వైల్డ్ లైఫ్ గార్డ్స్
జంతువుల పాలిట లైఫ్‌గార్డ్స్ వాళ్లు. ఆపదలో చిక్కుకున్న మూగజీవాల పాలిట ఆపద్బాంధవులు. వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా సంఘటితమైన నిస్వార్థ సేవకులు. జంతు సంరక్షణపై భావసారూప్యం గల వారంతా కలసి ‘యూనివుల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్’ (ఏఆర్‌పీఎఫ్) పేరిట స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డారు. జూ కాప్స్‌గా, గ్రీన్ వారియర్స్‌గా విభిన్న సేవలందిస్తూ ముందుకు సాగుతున్న ‘ఫ్రంట్’పై ప్రత్యేక కథనం..
ఏఆర్‌పీఎఫ్.. ఈ పేరు వింటే చాలు.. జంతువుల వేదన అరణ్య రోదన కాబోదు. మూగజీవం ఆపదలో ఉంటే ‘మేమున్నామంటూ..’ వెంటనే ‘ఫ్రంట్’ రంగంలోకి దిగిపోతుంది. అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణపై నగరంతో పాటు దేశవ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్న యానిమల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్ (ఏఆర్‌పీఎఫ్)లో ఆటోడ్రైవర్లు మొదలుకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు.. విద్యార్థులు మొదలుకొని విశ్రాంత ఉద్యోగుల వరకు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఇందులో చేరడానికి, సభ్యత్వం పొందడానికి విద్యార్హతలు, హోదాల తో పనిలేదు. అవి అవసరం లేదు కూడా!. వుూగజీవాలను ప్రేమించగలిగే కాసింత మంచి మనసుంటే చాలు.. ఎవరైనా ఇందులో చేరవచ్చు. స్వచ్ఛందంగా సేవలందించవచ్చు.
గాయపడ్డ జంతువులకు ప్రాథమిక చికిత్స చేయుడం, అవసరమైతే పశువైద్యుల చేత చికిత్స చేరుుంచడం, జంతు ప్రదర్శనశాలల్లో ఆకతాయిల వేధింపుల నుంచి జంతువులకు రక్షణ కల్పించడం వంటి సేవలను ఏఆర్‌పీఎఫ్ అందిస్తోంది. వన్యప్రాణులను పరిరక్షించుకోవలసిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ 51వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఏఆర్‌పీఎఫ్ సభ్యులు జూపార్కులో ‘జూ డే రన్’ నిర్వహించారు. జూ పార్కు నుంచి చార్మినార్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై నగర వాసుల్లో అవగాహన పెంపొందించేందుకు విరివిగా కార్యక్రవూలు చేపడుతూ అనతికాలంలోనే దేశంలోని నలుమూలలకూ విస్తరించింది ఏఆర్‌పీఎఫ్.
ఇదీ నేపథ్యం..
నగరానికి చెందిన నీహార్ పరులేకర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ‘యానిమల్ రెస్క్యూ అండ్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను 2011 జనవరి 23న ప్రారంభించారు. సంస్థను ప్రారంభించినప్పుడు ఇందులో ఇరవై వుంది విద్యార్థులు మాత్రమే చేరారు. వేర్వేరు నేపథ్యాలు గల వీరంతా వన్యప్రాణి ప్రేమికులు. జంతు సంరక్షణ కోసం వీరు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆకట్టుకోవడంతో వివిధ వర్గాల వారు ఇందులో చేరడం ప్రారంభించారు. అదే ఏడాది మార్చి 31న ఈ సంస్థ ‘యానిమల్ రిహాబిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రంట్’గా ఆవిర్భవించింది. అనతి కాలంలోనే ఈ సంస్థ దేశంలో ఐదు శాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం ఏఆర్‌పీఎఫ్‌కు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ఇండోర్, భువనేశ్వర్, పుణేలలో శాఖలు ఉన్నాయి. త్వరలోనే బెంగళూరు, నాగపూర్‌లలోనూ శాఖలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలో దాదాపు మూడువేల వుంది సభ్యులు ఉన్నారు. సంస్థలో ఐదు విభాగాలను ఏర్పాటు చేసుకున్నారు.
జూ కాప్స్
ఈ విభాగంలోని సభ్యులు దేశంలోని జూపార్క్‌లను సందర్శిస్తూ, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తుంటారు. సందర్శకులకు జంతువుల తీరుతెన్నులు, వాటిని కాపాడుకోవాల్సిన వైనంపై వివరిస్తుంటారు.
ఎవేర్‌నెస్ టు యూక్షన్
ఇందులోని సభ్యులు పాఠశాలలను సందర్శిస్తుంటారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రవూలు నిర్వహిస్తారు. ట్రెక్కింగ్ కార్యక్రవూలను నిర్వహిస్తారు. ఫీల్డ్ వర్క్, గెడైడ్ టూర్స్ ద్వారా జంతు సంరక్షణ.. ఆవశ్యకతపై పాఠాలు బోధిస్తారు.
గ్రీన్స్ వారియర్స్
ఈ విభాగంలోని సభ్యులు పర్యావరణ యోధులు. ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గ్రీన్ వారియర్స్ ధ్యేయం.
ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్
వివిధ సందర్భాలలో గాయుపడిన జంతువులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తుంటుంది ఈ స్క్వాడ్. జంతువులు ఆపదలో చిక్కుకున్నాయని ఫోన్ వచ్చినా, సమాచారం అందినా చిటికెలో అక్కడకు ఇందులోని సభ్యులు చేరుకుని వైద్యసాయుం అందిస్తారు. పెంపుడు జంతువులైనా, అడవి జంతువులైనా.. ఎలాంటి వాటినైనా వుచ్చిక చేసుకోవడంలో వీరు సుశిక్షితులు. జనసంచార ప్రాంతాల్లోకి వచ్చే పాములు, ఇతర జంతువులను నేర్పుగా పట్టుకుని అడవుల్లో వదిలిపెడతారు. దీపావళి వంటి సందర్భాలలో శబ్ద కాలుష్యం ఇతరత్రా కారణాలతో గాయపడిన ప్రాణుల్ని చేరదీసి రక్షిస్తారు.
యూంటీ పోచింగ్ స్క్వాడ్
వన్యప్రాణుల వేటను నిరోధించడంలో అటవీ శాఖకు, వన్యప్రాణి సంరక్షణ శాఖకు ఈ విభాగం సహకరిస్తూ ఉంటుంది. ఈ టాస్క్‌ఫోర్స్ విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. పాములు, ఇతర ప్రాణుల్ని ఇబ్బందులకు గురిచేసే చర్యల నుంచి కాపాడుతారు. పక్షుల్ని నిర్బంధం నుంచి విడిపిస్తారు.
- శిరీష చల్లపల్లి