విద్యాబాలన్‌లో ఏమి‘టీ’ మార్పు..! | Vidya balan starts to have a cup of tea instead of Coffee morning | Sakshi
Sakshi News home page

విద్యాబాలన్‌లో ఏమి‘టీ’ మార్పు..!

Published Sun, Aug 17 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

విద్యాబాలన్‌లో ఏమి‘టీ’ మార్పు..!

విద్యాబాలన్‌లో ఏమి‘టీ’ మార్పు..!

దక్షిణాదిలో చాలామందిలాగే విద్యాబాలన్‌కు కూడా ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. ఇప్పుడామె కాఫీని మానేసి, టీ తాగడం ప్రారంభించింది. ఇదివరకు ఆమె రోజూ ఐదారు కప్పులు కాఫీ తాగేది. అయితే, కొద్ది రోజులుగా కాఫీ మానేసి టీ తాగడం ప్రారంభించానని, అది కూడా రెండు మూడు కప్పులకే పరిమితమవుతున్నానని విద్యాబాలన్ చెబుతోంది.
 
 యూరోప్‌లో జాక్విలిన్ హల్‌చల్
 ‘జుమ్మే కీ రాత్’ పాట ఇచ్చిన ‘కిక్’తో జాక్విలిన్ ఫెర్నాండెజ్ యూరోప్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘కిక్’ సూపర్‌హిట్ కావడంతో కొద్దిరోజులు బ్రేక్ తీసుకునేందుకు ఆమె యూరోప్ పర్యటనకు వెళ్లింది. పోలండ్‌లో ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న జాక్విలిన్... అక్కడి తన సన్నిహితులతో కలసి తీయించుకున్న ఫొటోలను అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో పెట్టింది.
 
 ‘కతియబాజ్’కు పాన్‌వాలాల సాయం
దీప్తి కక్కర్, పహద్ ముస్తఫాలు విద్యుత్ సంక్షోభంపై రూపొందించిన ‘కతియబాజ్’ చిత్ర బృందానికి కాన్పూర్ పాన్‌వాలాలు అడుగడుగునా సాయం చేశారు. ఎక్కడ విద్యుత్ చౌర్యం జరిగినా, విద్యుత్ స్తంభాల కింద దుకాణాలు నడుపుకొనే పాన్‌వాలాలు ముందుగా ‘కతియబాజ్’ బృందానికి సమాచారం అందించేవారు. దీంతో చిత్రీకరణ సజావుగా సాగింది. వచ్చే వారమే ఈ చిత్రం విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement