Veronica
-
OTTలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు!
ఓటీటీ అనగానే చాలామంది థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తారు. సబ్స్క్రిప్షన్ వృథాగా పోకుండా మంచి సినిమాలన్నీ చూసేయాలనుకుంటారు. కొత్తగా రిలీజయ్యే వాటిని ఎలాగోలా చూస్తారు. కానీ, అవైపోయాక ఏం చేయాలో అర్థం కాదు. ఇందుకోసం ఓటీటీలో టాప్ సినిమాల జాబితా కోసం గూగుల్‌లో వెతికేస్తారు. అలాంటివారికోసమే నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాను ఇక్కడ పొందుపరిచాం. నెట్‌ఫ్లిక్స్‌లో.. ఇవి బాగుంటాయ్ అని చెప్పుకునే సినిమాలు బోలెడు. వాటిలో ఓ పది చిత్రాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూసేయండి..డామ్సెల్ఒక యువరాణి తన రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు ఓ గాయపడ్డ డ్రాగన్‌ను కనుగొంటుంది. దానితో ఆమెకు మంచి స్నేహం కుదురుతుంది. ఈ స్నేహితులు ఏం చేశారన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే!ద విచ్ఒక ఫ్యామిలీ అడవిలోని ఓ ప్రదేశంలో తమకంటూ ఓ ఇల్లు నిర్మించుకుని ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ భయాన సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన్నారా? లేదా? వీరు దెయ్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారా? అన్నది తెలియాలంటే ద విచ్ చూడాల్సిందే!ట్రైన్ టు బూసన్దక్షిణ కొరియాలో జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో ఓ రైలులో మనుషులు ఉన్నట్లుండి జాంబీలుగా మారిపోతారు. మరి అందులోని హీరో కుటుంబం వీరి బారి నుంచి సురక్షితంగా బయపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ!వెరోనికాసరదా ఆటలు కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారతాయి. ఓ టీనేజ్ అమ్మాయి ఊజా బోర్డుతో గేమ్ ఆడుతుంది. దాంతో దెయ్యం ఆమె వెంటపడుతుంది. తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.బర్డ్ బాక్స్ఒక శక్తి.. తన కంటిచూపుతో జనాల్ని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో వారు కళ్లకు గంతలు కట్టుకుని నది దాటే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్లు గండం గట్టెక్కారా? లేదా? అనేది తెలియాలంటే బర్డ్ బాక్స్ చూడాల్సిందే!ఫ్రాక్చర్డ్యాక్సిడెంట్ తర్వాత ఓ జంట ఆస్పత్రిలో చేరుతుంది. తీరా చూస్తే తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఆస్పత్రిలోనే ఏదో జరుగుతోందని హీరో కనుగొంటాడు. తన భార్య, కూతురిని తిరిగి కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.స్ట్రేంజర్ థింగ్స్మనకు తెలియని ప్రపంచం మరోటి ఉందని పిల్లలు కనుగొంటారు. ఆ మరో ప్రపంచంలోని రాక్షస జీవులతో పోరడతారు. అదృశ్య శక్తులున్న ఓ అమ్మాయి ఆ రాక్షస జీవులతో పోరాడేందుకు సాయం చేస్తుంది. ఇప్పటికి ఈ వెబ్ సిరీస్ నాలుగు సీజన్లు వచ్చింది. త్వరలో ఐదో సీజన్ రాబోతోంది.ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్అమెరికన్ రచయిత ఎడ్గర్ అల్లన్ పో ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ అనే కథ రాశాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఓ కుటుంబాన్ని దెయ్యం వెంటాడుతూ ఉంటుంది.. ఒంట్లో వణుకు పుట్టించే సిరీస్ ఇది.ట్రూత్ ఆర్ డేర్మనలో చాలామంది ఆడుకునే సరదా ఆట ఇది. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. కానీ ఎవరైనా అబద్ధం చెప్పారంటే ఓ శక్తి వారిని దారుణంగా శిక్షిస్తుంటుంది. ఆటను మధ్యలో వదిలేసినవారిని చంపడానికి కూడా వెనుకాడదు.మెరైన్ఓ అమ్మాయి హారర్ కథలు రాస్తుంటుంది. నెమ్మదిగా అవన్నీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ సిరీస్ హారర్ ప్రియులను కచ్చితంగా మెప్పిస్తుంది.చదవండి: మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్ -
Viranica Manchu: చెన్నైలో మంచు విష్ణు సతీమణి సందడి
తమిళసినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు సతీమణి వెరోనికా పాప్ అప్ షోతో సందడి చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె న్యూయార్క్‌లో జ్యువెలరీ డిజైనింగ్ చేశారు. వివాహానంతరం ఫ్యాషన్ మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించి హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనింగ్ షాప్‌ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా చెన్నైలో తన ఫ్యాషన్ మార్కెటింగ్ విస్తరించేందుకు లేబుల్ విడా పేరుతో పాప్ అప్ షో నిర్వహించారు. నటులు జయం రవి భార్య ఆర్తి, సినీ ప్రముఖులు, మహిళలు ఇందులో పాల్గొన్నారు. చదవండి: ('కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?) -
నాన్నకు ప్రేమతో : మంచు విష్ణు
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడిగా పెట్టిన పేరును మంచు విష్ణును ఆసక్తికరమైన ట్వీట్ తో వెల్లడించారు. ఇప్పటికే మంచు విష్ణుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు చిన్నారి తమ్ముడిని బేబీ లయన్, బేబీ టెడ్డీ బేర్ అని పిలుస్తున్నారట. అయితే మిగతా వాళ్లు మాత్రం ‘అవ్రామ్ భక్త మంచు’ అని పిలుస్తున్నాం అంటూ కొడుకుకి పెట్టిన పేరును ప్రకటించాడు విష్ణు. అవ్రామ్ అంటే ‘ఎవరూ ఆపలేని వ్యక్తి’ అని తెలిపాడు మంచు విష్ణు. అదే సమయంలో కొడుకు పేరులో భక్త అన్న పదాన్ని చేర్చటం కూడా ఆసక్తికరంగా మారింది. విష్ణు తండ్రి సీనియర్ నటుడు మెహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి మీద ప్రేమతోనే విష్ణు.. కొడుకుకు అవ్రామ్ భక్త అని పేరు పెట్టుకున్నాడు. Ariaana calls him ‘Baby Lion’ Viviana calls him ‘ Baby Teddy Bear’ Rest of us call him అవ్రామ్ భక్త మంచు Avram Bhakta Manchu Avram means ‘One who cannot be stopped’ — Vishnu Manchu (@iVishnuManchu) 4 January 2018 -
వారసత్వంపై యంగ్ హీరో క్లారిటీ..!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులకు కవలలు జన్మించనున్నారట. కొడుకు పుడితే వారసుడు పుట్టాడని అంటారు. ఈ విషయంపై మంచు విష్ణు స్పందించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా.. నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు.. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు.’ అని మంచు విష్ణు తన అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
‘ఈ నిరీక్షణ భరించలేకపోతున్నా’
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికా దంపుతులకు అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులు కవలలకే జన్మనివ్వనున్నారట. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పుట్టబోయే పిల్లల కోసం రెండు జతల పేర్లను సిద్ధం చేసినట్టుగా తెలిపారు. అంతేకాదు ఈ నిరీక్షణ భరించలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. My Stomach is doing flips as @vinimanchu is due any day now. Have two sets of names. One for a boy & one for a girl. I am hoping it’s a girl again. This wait is torture. — Vishnu Manchu (@iVishnuManchu) 30 December 2017 -
గ్లామర్.. c/o రూమర్
జూబ్లీహిల్స్ రోడ్ నం: 45లోని‘రూమర్’ బోటిక్ జంట నగరాల్లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ట్రెడిషనల్, అఫీషియల్, ఇండో-వెస్టర్న్, బ్రైడల్ వేర్, కస్టమైజ్డ్ వస్త్రాల రూపకల్పనలో మగువలను ఆకట్టుకుంటున్న ‘రూమర్’ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో సోమవారం సెలిబ్రిటీలు, పేజ్ త్రీ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మంచు విష్ణు భార్య వెరోనికా, హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తవు కస్టమర్లలో ఎక్కువమంది సెలిబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు, స్టూడెంట్స్ కావడంతో ఎప్పటికప్పుడు వారి అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లను అందిస్తున్నామని, బోటిక్లోనే శారీలు, ఇతర డ్రెస్‌లపై మగ్గం వర్క్ చేయించడం త మ ప్రత్యేకత అని బోటిక్ వ్యవస్థాపకురాలు కవితారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయానికి కచ్చితంగా డెలివరీ అందించడం వల్ల కస్టమర్లు తమ బోటిక్‌ను ఆదరిస్తున్నారని ఆమె తెలిపారు. అందుబాటు ధరలు.. మిగిలిన బోటిక్స్తో పోల్చుకుంటే, ‘రూమర్’లో ధరలు చాలా తక్కువ. ఇందులో ఇండో-వెస్టర్న్ డ్రెస్‌లు చాలా ఆకట్టుకుంటాయి. ఇక్కడ నాకు నచ్చే డ్రెస్‌లు దొరుకుతాయి. ముఖ్యంగా బ్రైడల్ డ్రెసెస్‌ను ‘రూమర్’ అద్భుతమైన నాణ్యతతో అందిస్తోంది. - నిఖితారెడ్డి మంచి కలెక్షన్.. మంచి కలెక్షన్, వస్త్రాల నాణ్యత, అందుబాటు ధరలు ‘రూమర్’ ప్రత్యేకత. కస్టమర్లకు నప్పే దుస్తులను సూచించడం, వారి ఆకృతికి సరిపోయే కస్టమైజ్డ్ వస్త్రాలను రూపొందించడం ఈ బోటిక్ విలక్షణత. ఈ ప్రత్యేకతలే ‘రూమర్’ సక్సెస్‌కు కారణం - మంచు వెరోనికా