చోరాఫలి
కావలసినవి: శనగపిండి - 1 కప్పు, మినప్పప్పు - 1/3 కప్పు, బేకింగ్‌సోడా - చిటికెడు, నీళ్లు - పావు కప్పు, కారం పొడి - 2 చెంచాలు, నూనె - తగినంత, చాట్ మసాలా - 1 చెంచా, ఉప్పు - చిటికెడు
తయారీ: మినప్పపు్పును మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టౌ పై పెట్టాలి. వేడెక్కాక ఉప్పు, ఒక చెంచా నూనె వేయాలి. గోరువెచ్చగా అయ్యాక దించి పక్కన పెట్టాలి. ఓ గిన్నెలో శనగపిండి, మినప్పప్పు పొడి, సోడా తీసుకుని, గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. తర్వాత ఆ పిండితో చిన్న చిన్న చపాతీలు చేసి, వాటిని ఫొటోలో చూపినట్టు కట్ చేయాలి. ఆపైన వీటిని డీప్ ఫ్రై చేసుకో వాలి. చివరగా వాటిమీద ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లాలి. ఇది గుజరాతీ స్నాక్. దీపావళికి అయితే తప్పక చేసుకుంటారు.