Telugu channels
-
పిల్లల ఛానల్ పోగో ఇప్పుడు తెలుగు భాషలో..
పలు కార్టూన్స్‌తో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోన్న ప్రముఖ టీవీ ఛానల్ పోగో ఇప్పుడు తెలుగులో రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని విస్తరించుకోవాలనే లక్ష్యంతో పోగో తెలుగు ఛానల్‌ను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 100 శాతం స్వదేశీ యానిమేషన్ ఫీడ్‌తో తెలుగు రాష్ట్రాల్లోని వీక్షకులకు పోగో మరింత దగ్గర కానుంది. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో పోగో తన సేవలను ప్రారంభించింది. కామెడీ సిరీస్‌లోని ఒకటైన టీటూ-హర్ జవాబ్ కా సవాల్ హు, స్మాషింగ్ సింబా, చోటా భీమ్ లాంటి కార్టూన్ షోలు ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణను పొందాయి. తెలుగు పోగో ఛానల్ ఆవిష్కరణ సందర్భంగా కార్టూన్ నెట్వర్క్ అండ్ పోగో దక్షిణాసియా నెట్వర్క్ హెడ్ మాట్లాడుతూ...స్ధానిక భాషలో కంటెంట్‌ను అందిస్తామనే విషయంలో పోగో తెలుగు ఛానల్‌తో కంపెనీ ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచస్ధాయి కంటెంట్‌ను, యానిమేషన్లను, కథలను ఎక్కువ సంఖ్యలో భారతీయ ప్రేక్షకులకు అందించే అవకాశం వస్తోందని అభిప్రాయపడ్డారు. చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..! -
తెలుగు వారమండీ!
చిన్న నుంచి పెద్ద దాకా ఫేస్‌బుక్‌ను ఎడాపెడా ఉపయోగిస్తుండడాన్ని చూసిన సీనియర్ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు బుర్రలో ఓ చక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది. అదేమిటంటే, తెలుగును ఇష్టపడే వారందరికీ ఆ మధురిమను రుచి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటే ఎలా ఉంటుంది?’ అని. తనకు వచ్చిన ఈ ఆలోచనను వెంటనే అమలు చేసేశారు. అందులో భాగమే యూ ట్యూబ్‌లో తనకున్న వీఆర్ తెలుగు ఛానల్ ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరిట ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. దీనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో చిత్తశుద్ధితో తనకు ఎన్ని పనులున్నా పక్కనపెట్టేసి, ఆ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తూ, ఓ యజ్ఞంలా నిర్వర్తిస్తున్నారు. అలా గత ఏడాది మార్చి 17 నుంచి ఇప్పటి వరకు అంటే 54 వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తెలుగును ఇష్టపడే వారిలో చాలామందిని తన వీఆర్ తెలుగు ఛానల్‌కు వీక్షకులుగా చేసుకోగలిగారు. ఎంతోమంది తెలుగు భాషాభిమానులను, పెద్దలను, యువతను ఇందులో భాగస్వాముల్ని చేశారు. అది ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే...‘‘తెలుగు మాట ప్రతీ ఇంటా మార్మోగాలనే సదుద్దేశంతో దీన్ని నేను ప్రారంభించాను. ఇల్లే వేదికగా నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞం ఇంత చక్కగా సాగడానికి కారణం తెలుగు భాషాభిమానులు ఇస్తున్న ప్రోత్సాహం. నాకు సలహాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు, తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు. ఇంటివద్ద సహకరిస్తున్న నా సతీమణి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలకు కృతజ్ఞతలు. ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి బేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు, ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 25 మంది ప్రముఖులు ఇంటివద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరో 25 మంది శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 90 కి పైగా వేమన పద్యాలు, 50 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 50 సామెతలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు మీముందు ఉంచాను. ఇవి కూడా ముమ్మరంగా షేర్ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూశారు. దీనికి అనుబంధంగా యూ ట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్ తెలుగు చానల్’ ద్వారా 10 వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు, దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..’’ తెలుగు హారంలో పరిమళించిన కొన్ని పుష్పాలు... రత్నాల నరసింహమూర్తి (సీనియర్ జర్నలిస్టు), వర్థనపు సుధాకర్( డీడీ ఖజానా శాఖ, విశాఖ), పి. లక్ష్మణ్ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మహబూబ్ నగర్); పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), ఆర్. మధుసూదన రావు(కథకుడు, సినీగేయ రచయిత); బాబూచారి (గాయకుడు), మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్); కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు), డా. వకుళాభరణం కృష్ణమోహన్ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ సభ్యుడు, సాహితీ వేత్త)లు అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. ఫోన్ ద్వారా ముచ్చటించిన వారు... సన్నశెట్టి రాజశేఖర్ (సంపాదకులు, ఉత్తరాంధ్ర పత్రిక, శ్రీకాకుళం), 2. భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం; శ్యామసుందర శాస్త్రి, (రేడియో వ్యాఖ్యాత, అనంతపురం) ఈశ్వర రెడ్డి (ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప), మహ్మద్ మియా (గజల్ గాయకుడు, కర్నూలు), నందిగం శివప్రసాద్ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్); జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), శ్యామ్ ప్రసాద్ లాల్ (జేసీ, కరీంనగర్), ఎం. హరికిషన్ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు) తెలుగు హారం కార్యక్రమ లక్ష్యాలుప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి; తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం, సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం, మన మాతృభాష కొన్ని వందల తరాలకు అందేలా తెలుగు కుటుంబాలు కృషి చేసేందుకు ప్రేరణ కలిగించడం -
వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు
హైదరాబాద్: దేశీ ప్రముఖ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ ‘వీడియోకాన్ డీ2హెచ్’ తాజాగా తన తెలుగు ప్లాట్‌ఫామ్‌కు మరో మూడు కొత్త చానళ్లను జతచేసింది. కొత్తగా ఈటీవీ సినిమా, ఈటీవీ తెలంగాణ, డీడీ యాదగిరి అనే తెలుగు చానళ్లను ప్రసారం చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈటీవీ సినిమా అనే తెలుగు మూవీ చానల్ 716 నెంబర్లో, తెలంగాణ రాష్ట్ర దూరదర్శన్‌కు సంబంధించిన డీడీ యాదగిరి అనే చానల్ 745 నె ంబర్‌లో, ఈటీవీ తెలంగాణ అనే న్యూస్ చానల్ 734 నెంబర్లో వస్తాయని పేర్కొంది. దీంతో వీడియోకాన్ మొత్తంగా 43 తెలుగు చానళ్లను ప్రసారం చేస్తోంది. కొత్త చానళ్లతో తమ మార్కెట్ మరింత పెరుగుతుందని సంస్థ సీఈవో అనిల్ ఖెరా అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి తమ చర్య దోహదపడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సౌరభ్ దత్ తెలిపారు. -
సూపర్ సింగర్స్... నిజంగా సూపర్!
తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే పాటల పోటీల్లో ‘పాడుతా తీయగా’ తర్వాత అంత ఫేమస్ అయిన షో సూపర్ సింగర్స్. ఇప్పటికి ఏడు సిరీస్‌లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఎనిమిదో సిరీస్ కూడా మొదలైంది. ఎప్పటిలాగే తిరుగులేని టీఆర్పీతో నిరాటంకంగా సాగిపోతోంది. అయితే ఈసారి సూపర్ సింగర్స్ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే... ఏడు సిరీస్‌ల వరకూ ఎప్పుడూ కనిపించిన గాయనీ గాయకులే కనిపించేవారు. చంద్రబోస్, కోటి, సునీత తదితరులే న్యాయ నిర్ణేతల స్థానంలో కొనసాగుతూ ఉండేవారు. కానీ ఈసారి కంటెస్టెంట్లు మారారు. న్యాయ నిర్ణేతలూ మారారు. దాంతో కొత్త కొత్త గాయనీ గాయకుల గానమాధుర్యం ప్రేక్షకులను అలరిస్తోంది. కీరవాణి, చిత్రలు న్యాయ నిర్ణేతలు కావడం షోకి మరింత ఆకర్షణ ను చేకూర్చింది. చిత్రలోని సౌమ్యత, కీరవాణి నిష్కర్షగా అభిప్రాయాలను వెల్లడించే విధానం ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈసారి సూపర్ సింగర్స్ స్పెషల్‌గా ఉందనడంలో సందేహం లేదు! -
క్లబ్బులో కామెడీ కరువవుతోంది!
టీవీక్షణం కొంతమంది పాపులర్ నటీనటుల్ని ఒక్కచోట చేర్చడం, వారితో స్కిట్లు వేయించి ప్రేక్షకుల పెదాల మీద నవ్వుల్ని పూయించడం అన్ని చానెళ్లూ చేసేదే. హిందీలో ఇలాంటి కార్యక్రమాలు విరివి అయిపోయిన తర్వాత తెలుగు చానెళ్లు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఆ క్రమంలో జీ తెలుగులో మొదలైనదే ‘కామెడీ క్లబ్’. సీనియర్ టీవీ, సినీ కళాకారులు కొందరు ఒకచోట చేరి చలోక్తులతోటీ, తమ హావభావాలతోటీ ప్రేక్షకులను నవ్వించేందుకు చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం. మొదట్లో చక్కగా సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు కాస్త డల్ అయినట్టుగా అనిపిస్తోంది. సుమ, ఝాన్సీ, ప్రీతీనిగమ్, హేమ, హరిత, శ్రీరామ్, కృష్ణకౌశిక్ లాంటి సీనియర్ నటీనటులు బోలెడంతమంది పాల్గొంటున్నా పస లేని స్క్రిప్ట్, పాత వాసన వేసే జోక్స్ కాస్త బోరు కొట్టిస్తున్నాయీ మధ్య. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ తన టాలెంట్‌తో నెట్టుకొస్తున్నాడేమో అనిపించక మానదు ప్రోగ్రామ్ చూస్తే. అలాగని మరీ తీసి పారేయాల్సిన షో కూడా కాదు. ఇప్పుడే జాగ్రత్తపడి కాస్త క్వాలిటీని పెంచితే కచ్చితంగా నిలబడే కార్యక్రమం ఇది! -
మనవాళ్లూ రిస్క్ చేస్తున్నారు!
తెలుగు చానెళ్లలో ఇప్పటి వరకూ బోలెడన్ని గేమ్ షోలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడూ వినోదాత్మకంగానే ఉండేవి తప్ప సాహసోపేతంగా ఉండేవి కాదు. సరదా సరదా ఆటలు, చిన్న చిన్న పోటీలు మాత్రమే ఉండేవి తప్ప హిందీ, ఇంగ్లిషు షోలలో మాదిరిగా రిస్కీగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనవాళ్లు కూడా రిస్క్ తీసుకోవడం మొదలుపెడుతున్నారు. మన వీక్షకులు ఈ మధ్య ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకే ఖిలాడీ లాంటి అడ్వెంచరస్, డేంజరస్ ఎంటర్టైన్మెంట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తెలుగు చానెళ్ల నిర్వాహకులు వాటికి ముహూర్తం పెట్టారు. ఇప్పటికే ఖత్రోంకే ఖిలాడీ షోని ‘సాహస వీరులు’గా జెమినీ చానెల్ వారు డబ్ చేసి ప్రసారం చేస్తున్నారు. జీ తెలుగు వాళ్లయితే ‘వన్’ అనే వెరైటీ షోకి తెర తీశారు. చీకటి గదిలో రకరకాల జీవుల్ని పట్టుకుని గుర్తించడం, నీటి తొట్లలో అడుగున ఉన్న వస్తువుల్ని సేకరించడం వంటి రిస్కీ రౌండ్లు ఉన్నాయి ఈ షోలో. ఉత్కంఠభరితంగా ఉండటంతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ముందు ముందు అన్ని చానెళ్లవారూ ఇలాంటి షోలు మొదలు పెడతారేమో చూడాలి! -
కోటీశ్వరుడి విజయ విహారం
‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’.... అని నాగార్జున అడగ్గానే... ‘ఇంకెవరూ మీరే..’ అని టకీమని చెప్పారు విద్యాబాలన్. నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోలో విద్యాబాలన్ అతిథిగా పాల్గొన్న విషయం ఈ షో వీక్షించినవారికి తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో నాగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి. అడపా దడపా సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడం అదనపు ఆకర్షణ అవుతోంది. గత నెల 9న ప్రారంభమైన ఈ షో తెలుగు చానల్స్ అన్నిటిలోనూ అత్యధిక రేటింగ్ సాధించి, నంబర్ వన్ షోగా నిలిచిందని ‘మా’ టీవీ ప్రతినిధి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ను కూడా కలుపుకుని 1.22 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. గత వారం తెలుగు బుల్లి తెరపై ఐదు టాప్ ప్రోగ్రామ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఉందని తెలిపారు. -
