
చంద్రబింబం : నవంబర్ 17 నుండి నవంబర్ 23 వరకు
నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతిభను చాటుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతిభను చాటుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పలుకుబడి పెరుగుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సమస్యలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. ఒక కోర్టు కేసు నుంచి బయటపడవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
పనులలో అవరోధాలు అధిగమిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణయత్నాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యంతో విజయం. అనారోగ్యం. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయటా అనుకూలం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి,వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు. వారం చివరిలో వివాదాలు. ప్రయాణాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
బంధువర్గంతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో మీ నైపుణ్యం చాటుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. వారం చివరిలో ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు. విద్యార్థులకు శుభవార్తలు. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. ధనవ్యయం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులు నత్తనడకన సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరగవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. బంధువుల కలయిక.
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు, ప్రాజెక్టు పనులలో పురోగతి కనిపిస్తుంది. సన్మానాలు, పదవీయోగాలు కలుగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. శని ప్రభావం కారణంగా మధ్యమధ్యలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద అనుకూల ఫలితాలు పొందుతారు.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
సుస్మితా సేన్
పుట్టినరోజు: నవంబర్19