సూపర్ సింగర్స్... నిజంగా సూపర్! | Super singers special is a Real Super | Sakshi
Sakshi News home page

సూపర్ సింగర్స్... నిజంగా సూపర్!

Published Sun, Oct 19 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

సూపర్ సింగర్స్... నిజంగా సూపర్!

సూపర్ సింగర్స్... నిజంగా సూపర్!

తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే పాటల పోటీల్లో ‘పాడుతా తీయగా’ తర్వాత అంత ఫేమస్ అయిన షో సూపర్ సింగర్స్. ఇప్పటికి ఏడు సిరీస్‌లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఎనిమిదో సిరీస్ కూడా మొదలైంది. ఎప్పటిలాగే తిరుగులేని టీఆర్పీతో నిరాటంకంగా సాగిపోతోంది.
 
 అయితే ఈసారి సూపర్ సింగర్స్ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే... ఏడు సిరీస్‌ల వరకూ ఎప్పుడూ కనిపించిన గాయనీ గాయకులే కనిపించేవారు. చంద్రబోస్, కోటి, సునీత తదితరులే న్యాయ నిర్ణేతల స్థానంలో కొనసాగుతూ ఉండేవారు. కానీ ఈసారి కంటెస్టెంట్లు మారారు. న్యాయ నిర్ణేతలూ మారారు. దాంతో కొత్త కొత్త గాయనీ గాయకుల గానమాధుర్యం ప్రేక్షకులను అలరిస్తోంది. కీరవాణి, చిత్రలు న్యాయ నిర్ణేతలు కావడం షోకి మరింత ఆకర్షణ ను చేకూర్చింది. చిత్రలోని సౌమ్యత, కీరవాణి నిష్కర్షగా అభిప్రాయాలను వెల్లడించే విధానం ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈసారి సూపర్ సింగర్స్ స్పెషల్‌గా ఉందనడంలో సందేహం లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement