
ఫొటోలో వేలెడంత కూడా లేని ఈ రెక్కల కీటకం నిజానికి కీటకం కాదు. ఇది రోబో ఈగ. మామూలు ఈగల్లాగానే ఇది రెక్కలాడిస్తూ గాల్లో ఎగరగలదు. నేల మీద నడవగలదు. నీటి ఉపరితలంపై నుంచి కూడా పాకుతూ తన ప్రయాణాన్ని సాగించగలదు. ప్రధానంగా కార్బన్ ఫైబర్, అతి కొద్దిగా ప్లాస్టిక్‌తో దీని తయారీ జరిగింది. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక బృహత్తర ప్రయోజనం కోసం దీనికి రూపకల్పన చేశారు. దీని బరువు 78 మిల్లీగ్రాములు మాత్రమే. వృక్షజాతుల పరపరాగ సంపర్కానికి కీలకమైన కీటక జాతులు తగ్గిపోతూ ఉండటంతో ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ రోబో ఈగను తయారు చేశారు. వృక్షజాతుల అభివృద్ధి అవసరమైన చోట ఈ రోబో ఈగలను వదిలి పరపరాగ సంపర్కం జరిగేలా చూస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment