చక్కెర తింటే మనకు వెంటనే కొంత శక్తి వస్తుంది కదూ.. ఇదే శక్తిని సెల్ఫోన్ బ్యాటరీలకు అందించగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే స్మార్ట్ఫోన్లకు పది రోజుల పాటు చార్జింగ్ అందించే టెక్నాలజీకి దారితీసింది. వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్ట్యూట్లో పరిశోధకులు కొత్తగా ఓ బయో బ్యాటరీని రూపొందించారు. దీని బరువు సెల్ఫోన్లలో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే చాలా తక్కువ, శక్తి చాలా ఎక్కువ.
సాధారణంగా మన శరీరంలో చక్కెర జీవక్రియ ద్వారా శక్తిగా మారుతుంది. అక్కడ కార్బన్ డయాక్సైడ్, నీరుగా మారి.. ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. బయో బ్యాటరీలు కూడా ఇదే పద్ధతిలో పనిచేసీ, ఈ ఎలక్ట్రాన్లను ఉపయోగించుకుని శక్తిగా మారుస్తాయి. ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. అందువల్ల సంప్రదాయ బ్యాటరీల కంటే వెయ్యిరెట్లు నయమన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీతో ఫోను కేవలం ఒక్కరోజు పనిచేస్తే.. చక్కెర బ్యాటరీతో పదిరోజులు పనిచేస్తుంది.
ఇక చక్కెరతో సెల్ ఫోన్ ఛార్జింగ్!
Published Mon, Mar 3 2014 10:40 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM
Advertisement