
పోషకాలు ఎక్కడికీ పోవిక!
ఎక్కువగా ఉడికించినా, వేయించినా కాయగూరలు పోషకాలను కోల్పోతాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఆవిరి మీద ఉడికించిన ఆహారం బలవర్థకంగా ఉంటుందని చెబుతారు.
వాయనం
ఎక్కువగా ఉడికించినా, వేయించినా కాయగూరలు పోషకాలను కోల్పోతాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఆవిరి మీద ఉడికించిన ఆహారం బలవర్థకంగా ఉంటుందని చెబుతారు. అయితే అది ఆచరణలో కాస్త కష్టమైన పని. ఆ కష్టాన్ని తగ్గించడానికి వచ్చినవే ఈ స్టీమర్లు.
కుకింగ్ స్టీమర్లుగా పిలిచే ఈ యంత్రాలను పలు కంపెనీలు తయారు చేశాయి. ఆకారం, పరిమాణం, మోడల్‌ని బట్టి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. కాయగూరలు, మాంసం, గుడ్లు, మొక్కజొన్నలు... ఇలా వేటినైనా సరే, ఉడకబెట్టేసుకోవచ్చు. అరలు అరలుగా గిన్నెలు ఉండటం వల్ల ఒకేసారి రెండు మూడు రకాలు ఉడికించుకోవచ్చు. అంత అవసరం లేదనుకునేవారికి ఒకే గిన్నె ఉండేవి కూడా లభిస్తున్నాయి. ఉడికించాలనుకున్న వాటిని యంత్రానికున్న గిన్నెల్లో పెట్టి, కరెంటు కనెక్షన్ ఇచ్చి, స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఆవిరి విడుదలై చక్కగా ఉడికిపోతాయి.
ఎంత ఉడకాలి అన్నదాన్ని బట్టి హీట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అన్ని అరల్లోని వాటికీ ఒకే వేడి అవసరం లేదనుకుంటే, ఏ అరకు ఆ అర వేర్వేరుగా వేడిని సెట్ చేసే సదుపాయమూ ఉంటుంది. గిన్నెల్ని శుభ్రం చేసుకోవడమూ తేలికే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే దీన్ని ఇంట్లో ఉంచుకు తీరాల్సిందే!
(వివిధ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఉన్న ధరల్ని ఇచ్చాం. షాపుల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది)