శరవేగంగా 'బాహుబలి' నిర్మాణం | Rapidly 'Bahubali' shooting | Sakshi
Sakshi News home page

శరవేగంగా 'బాహుబలి' నిర్మాణం

Published Tue, Aug 5 2014 3:13 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

శరవేగంగా 'బాహుబలి' నిర్మాణం - Sakshi

శరవేగంగా 'బాహుబలి' నిర్మాణం

బాహుబలి. ఈ సినిమా నిర్మాణదశలోనే ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని పెంచుతోంది.  విడుదలకు ముందే ఈ చిత్రంపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు ఏ తెలుగు సినిమాకు ఇంతటి ప్రచారం జరుగలేదు. గత ఏడాది ప్రారంభించిన ఈ సినిమా నిర్మాణం ఈ ఏడాది చివరికి గానీ పూర్తికాదు. అయినా శరవేగంగా షూటింగ్ జరుగుతోందిన యూనిట్ వారు చెబుతున్నారు. అంటే ఈ మూవీని ఏ స్థాయిలో నిర్మిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్తో నిర్మించే ఈ చిత్రంపై  సినీపరిశ్రమతోపాటు ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి, అందులో నటించే తారల వల్లే దీనిపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. జక్కన్న నిర్మించే పద్దతులు - ప్రభాస్ - అనుష్క, రాణా.. వీరందరూ ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ పొందడం, వారు  పడే శ్రమతో  భారీ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ చిత్రం విడుదలకు ముందే అనేక సంచలనాలు,   రికార్డులు సృష్టిస్తోంది.

ఇంతకు ముందు వివిద ప్రదేశాలలో జరిగిన ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్లోనే  శరవేగంతో జరుగుతోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  రాజమౌళి ఓ యజ్ఞంలా దీనిని హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది  దక్షిణాది భాషలైన తెలుగు,  కన్నడ, తమిళం, మలయాళంతో పాటు హిందీ, ఇంకా పలు భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న తలంపుతో ఉన్నారు.  సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఎక్కువ సమయం తీసుకుని రూపొందుతున్న తెలుగు చిత్రం బాహుబలిగా పేర్కొంటున్నారు.  షోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అంటున్నారు. రాజమౌళితోపాటు ఇందులో నటించేవారందరికీ పేరుప్రఖ్యాతులు సంపాదించిపెడుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే పంపిణీదారులు ఎగబడటం విశేషం. ఇప్పటికే దిల్ రాజు  ఈ సినిమా నైజాం ప్రాంత హక్కులు పొందడానికి భారీ మొత్తం చెల్లించడానికి అంగీకరించినట్లు  సమాచారం. ఒక ప్రాంత హక్కుల కోసం టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.  ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సోబు యార్లగడ్డ, కొవెలమూడి రాఘవేంద్ర రావు, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, రానాలతోపాటు తమన్నా, రమ్యకృష్ణ, సుదీప్, నాజర్, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement