పుష్కర పర్యాటకం
గంగ కంటే ప్రాచీనమైన గోదావరి నదికి జూలై 14 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పర్యాటకుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖలు, పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన ప్రాంతాల్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశాయి. పుష్కరాలకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల పర్యాటక శాఖలు, పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్లు అందిస్తున్న ప్రత్యేక ప్యాకేజీలు, వాటి వివరాలు...
తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్న గూడెం, ఆదిలాబాద్ జిల్లా బాసర , మంచిర్యాల, నిజామాబాద్ జిల్లా కందకుర్తి, ఖమ్మం జిల్లా భద్రాచలంలలో ఈ సమాచార కేంద్రాలు ఉన్నాయి. సమాచార కేంద్రంలోని ప్రతి కౌంటర్ వద్ద ఇద్దరు గైడ్‌లు, ఒక ఆఫీసర్, భద్రత కోసం ఇద్దరు పోలీసులు ఉంటారు. వారిని జిల్లా నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు.
ప్రతి సమాచార కేంద్రంలోనూ పర్యాటక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియో క్లిపింగ్స్ ప్రదర్శన నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే, ఈ సమాచార కేంద్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన టూరిజం ఫిల్మ్స్‌ను కూడా ప్రదర్శిస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ పుష్కర పర్యాటకుల కోసం ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబర్: 1800-425-46464.
టూర్ ప్యాకేజీలు...
హైదరాబాద్ నుంచి బాసర: బషీర్‌బాగ్‌లోని టూరిజం ఆఫీసు నుంచి ఉదయం 6.45 గంటలకు బస్సు బయలు దేరుతుంది. తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చార్జీలు: పెద్దలకు రూ. 700, పిల్లలకు రూ.560.
హైదరాబాద్ నుంచి కొండగట్టు, వేములవాడ మీదుగా ధర్మపురి: బషీర్‌బాగ్ టూరిజం ఆఫీసు నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. చార్జీలు: పెద్దలకు రూ. 700, పిల్లలకు రూ. 560.
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం: బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయం నుంచి రాత్రి 9.30 గంటలకు బయలుదేరి ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుంది. మళ్లీ ఉదయం 10 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
చార్జీలు: పెద్దలకు రూ.800, పిల్లలకు 640.
హైదరాబాద్ నుంచి భద్రాచలం: బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయం నుంచి రాత్రి 9.30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు ఎల్‌బీ నగర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుతుంది. సందర్శకుల పుష్కర స్నానాలు పూర్తయ్యాక పర్ణశాల చూపించి తిరుగు ప్రయాణం అవుతారు. మర్నాటి ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
నాన్ ఏసీ బస్సు చార్జీలు: పెద్దలకు రూ.1,200, పిల్లలకు రూ.960, ఏసీ బస్సు చార్జీలు పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120. ఫ్రెషప్ చార్జీలు: రూ.300.
వరంగల్ నుంచి కాళేశ్వరం: వరంగల్ జిల్లా హన్మకొండ హరిత కాకతీయ హోటల్ నుంచి ఉదయం 5 గంటలకు బస్సు బయలుదేరుతుంది. కాళేశ్వరానికి ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి హన్మకొండ చేరుకుంటారు. రెండో ట్రిప్పు హన్మకొండ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు హన్మకొండ చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.320.
కరీంనగర్ నుంచి కాళేశ్వరం: మొదటి ట్రిప్పు కరీంనగర్ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు కాళేశ్వరం వస్తారు. రెండోట్రిప్పు మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.320. రిజర్వేషన్ చేసుకోదలచిన వారు 9010009844 నంబర్‌ను సంప్రదించవచ్చు.
గమనిక: బషీర్‌బాగ్ టూరిజం ఆఫీస్ నుంచి బయలు దేరే బస్సులు 20 నిమిషాల వ్యవధిలో సికింద్రాబాద్ యాత్రీ నివాస్ చేరుకుని అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు: హైదరాబాద్ సెంట్రల్ రిజర్వేషన్స్
కార్యాలయాలు: 9848540371, 9848306435, సికింద్రాబాద్ యాత్రీనివాస్: 040-27893100, 9848126947, వరంగల్: 0870-2562236, టోల్‌ఫ్రీ నంబర్ 1800 42546464
ఆంధ్రప్రదేశ్‌లో టూర్ ప్యాకేజీలు
విజయవాడ నుంచి...
విజయవాడ నుంచి రాజమండ్రి: విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకుని, యాత్రికుల పుష్కర స్నానాలు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ర్యాలిలోని శ్రీజగన్మోహినీ కేశవ, గోపాలస్వామి ఆలయం, అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి విజయవాడ చేరుకుంటారు. ఈ ఒకరోజు యాత్రకు
చార్జీలు: పెద్దలకు రూ. 750, పిల్లలకు రూ.650
విజయవాడ నుంచి రాజమండ్రి: రాజమండ్రిలో పుష్కరస్నానాల తర్వాత అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వరస్వామి ఆలయాలను సందర్శించిన తర్వాత విజయవాడ చేరుకుంటారు. ఈ ఒకరోజు యాత్రకు
చార్జీలు: పెద్దలకు రూ.750, పిల్లలకు రూ. 650
విజయవాడ నుంచి రాజమండ్రి: రాజమండ్రిలో పుష్కర స్నానాలు పూర్తయ్యాక గురవాయిగూడెంలోని శ్రీ మద్ది అంజనేయస్వామి ఆలయం, ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించిన తర్వాత విజయవాడ చేరుకుంటారు. ఈ ఒకరోజు యాత్రకు పెద్దలకు రూ. 600, పిల్లలకు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
విజయవాడ నుంచి రాజమండ్రి: పెద్దలకు రూ.600, పిల్లలకు 500.
మరిన్ని వివరాలకు విజయవాడ టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం: 08662571393, 9848007025లో సంప్రదించవచ్చు.
విశాఖపట్నం నుంచి...
విశాఖపట్నం నుంచి రాజమండ్రి: రాజమండ్రిలో పుష్కరస్నానాల తర్వాత తిరుగు ప్రయాణంలో సామర్లకోటలోని శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయాలను సందర్శించాక విశాఖ చేరుకుంటారు. ఈ ఒకరోజు యాత్రకు.
చార్జీలు: పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.550.
విశాఖ నుంచి రాజమండ్రి: రాజమండ్రిలోని పుష్కరస్నానాల తర్వాత అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవాలయం, లోవలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం సందర్శించుకుని, విశాఖ చేరుకుంటారు. ఈ ఒకరోజు యాత్రకు
చార్జీలు: పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.550.
విశాఖ నుంచి రాజమండ్రి: పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.500.
మరిన్ని వివరాలకు: సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం 9848813584, 0891-2788820
రాజమండ్రి నుంచి...
రాజమండ్రి నుంచి అన్నవరం: అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాల సందర్శన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ. 275, పిల్లలకు రూ. 225.
రాజమండ్రి నుంచి ద్రాక్షారామం: ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి, కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయాల సందర్శన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ. 300, పిల్లలకు రూ. 250.
రాజమండ్రి నుంచి పాలకొల్లు: పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి, సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాల సందర్శన తర్వాత పిఠాపురం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ. 450, పిల్లలకు రూ. 360.
రాజమండ్రి నుంచి ద్రాక్షారామం: ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్, కోటిపల్లి వయా యానం మీదుగా శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయాల సందర్శన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ.350, పిల్లలకు రూ. 280.
రాజమండ్రి నుంచి ర్యాలి: ర్యాలిలోని శ్రీ జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి ఆలయం, మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల సందర్శన తర్వాత రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ. 380, పిల్లలకు రూ. 300
రాజమండ్రి నుంచి సామర్లకోట: సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి, పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాల సందర్శన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకుంటారు.
చార్జీలు: పెద్దలకు రూ. 450, పిల్లలకు రూ. 360
రాజమండ్రి టూ ర్యాలీ టూర్.
మరిన్ని వివరాలకు: సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం 0891-2788820, 98488135584, 9666663498, 9848629341, 9010744405, 9951968200