వెండి వెలుగు
ఆసియానా గోల్డ్ అండ్ సిల్వర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో సిల్వర్, గోల్డ్ హస్త కళాకృతులు అబ్బురపరిచాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వింటేజ్ గోల్డ్ పొల్కీ, సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణ. దాదాపు తొమ్మిది వందల సిల్వర్ ఆర్టికల్స్ ఇక్కడ కొలువుదీరాయి. వెండితో తయారు చేసిన కృష్ణ లీల పాట్ స్పెషల్ అట్రాక్షన్.
ఐదు కేజీల వెండితో రూపొందించిన ఈ కుండపై కృష్ణుడి లీల కనపడుతుంది. సిటీ ఆర్టిస్ట్ విషాన్ దీన్ని తీర్చిదిద్దారు. గణపతి ఉన్న పల్లకీని వివిధ భంగిమల్లోని మరో ఐదుగురు గణపతులు భుజాలపై మోస్తున్న వెండి డిజైన్ అపురూపంగా ఉంది. మరో స్పెషల్ అట్రాక్షన్ మ్యాంగో చైన్‌ను మెడలో వేసుకుని అమ్మాయిలు ముచ్చటపడ్డారు. ఇవే కాక... మరెన్నో మనసు దోచే వెరైటీలు సిటీజనుల కనువిందు చేశాయి.
సాక్షి, సిటీ ప్లస్