టీవీక్షణం: వాళ్లకు ప్రమాదం... మనకు వినోదం
సాహసాలు చేసేవాళ్లకి కష్టమేమో గానీ... చూసేవాళ్లకి మహా సరదాగా ఉంటుంది. ఈ విషయం తెలుసు కనుకనే టీవీ చానెళ్లు సాహసోపేత కార్యక్రమాలకు తెర తీశాయి. మన తెలుగు చానెళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కానీ... ఆంగ్ల చానెళ్లు పెడితే మాత్రం బోలెడు కనిపిస్తాయి. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రాఫిక్ చానెళ్లు చూసేవాళ్లందరికీ అడ్వెంచరస్ కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పని లేదు. రకరకాల సాహసకృత్యాలు, విచిత్రమైన విన్యాసాలు, వింతలు, విశేషాలు... ఎంజాయ్ చేయాలే కానీ ఎంటర్టైన్మెంట్కి కొదువ ఉండదు. అడవిలో తప్పిపోతే బయటకు రావడం ఎలా, బయటకు వచ్చేవరకూ బతకడం ఎలా, నదుల్ని దాటడం ఎలా, కొండల్ని ఎక్కడం ఎలా, నిప్పు రాజేయడం ఎలా... ఇలాంటి షోలు కొన్ని. పాముల్ని పట్టడం ఎలా, మొసళ్లను లొంగదీయడం ఎలా, క్రూరమృగాలను మచ్చిక చేసుకోవడం ఎలా... ఈ తరహా షోలు కొన్ని. ఇంకో రకం కూడా ఉంది. కంటికి కనిపించేవాటితో కాదు... కనిపించని దెయ్యాలతో షోలు చేస్తుంటారు. అంటే... ఎక్కడైనా దెయ్యం ఉందని తెలిస్తే అక్కడికెళ్లి జరిగే సంఘటనల్ని చిత్రీకరించడం, దెయ్యం ఉందా లేదా అని పరిశోధించడం వంటివి చేస్తుంటారు. ప్రేక్షకులకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెబుతుంటారు నిర్వాహకులు. వారికి ప్రమాదమైనా మనకు వినోదాన్ని ఇవ్వడం ముఖ్యమనుకుంటామని కూడా చెబుతుంటారు. ఒక రకంగా అది నిజమే కావచ్చు. విష జంతువులను లొంగదీయడంలో సిద్ధహస్తుడైన స్టీవ్ వండర్స్... ఓ విషజీవి కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. భర్తతో పాటు ‘మ్యాన్ ఉమన్ వైల్డ్’ షోలో నిర్మానుష్య ప్రదేశాల్లో సంచరించే రూత్... అలాస్కాలో మంచు కొండల్లో మనలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి వాటన్నిటినీ వాళ్లు అధిగమించి కార్యక్రమాలను రక్తి కట్టిస్తుంటారు. అయితే... వాటిని ప్రేక్షకులు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా?! కచ్చితంగా చేస్తున్నారు. లేదంటే ఇన్ని రకాల కార్యక్రమాలు ఎలా పుట్టుకొస్తాయి? మ్యాన్ వర్సెస్ వైల్డ్, మ్యాన్ హంట్, ఘోస్ట్ అడ్వెంచరర్స్, ఎక్స్‌పీడిషన్ గ్రిజ్జీ, డ్యూయల్ సర్వైవల్, బియాండ్ ద డివైడ్... ఇలా ఎన్నో. విష ప్రాణుల్ని చూసి ముఖం తిప్పుకునేవాళ్లున్నా, క్రూరమృగాలను చూసి కంగారుపడేవాళ్లున్నా, దెయ్యాలంటే భయపడి ముసుగు తన్నేవాళ్లున్నా ఆ ప్రోగ్రాములు విజయవంతంగానే సాగిపోతున్నాయి. టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి! -
అమెరికాలో తీగ..హైదరాబాద్‌లో డొంక !
