గూగుల్ సెర్చ్లో నరేంద్ర మోడీ టాప్
నరేంద్రమోడీ ఎవరు? గుజరాత్ ముఖ్యమంత్రి, మహా అయితే భారతీయ జనతా పార్టీ తన ప్రధాని అభ్యర్థిగా ఇటీవలే ఎంపిక చేసింది. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఆ రాష్ట్రాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహ పరుస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది.
దీంతో భారత రాజకీయాల్లో నరేంద్రమోడీ కీలకమైన శక్తిగా క్తిగా మారారు. అంతేకాకుండా కురువృద్ధుల పార్టీ కాంగ్రెస్ను పక్కకు తొసి తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు. దీంతో నరేంద్ర మోడీ ఎవరు అని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెబ్సైట్ వీక్షకులు గూగుల్ను ఆశ్రయించారు. అలాగే బాలీవుడ్ చిత్ర రంగంలో పలువురు హీరో హీరోయిన్లు కోసం ఆ సైట్ను ఆశ్రయించారు.
దాంతో గూగుల్కు చెందిన జిట్జియస్ట్- 2013 నివేదికను ఇటీవలే విడుదల చేసింది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో భారతీయ నాయకుల్లో మోడీ అగ్రస్థానాన్ని అక్రమించారు.ఆ తర్వాత స్థానాలు వరుసగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత వరుసగా మిగతా నాలుగు స్థానాల్లో నిలిచారని పేర్కొంది.
న్యూఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పై పోటీ చేసి ఆమెను డీలా చేయడమే కాకుండా, ఆ పార్టీని ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోస్థానాన్ని సొంతం చేసుకున్నారు. వారితో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్లు వరుసగా ఏడు నుంచి పది స్థానాలలో నిలిచారు.