సముద్ర రామచిలకలు
ప్లే టైమ్
‘సీ ప్యారెట్స్’గా పేరు పొందిన పఫిన్స్ జీవనశైలి ఉభయచర జీవుల్లా ఉంటుంది. ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతంలో కనిపించే పక్షిజాతి ఇది. చేపలను, నీటిలో ఉండే ఇతర చిన్న చిన్న జీవులను పట్టుకొని తింటూ మనుగడ సాగిస్తాయివి. వీటి ఊపిరితిత్తుల వ్యవస్థ నీటిలోనైనా, ఉపరితలంపైనైనా శ్వాస తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ పక్షి ఒక నిమిషంలో నాలుగువందల సార్లు రెక్కలు ఆడించగలదు.
గంటకు 55 మైళ్ల వేగంతో గాలిలో రివ్వున దూసుకెళ్లగలదు. నీటిలోకి డైవ్‌చేయడం వీటికి బాగా ఇష్టం. ఒక నిమిషం పాటు నీటిలోనే మునిగి చేపల వేట సాగించగలవు. వీటిది గుంపుగా నివసించే జీవనశైలి. ఇవి ఉండే ప్రాంతాన్ని ‘కాలనీ’లుగా వ్యవహరిస్తారు. రంగు విషయంలో పెంగ్విన్లను పోలి ఉండే పఫిన్స్‌కు ఆ జాతితో ఎలాంటి సంబంధమూ ఉండదు. వీటిని ‘క్లాన్స్ ఆఫ్ ది సీ’ అని కూడా అంటారు. ఈ పక్షి పేరు మీదుగా వెబ్‌బ్రౌజర్ కూడా ఉంది. వేగానికి ప్రతీకగా ఆ బ్రౌజర్‌కు దీని పేరు పెట్టారు.