గ్లామర్.. c/o రూమర్ | rumour Boutique is c/o Glamour | Sakshi
Sakshi News home page

గ్లామర్.. c/o రూమర్

Published Tue, Oct 21 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

గ్లామర్.. c/o రూమర్

గ్లామర్.. c/o రూమర్

జూబ్లీహిల్స్ రోడ్ నం: 45లోని‘రూమర్’ బోటిక్ జంట నగరాల్లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ట్రెడిషనల్, అఫీషియల్, ఇండో-వెస్టర్న్, బ్రైడల్ వేర్, కస్టమైజ్డ్ వస్త్రాల రూపకల్పనలో మగువలను ఆకట్టుకుంటున్న ‘రూమర్’ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో సోమవారం సెలిబ్రిటీలు, పేజ్ త్రీ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మంచు విష్ణు భార్య వెరోనికా, హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
 తవు కస్టమర్లలో ఎక్కువమంది సెలిబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు, స్టూడెంట్స్ కావడంతో ఎప్పటికప్పుడు వారి అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లను అందిస్తున్నామని, బోటిక్‌లోనే శారీలు, ఇతర డ్రెస్‌లపై మగ్గం వర్క్ చేయించడం త
మ ప్రత్యేకత అని బోటిక్ వ్యవస్థాపకురాలు కవితారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయానికి కచ్చితంగా డెలివరీ అందించడం వల్ల కస్టమర్లు తమ బోటిక్‌ను ఆదరిస్తున్నారని ఆమె తెలిపారు.
 
 అందుబాటు ధరలు..
 మిగిలిన బోటిక్స్‌తో పోల్చుకుంటే, ‘రూమర్’లో ధరలు చాలా తక్కువ. ఇందులో ఇండో-వెస్టర్న్ డ్రెస్‌లు చాలా ఆకట్టుకుంటాయి.
ఇక్కడ నాకు నచ్చే డ్రెస్‌లు దొరుకుతాయి. ముఖ్యంగా బ్రైడల్ డ్రెసెస్‌ను ‘రూమర్’ అద్భుతమైన నాణ్యతతో అందిస్తోంది.
 - నిఖితారెడ్డి
 
మంచి కలెక్షన్..
 మంచి కలెక్షన్, వస్త్రాల నాణ్యత, అందుబాటు ధరలు ‘రూమర్’ ప్రత్యేకత. కస్టమర్లకు నప్పే దుస్తులను సూచించడం, వారి ఆకృతికి సరిపోయే కస్టమైజ్డ్ వస్త్రాలను రూపొందించడం ఈ బోటిక్ విలక్షణత. ఈ ప్రత్యేకతలే ‘రూమర్’ సక్సెస్‌కు కారణం
 - మంచు వెరోనికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement