Hotel Taj Deccan
-
వెండి వెలుగు
ఆసియానా గోల్డ్ అండ్ సిల్వర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో సిల్వర్, గోల్డ్ హస్త కళాకృతులు అబ్బురపరిచాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వింటేజ్ గోల్డ్ పొల్కీ, సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణ. దాదాపు తొమ్మిది వందల సిల్వర్ ఆర్టికల్స్ ఇక్కడ కొలువుదీరాయి. వెండితో తయారు చేసిన కృష్ణ లీల పాట్ స్పెషల్ అట్రాక్షన్. ఐదు కేజీల వెండితో రూపొందించిన ఈ కుండపై కృష్ణుడి లీల కనపడుతుంది. సిటీ ఆర్టిస్ట్ విషాన్ దీన్ని తీర్చిదిద్దారు. గణపతి ఉన్న పల్లకీని వివిధ భంగిమల్లోని మరో ఐదుగురు గణపతులు భుజాలపై మోస్తున్న వెండి డిజైన్ అపురూపంగా ఉంది. మరో స్పెషల్ అట్రాక్షన్ మ్యాంగో చైన్‌ను మెడలో వేసుకుని అమ్మాయిలు ముచ్చటపడ్డారు. ఇవే కాక... మరెన్నో మనసు దోచే వెరైటీలు సిటీజనుల కనువిందు చేశాయి. సాక్షి, సిటీ ప్లస్ -
మంగళూరు రుచులు
దక్షిణ భారత సముద్ర తీర ప్రాంతాల రుచులను నగరంలో వేడివేడిగా వడ్డిస్తోంది బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ దక్కన్. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాల్లో ఫేమస్ వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ ‘మాంగలూరియన్ ఫుడ్ ఫెస్ట్’ నోరూరిస్తోంది. మంగళూరులోని గేట్‌వే రెస్టారెంట్ మాస్టర్ చెఫ్ మహేష్ నాయక్ ఈ వెరైటీలను ప్రిపేర్ చేస్తున్నారు. యేటి ఘీ రోస్ట్, కర్లినీ రోస్ట్, మస్సా సుఖా, లంబు సుఖా, నీరుల్లి బజ్జి, మస్సా కజిపు, యేటి పుల్లి చుంచి, కోరి రోటి, కోరి గస్సీ, వెజిటబుల్ గస్సీ, పైనాపిల్ సాస్వే, రాగిమని, కషి హల్వా, అప్పి పాయసం వంటి వెన్నో రుచులు ఈ పదిరోజుల ఆహారోత్సవంలో ఆరగించేయవచ్చు. మంగళూరు వంటల్లో కొబ్బరి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి కామన్‌గా వాడతారని... వీటితో మాంచి స్పైసీ రుచి వస్తుందని చెప్పారు చెఫ్. -
అదిరెన్
సరికొత్త వస్త్రాభరణాల శ్రేణులు నగరవాసులకు కనువిందు చేశాయి. రంగురంగుల చీరలు.. వెరైటీ నగలు మగువ మనసును దోచుకున్నాయి. బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో బుధవారం జరిగిన అరాయిష్ ఎగ్జిబిషన్లో ఆకర్షణీయుమైన ఐటమ్స్ ఎన్నో కొలువుదీరారుు. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి సతీవుణి మనాశెట్టి ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ ఏర్పాటు చేశారు. దీంతో పాటు టాప్ డిజైనర్లు రూపొందించిన వివిధ డిజైన్లు అతివలను కట్టిపడేశారుు.