మంగళూరు రుచులు
దక్షిణ భారత సముద్ర తీర ప్రాంతాల రుచులను నగరంలో వేడివేడిగా వడ్డిస్తోంది బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ దక్కన్. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాల్లో ఫేమస్ వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ ‘మాంగలూరియన్ ఫుడ్ ఫెస్ట్’ నోరూరిస్తోంది. మంగళూరులోని గేట్‌వే రెస్టారెంట్ మాస్టర్ చెఫ్ మహేష్ నాయక్ ఈ వెరైటీలను ప్రిపేర్ చేస్తున్నారు.
యేటి ఘీ రోస్ట్, కర్లినీ రోస్ట్, మస్సా సుఖా, లంబు సుఖా, నీరుల్లి బజ్జి, మస్సా కజిపు, యేటి పుల్లి చుంచి, కోరి రోటి, కోరి గస్సీ, వెజిటబుల్ గస్సీ, పైనాపిల్ సాస్వే, రాగిమని, కషి హల్వా, అప్పి పాయసం వంటి వెన్నో రుచులు ఈ పదిరోజుల ఆహారోత్సవంలో ఆరగించేయవచ్చు. మంగళూరు వంటల్లో కొబ్బరి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి కామన్‌గా వాడతారని... వీటితో మాంచి స్పైసీ రుచి వస్తుందని చెప్పారు చెఫ్.