వ్యక్తిగతం: నిస్సంతతకు పస్ సెల్స్ కారణమా?
డాక్టర్! నా వయస్సు 26 ఏళ్లు. నా ఎడమవైపు వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంది. స్తంభించినప్పుడు పురుషాంగం కూడా కొంచెం ఎడమవైపునకే వంగినట్లుగా ఉంటుంది. వృషణం అలా జారివుండటంవల్లే ఇది కూడా అలా వంగినట్టు కనబడుతోందా? ఇదేమైనా సమస్యా? నేను పెళ్లికి అర్హుడనేనా?
- ఎం.డి.ఎస్., కడప
కుడివైపు వృషణంతో పోలిస్తే ఎడమవైపుది కొందరిలో కొంచెం కిందికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమాటకొస్తే చాలామందిలో వృషణాలు ఒకే లెవెల్‌లో ఉండకపోవడం అన్నది సర్వసాధారణమే! పురుషాంగం కూడా స్తంభించినప్పుడు ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా మామూలు విషయమే! పురుషాంగం అలా వంగినట్టు కనబడటానికీ, వృషణాల్లో హెచ్చుతగ్గులుండటానికీ ఏ సంబంధమూ లేదు. మీకు లైంగికోద్రేకాలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన మామూలుగానే ఉంటూ, వృషణాల్లో నొప్పిలాంటిది ఏమీ లేకపోతే మీకు ఏ సమస్యా లేనట్టే! మీరు నిశ్చింతగా పెళ్లిచేసుకోవచ్చు.
నాకు ఈ మధ్యనే పెళ్లయింది. వయసు 28. ఒకసారి సంభోగం అనంతరం వీర్యంలో కొద్దిగా రక్తం కనబడింది. దాంతో నాకు భయమేసింది. అయితే అంగస్తంభన మాత్రం మామూలుగానే ఉంది. దాంపత్య జీవితంలో కూడా ఏ ఇబ్బందీ లేదు. మరి నాకు ఉన్న సమస్య ఏమిటి? అది భవిష్యత్తులో మరేదైనా జబ్బుకు దారితీస్తుందా?
- కె.ఎ.కె., సూర్యాపేట
వీర్యంలో రక్తం రావడం అన్నది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, అక్కడ ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావడం పరిపాటి. పైగా ఇలా కనిపించడం చాలా సాధారణం. ఇది చాలా మందిలో జరిగేదే. కొన్నిసార్లు ఇలా జరగడానికి ఏ కారణమూ కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఒక్కోసారి దానంతటదే తగ్గిపోవచ్చు. చాలా సందర్భాల్లో పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది కాబట్టి ఆందోళన కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్టును కలిసి, ఏమైనా సాధారణ యాంటీబయాటిక్స్ తీసుకోవాలేమో చూసుకోండి. ఇది ఆందోళన పడాల్సినంత పెద్ద సమస్య కాదనే నమ్మకంతోనే డాక్టరును సంప్రదించండి.
నా వయుస్సు 38 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు దాటింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిస్తే, పరీక్షలు చేశారు. నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయట. పస్ సెల్స్ ఎక్కువుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? సలహా ఇవ్వగలరు.
- ఎస్.ఎం.కె., కొత్తగూడెం
చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహాపై సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, అప్పుడు గనుక వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి.
- డా. వి.చంద్రమోహన్,
యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ
- కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com