సీతన్న ‘కిస్సులు’ | Sitanna 'kissulu' | Sakshi
Sakshi News home page

సీతన్న ‘కిస్సులు’

Published Sun, Jan 25 2015 1:10 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

సీతన్న ‘కిస్సులు’ - Sakshi

సీతన్న ‘కిస్సులు’

కామెడీ క్లాస్: వేణు మాధవ్
ప్రపంచంలో ఎవడైనా ఇంటర్ రెండేళ్లు  జదువుతడు, డిగ్రీ మూడేళ్లు జదువుతడు. కానీ నేను స్పెషల్‌గదా... టెన్తు గూడా రెండేళ్లు జదివిన. ఫ్రెండ్సుతోటి తిరుగుడే తిరుగుడు... అదీ కథ! టెన్తు కోదాడలోనే చదివిన. చైతన్యకుమార్ సార్ అని వుండె. ‘‘నువ్వు చదువొద్దు, హాఫ్ అన్ అవర్ అట్ల క్లాసులో గూర్చోరా’’ అనేటోడు. కదలకుండా కూర్చుంటేనైనా రెండు ఒక్కట్లు రెండు, రెండు నాళ్లు ఐదు అని చెప్పచ్చని చూసేటోడు. మనకు ఐదు నిమిషాలు సీటు నిలుస్తదా!
 
అట్లనో ఇట్లనో టెన్తు పాసై, ఇంటర్లో చేరితి. ‘కెఆర్‌ఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ’. కెఆర్‌ఆర్ అంటే కొండపల్లి రాఘవమ్మ, రంగారావు. అది బాలాజీనగర్ తండాలో ఉండేది. కాలేజీలో ఏమన్న సక్కగయిన్నా... ఆడపిల్లల్ని ఏడిపిచ్చుడు, జడలు ముడేసుడు... చేరిన వారంలనే నా మీద పదమూడు కంప్లెయింట్స్! అక్కడ్నే మా సీనియర్ ఒకాయినుండె. తారా సీతయ్య... మాకు బాగా కావాల్సినోడే...  సీతన్నా సీతన్నా అని పిలిచేది.. కొద్దిగ మావాని మంచిచెడ్డలు జూసుకొమ్మని మా అమ్మ చెప్పినట్టుంది... ఒకరోజు కాలేజీ అయిపోయినంక ఇంటికొస్తుంటే నా ఎనుకే వచ్చిండు. దగ్గర్ల ఒక రైసుమిల్లు ఉంటది...  ఎనుకకు తీసుకపోయిండు... కిస్సులే కిస్సులు... ఇంకోమో అనుకునేరు, విపరీతమైన కొట్టుడు! మళ్లీ ఆడపిల్లల జోలికి పోలేదు!
 
రైళ్లు ధడ ధడ ధడ
పూరీ జగన్నాథ్ ‘నేనింతే’ తీస్తున్నడని నాకు తెల్సింది. అది సినిమా బేస్డ్ సినిమా. జగనన్నకు ఫోన్ చేసిన. ‘‘అన్నా, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, చెప్త...’’ అంటే, ‘‘ఓకే’’ అన్నడు. అప్పుడు నేను వేరే షూటింగులుంటి. ఫోన్లనే ఆయనకు ఆ కథ చెప్పిన. ‘‘సూపర్ ఉంది వేణు’’ అన్నడు.

తమిళ్ డెరైక్టర్స్‌కు ఎట్ల ప్రిఫరెన్స్ ఇస్తరు మనవాళ్లు! అందుకే బ్రహ్మానందం నాకు అసిస్టెంట్ ఛాన్స్ ఇవ్వడు... కట్ చేస్తే-
 రవితేజ దగ్గరికి వెళ్త. అప్పుడాయన హోటల్లో కూర్చుంటడు. ‘‘చాయ్ చెప్పన్నా, కథ జెప్త’’ అంటా. వచ్చిన చాయ్ తాక్కుంట, కథ మొదలుపెడుత.
 ‘‘హీరోకు ఎయిడ్సు, హీరోయిన్‌కు ఎయిడ్సు... ఇద్దరు లవ్‌లో పడ్డరు...’’
 ‘‘క్లైమాక్సులైన తగ్గుద్దా’’ అంటాడు రవితేజ,  ‘సంకనాకిపోద్దని’. ‘‘ఇదే సినిమాను గీతాంజలి అని పేరుపెట్టి మణిరత్నం తీస్తే మీరంతా హిట్ చేసిన్రు గదా’’ అని నేనంటే అందరూ నవ్వి నన్ను ఎంకరేజ్ చేస్తరు.
 
కట్ చేస్తే- ఒక హీరో(సుబ్బరాజు) దగ్గరికి వెళ్త. వెళ్లేముందు సిగరెట్ నుషితో బొట్టు పెట్టుకుంట. పేరు కూడా సెంథిల్ అని మార్చుకుంట. సెట్లోకి వెళ్లగానే, ‘‘సెంథిల్ అంటే మీరేనా?’’ అని హీరో అడుగుతడు. ‘‘నాన్ దా’’(నేనే) అంట.
 కుర్చీల్లో కూర్చుంటం. హీరో సెల్ ఆఫ్ చేయిస్త. ‘‘పవన్‌కళ్యాన్, ఎన్టీయార్ ఎల్లామ్ అడిగారు... నాన్ నోస్ అన్నా...’’ అని బిల్డప్పు ఇచ్చి, కథ మొదలుపెడుత.
 
కన్నులెందు ఒరు జూమ్ బ్యాక్ వన్ దా ఫస్ట్ షాట్ (కంట్లో నుంచి జూమ్ బ్యాక్ చేస్తే ఫస్ట్ షాట్)... హీరో సెప్పుకుట్టువాడి మాదిరి... బాబు సైకిల్ మీద వరువార్ వరువార్ (సైకిల్ మీద వస్తుంటాడు)... పాతిక రైళ్లు గాల్లో ధడ ధడ ధడ, అది దా హీరో ఇంట్రడక్షన్...
 ‘బాబు సైకిల్ మీదా?’ అని అడుగుతాడు పక్కనున్న హీరో అసిస్టెంట్.
 ‘ఓ మీ ఇమేజ్ కదా... బెంజ్ కారులో వరువార్ వరువార్’... అని వెటకారం చేస్త. హీరోయిన్ ఎవరు? త్రిషతో ఆల్రెడీ సినిమా చేశానంటాడు హీరో. ఇలియానాతో కూడా ఈమధ్యే అయిపోయిందంటాడు. దీపికా పడుకోనే పేరు చెబుతాడు. ‘పడుకోనే’కు దీర్ఘం తీసి- మళ్లీ స్టోరీ షురు... హీరోయిన్ కోవెలలో నడుచుకుంటూ వస్తుంటే దేవత మాదిరి ఇరుప్పా... అటు హీరో

ఇటు హీరోయిన్... కట్ పన్నా (కట్ చేస్తే)...  తీన్‌మార్ మాదిరి ఒరు సాంగ్... ఎలాంగే ఎలాంగే... సింగపూర్లో పల్లవి... ఒరు చరణం వందు అమెరికా(ఒక చరణం అమెరికాలో)... ఇన్నొరు చరణం వందు హైద్రాబాద్‌లో సముద్రం సెట్టు...
 హైద్రాబాద్‌లో సముద్రం అనగానే, ‘‘నువ్వెక్కడినుంచి వచ్చినవ్‌రా’’ అంటడు.
 ‘‘మణిరత్నం, శంకర్, ఎస్ జె సూర్య ఎల్లారుమ్ నా రూమ్‌మేట్స్’’ అని చెప్త. వీళ్లు నీ రూమ్‌మేట్సారా అని యమకొట్టుడు కొడుతడు! ఇదీ నా స్టోరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement