
డిజిటల్ బాల్యం!
ఫేమస్ టూన్
ఒకప్పుడు... టీవీలు లేవు. సెల్‌ఫోన్‌లు లేవు. నెట్ కనెక్షన్ లేదు. ఫేసుబుక్కు లేదు. బోలెడంత తీరిక మాత్రం ఉంది. ఆ తీరిక తీరాలలో ‘బాల్యం’ వెన్నెల వెలుగులో వెండికొండలా వెలిగిపోయేది. ఆట, మాట, పాట... అన్నీ ఒక సామూహిక స్వరమయ్యాయి. ఈ సామూహిక ఆటలు, పాటలు చూడడానికి, వినడానికి వినోదప్రాయంగా కనిపించినా సారాంశంలో మాత్రం రేపటి పౌరులు నేర్చుకోవాల్సిన విలువలను నిశ్శబ్దంగా నేర్పాయి.
ఆ తరువాత... టీవీలు వచ్చాయి. టీవీలు కలర్ టీవీలయ్యాయి. రకరకాల చానెళ్లు ఠీవిగా దూసుకొచ్చాయి. పిల్లలకు తీరిక ఉంది కానీ ఆ తీరికంతా టీవీల ముందుకొచ్చేసింది. అప్పట్లా ఆటలు లేవు. పాటలు లేవు. అట్టే మాటలు లేవు. టీవీ నవ్వితే నవ్వడం. టీవీ ఏడిస్తే ఏడ్వడం. ఆ తరువాత కంప్యూటర్లు వచ్చాయి. ఇంటింటికీ వచ్చాయి. ఆ కంప్యూటర్లలోకి గేమ్స్ వచ్చాయి. అసలు సిసలు గేమ్స్‌కు బాల్యాన్ని దూరం చేశాయి. ఎవరికి వారు ఒంటరి దీవికి మాత్రమే పరిమితమయ్యేలా చేశాయి. అలాంటి డిజిటల్ బాల్యాన్ని వెనిజులా కార్టూనిస్ట్ రేమా ఎంత బాగా చెప్పారో చూడండి! - పాషా