నిజంగానే ‘జాదు’ పని స్వదేశీ టీవీల ప్రసారాల పైరసీ వాటినే జాదు టీవీ సెటప్ బాక్స్‌ల ద్వారా విదేశాల్లో ప్రసారం పైరసీ ద్వారా రూ.2200 కోట్ల కుంభకోణం సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఏ కొత్తరకం కుంభకోణం జరిగినా అది హైదరాబాద్‌కే సొంతమవుతోంది. ఎస్ఓటీ పోలీసులు ఇటీవల పెట్రోల్ బంక్‌లలో ‘సాఫ్ట్’ చిప్‌ల బాగోతం బయటపెట్టగా... నగర సీసీఎస్ పోలీసులు తాజాగా ఛానల్స్ ప్రసారాల పైరసీ గుట్టును రట్టు చేశారు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ వెలుగు చూడలేదు. తాజా కుంభకోణానికి సంబంధించి అమెరికాలో తీగ లాగితే... దాని డొంక మాత్రం హైదరాబాద్‌లో కదిలింది. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొందరి కోసం ప్రత్యేక బృందాలను పొరుగు రాష్ట్రాలకు పంపారు. ఇలా వెలుగులోకి... అమెరికాలో తెలుగువారు నివసించే ప్రాంతాలలో ప్రసారమయ్యే ఛానల్స్ స్పష్టంగా రావడంలేదు. దీనికి ఫ్రిక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడమే కారణం. అమెరికాలో తెలుగు ఛానల్స్‌ను వీక్షించే వారిలో కొందరు తమకు సిగ్నల్ సరిగా రావడం లేదని కేబుల్ ఆపరేటర్లకు ఫిర్యాదు చేశారు. సిగ ్నల్స్ తగ్గడానికి కారణాలు వీరికి కూడా అర్థం కాలేదు. దీంతో ఈ వ్యవహారం ఛానల్స్‌తో పాటు సెటాప్‌బాక్స్ యాజమాన్యాల వద్దకు చేరింది. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు ఈ విషయంై పె అమెరికా కోర్టులో కేసులు వేశారు. అక్కడి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరపగా.. ఛానల్స్ ఫ్రిక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడానికి గల కారణం భారత్‌లోనే ఉందని, అక్కడి పోలీసులే దాని గుట్టు విప్పాలని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తెలుగు ఛానల్స్ యాజమాన్యాలు నగర సీసీఎస్ పోలీసులను కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశాయి. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు బోయిన్‌పల్లిలోని మానససరోవర్ అపార్ట్మెంట్లో ‘జాదుటీవీ’ పేరుతో నడుస్తున్న ఛానల్స్ ప్రసారాల పైరసీ గుట్టును రట్టు చేశారు. దేశంలోని అన్ని ఛానల్స్‌ను..... ఒక తెలుగు భాషకు చెందిన ఛానల్స్ ప్రసారాలనే కాదు..తమిళం, మలయాళం, హింది, కన్నడ ఇలా దేశంలోని అన్ని భాషల్లో ప్రసారమవుతున్న ఛానల్స్ ప్రసారాలను సైతం ఈ ముఠా (జాదు టీవీ) పైరసీకి పాల్పడింది. విదేశాలలో ఉన్న ఏ భాషకు చెందిన వారికైనా.. వారి భాషలో ప్రసారమయ్యే ఛానల్స్‌ను అదే విధంగా పైరసీ చేసి చూపిస్తున్నట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఏడాదికి రూ.550 కోట్లు ... ఈ పైరసీ ద్వారా తమకు ఏటా రూ.550 కోట్లు ఆదాయం వస్తోందని పోలీసుల విచారణలో జాదు టీవీ నిర్వాహకులు అంగీకరించారు. నాలుగేళ్లుగా వీరు ఈ విధంగా పైరసీకి పాల్పడుతుతూ సుమారు రూ.2200 కోట్లు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో సెటప్బాక్స్ను వీరు 250 నుంచి 300 డాలర్ల వరకు విక్రయించే వారు. ఇంకా లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా చేస్తారు... బోయిన్‌పల్లిలోని మానససరోవర అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను సాఫ్ట్వేర్, టీవీ ఛానల్ పేర్లతో అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ పలు డిష్‌లను ఏర్పాటు చేయడంతో పాటు హాత్వే, సిటీకేబుల్, డిజిటల్కేబుల్తో పాటు పలు కంపెనీల కేబుల్ ఛానల్స్‌ను వినియోగదారుల రూపంలో కనెక్షన్లు తీసుకున్నారు. ఈ కనెక్షన్ల ద్వారా వీరు అమర్చిన టీవీల నుంచి ఆయా ఛానల్స్ ప్రచారం చేస్తున్న కార్యక్రమాలను తమ సర్వర్లోకి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ ద్వారా జాదు టీవీ పేరుతో తయారు చేసి విక్రయించిన సెటప్బాక్స్లకు పంపిస్తారు. ఈ సెటప్‌బాక్స్‌లు కలిగిన వినియోగదారులకు పైరసీ ద్వారా పంపిస్తున్న ప్రసారాలు ప్రసారమవుతున్నాయి. బ్యాక్ ఖాతాలపై పోలీసుల దృష్టి.. ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు బోయిన్‌పల్లిలోని జాదుటీవీ కార్యాలయాన్ని సీజ్ చేసి అందులో కోట్ల రూపాయల విలువైన డిష్‌లు, కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇంటర్నెట్కనెక్షన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారి సుమిత్ హౌజా మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్లో దాగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే వీరు లావాదేవీలు నిర్వహించిన బ్యాంకు ఖాతాలపైనా పోలీసులు దృష్టి సారించారు. విదేశాలలో వీరికున్న బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేయించేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో నగదు, సెటప్‌బాక్స్‌లను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. -
తెలుగు చానల్ ప్రసారాల పైరసీ
జాదు టీవీ బాక్స్‌ల ద్వారా విదేశాల్లో ప్రసారాలు ముఠా కార్యాలయంపై సీసీఎస్ పోలీసుల దాడి హైదరాబాద్: తెలుగు చానల్స్ ప్రసారాలను పైరసీ చేసి విదేశాలలో ప్రసారాలు చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి కంప్యూటర్లు, యూపీఎస్‌లు, డిష్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. బోయిన్‌పల్లిలోని మానససరోవర్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికే చెందిన మాజిద్ ‘జాదు టీవీ’ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. టీవీలో ప్రసారమయ్యే అన్ని తెలుగు టీవీ చానల్స్‌ను డౌన్‌లింక్ చేసుకుని అదే ప్రసారాలను అప్‌లింక్ చేస్తున్నాడు. ఇతను పంపిస్తున్న ఔట్పుట్ కేవలం ఇతను సరఫరా చేసిన జాదు టీవీ బాక్స్‌ల ద్వారానే ప్రసారం అవుతాయి. ఈ బాక్స్‌లను విదేశాలలోనే విక్రయించాడు. సుమారు 120 దేశాల్లో 300 డాలర్ల చొప్పున రెండు మిలియన్ల బాక్స్‌లను అమ్మినట్లు సమాచారం. అయితే తమ ప్రసారాలు లేని దేశాల్లోనూ కార్యక్రమాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన పలు చానల్స్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చే శాయి. ఇన్స్పెక్టర్లు మాజిద్ అహ్మద్, కరుణాకర్‌రెడ్డిలు ఆరా తీయగా విషయం బయటపడింది. దీని సూత్రధారి జావెద్‌తో పాటు మరో నలుగురిని సీసీఎస్ పోలీసుల అరెస్టు చేయగా సుమిత్ హౌజా పరారీలో ఉన్నారు.