాద్.. ఎందరో దర్శక నిర్మాతలు, వీరితోపాటు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ‘మేముసైతం’లో పాలుపంచుకుంటున్నారు. ఈ బృహత్కార్యంలో టెక్నికల్‌గా సపోర్ట్ చేస్తూ సూపర్‌వైజింగ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్‌ను హుద్‌హుద్ తుడిచిపెట్టేసింది. ఇటీవల విశాఖ వెళ్లినప్పుడు అక్కడి వాళ్లలో ఓ ధైర్యం కనిపించింది. తమ నగరాన్ని తిరిగి అంతే సుందరంగా పునర్నిర్మించుకుంటామనే నమ్మకం వాళ్లలో ఉంది. వైజాగ్‌వాసుల మొక్కవోని ఆత్మవిశ్వాసానికి జోహార్లు.                         - వీఎన్ ఆదిత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement