బరువు తగ్గుదాం brand new అయిపోదాం! | new year special 'brand' | Sakshi
Sakshi News home page

బరువు తగ్గుదాం brand new అయిపోదాం!

Published Sun, Dec 29 2013 12:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

బరువు తగ్గుదాం brand new అయిపోదాం! - Sakshi

బరువు తగ్గుదాం brand new అయిపోదాం!

భాషణం
 మూడ్రోజుల్లో New Year! తర్వాతి రోజు New Year's Day. దానికి ముందు రోజు New Year's Eve. ‘న్యూ ఇయర్’ అంటే కొత్త సంవత్సరం. ‘న్యూ ఇయర్స్ డే’ అంటే జనవరి ఫస్ట్. ‘న్యూ ఇయర్స్ ఈవ్’ అంటే the last day of the year. అంటే డిసెంబర్ 31.
 
 సందర్భం వచ్చింది కాబట్టి ఈవారం New అనే మాట గురించి చూద్దాం. ఈ ఏడాదికిదే చిట్ట చివరి ఫన్ డే కాబట్టి ఉఛీ గురించి కూడా మాట్లాడుకోవచ్చు కానీ, ముగింపు కన్నా ప్రారంభమే కదా ఆసక్తిగా ఉండేది.
 ముందు Hogmanay (హాగ్‌మెనీ అని పలకాలి)తో మొదలు పెడదాం. ప్రధానంగా ఇది బ్రిటన్‌వారి మాట. స్కాట్లాండ్‌లో ఏడాది చివరి రోజును హాగ్‌మెనీ అంటారు. ఆ రోజు సాయంత్రం మొదలై, రెండో రోజు వరకు సాగే న్యూ ఇయర్ పార్టీలు కూడా హాగ్‌మెనీలో భాగమే. అమెరికాలో, మిగతా దేశాల్లో ఈ తతంగానికంతా  New Year's Eve అని పేరు. CMS New Year('s) resolution అంటే తెలిసిందే. కొత్త సంవత్సరపు తీర్మానాలు. అనారోగ్యమైన అలవాట్లు ఉంటే వాటిని మానేయాలని, కొత్త లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించాలని నిశ్చయించుకోవడమే resolution.
 ఇప్పుడు New Year నుంచి బయటికి వచ్చి, New తో వచ్చే మాటల్లోకి వెళ్దాం.
 
 Brand new అంటే పూర్తిగా కొత్తది అని. ఒక్కసారైనా వాడనిదని. షోరూమ్‌లోంచి తెచ్చిన పీస్ అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్ న్యూ వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. సాదాసీదా వేతన జీవులు వాటిని భరించలేరు. ఒకవేళ ఎవరైనా అలాంటివి వాడుతూ కనిపిస్తే ఆశ్చర్యపోతాం. ఇంగ్లీషులో ఆశ్చర్యపోవడం ఎలా ఉంటుందో చూడండి. How can he afford to buy himself a brand new car?! ఇలాంటిదే Brave new అనే మాట. అయితే brand newS కి , brave new కి చిన్న తేడా ఉంది. కొత్తదే అయినప్పటికీ అది  మంచిదో కాదో అనే సందేహం కనుక ఉంటే దానిని brave new అంటారు. (They introduced customers to the brave new world of telephone banking).
 
 ఈ ఏడాది చివరిలో broom అనే మాట బాగా వాడుకలోకి వచ్చింది. ఆ room అంటే చీపురు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ గుర్తు చీపురు. ఇకనేం, ఓట్లను ఊడ్చేసిందనీ, రాజకీయాల్లోని మాలిన్యాన్ని శుభ్రం చేయబోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీడియా విస్తృతంగా రాసింది.  సారాంశం ఏమిటంటే ఢిల్లీ ప్రజలకు ఒక New broom దొరికిందని.
 ఎవరైనా ఒక సంస్థలో కొత్తగా చేరి, సమూల మార్పులు చేసేందుకు చొరవ, ఉత్సాహం చూపుతుంటే ఆ వ్యక్తిని new broom అంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి మొదటికే మోసం రావచ్చు. ఈ వాక్యం చూడండి. The new broom was supposed to improve the way the department is managed, but things have been worse than ever since he arrived. అలాగే ఇంగ్లిష్‌లో A new broom sweeps clean అని ఓ సామెత. కొత్తగా పదవిని చేపట్టిన వ్యక్తి...మార్పులకు శ్రీకారం చుడితే ఆ వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెత చెబుతారు.
 
 ఇక turn over a new leaf అంటే పరివర్తన చెందడం. పాత అలవాట్లు మానుకోవడం. కొత్త జీవితాన్ని ప్రారంభించడం. the new rock 'n' roll అంటే ఒక వ్యక్తిగానీ, కార్యక్రమం గానీ  పాపులర్ అవడం. అంతా దాని గురించే మాట్లాడుకోవడం. ఈ ఏడాది ప్రారంభంలో ‘గంగ్నమ్ డాన్స్'  new rock 'n' ro అయిన  సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. That-'s a new one on me అంటే ‘అరే! నాకు తెలియదే’ అని ఆశ్చర్యపోవడం.
 "Deepa and Ajay are getting married".
 "Really! That's a new one on me!".
 
 see in the New Year
 
 ‘అర్థరాత్రి వరకు మేల్కొని ఉండి, కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలను జరుపుకోవడం’ అని ఈ ఫ్రేజ్‌కు అర్థం. (to not go to bed on 31 December until after 12 'o' clock at night in order to celebrate the start of a new year).
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement