అమెరికాలో తీగ..హైదరాబాద్‌లో డొంక ! | Detour to the wire in the United States .. here! | Sakshi
Sakshi News home page

అమెరికాలో తీగ..హైదరాబాద్‌లో డొంక !

Published Sun, Jun 29 2014 12:41 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో తీగ..హైదరాబాద్‌లో డొంక ! - Sakshi

అమెరికాలో తీగ..హైదరాబాద్‌లో డొంక !

  •       నిజంగానే ‘జాదు’ పని
  •      స్వదేశీ టీవీల ప్రసారాల పైరసీ
  •      వాటినే  జాదు టీవీ సెటప్ బాక్స్‌ల ద్వారా విదేశాల్లో ప్రసారం
  •      పైరసీ ద్వారా రూ.2200 కోట్ల కుంభకోణం
  • సాక్షి, సిటీబ్యూరో:  దేశంలో ఏ కొత్తరకం కుంభకోణం జరిగినా అది హైదరాబాద్‌కే సొంతమవుతోంది. ఎస్‌ఓటీ పోలీసులు ఇటీవల పెట్రోల్ బంక్‌లలో ‘సాఫ్ట్’ చిప్‌ల బాగోతం బయటపెట్టగా... నగర సీసీఎస్ పోలీసులు తాజాగా ఛానల్స్ ప్రసారాల పైరసీ గుట్టును రట్టు చేశారు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ వెలుగు చూడలేదు. తాజా కుంభకోణానికి సంబంధించి అమెరికాలో తీగ లాగితే... దాని డొంక మాత్రం హైదరాబాద్‌లో కదిలింది. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొందరి కోసం ప్రత్యేక బృందాలను పొరుగు రాష్ట్రాలకు పంపారు.
     
    ఇలా వెలుగులోకి...

    అమెరికాలో తెలుగువారు నివసించే ప్రాంతాలలో ప్రసారమయ్యే ఛానల్స్ స్పష్టంగా రావడంలేదు. దీనికి ఫ్రిక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడమే కారణం.  అమెరికాలో తెలుగు ఛానల్స్‌ను వీక్షించే వారిలో కొందరు తమకు సిగ్నల్ సరిగా రావడం లేదని కేబుల్ ఆపరేటర్లకు ఫిర్యాదు చేశారు. సిగ ్నల్స్ తగ్గడానికి కారణాలు వీరికి కూడా అర్థం కాలేదు. దీంతో ఈ వ్యవహారం ఛానల్స్‌తో పాటు సెటాప్‌బాక్స్ యాజమాన్యాల వద్దకు చేరింది. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు ఈ విషయంై పె అమెరికా కోర్టులో కేసులు వేశారు. అక్కడి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరపగా.. ఛానల్స్ ఫ్రిక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడానికి గల కారణం భారత్‌లోనే ఉందని, అక్కడి పోలీసులే దాని గుట్టు విప్పాలని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తెలుగు ఛానల్స్ యాజమాన్యాలు నగర సీసీఎస్ పోలీసులను కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశాయి.  రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు బోయిన్‌పల్లిలోని మానససరోవర్ అపార్ట్‌మెంట్‌లో ‘జాదుటీవీ’ పేరుతో నడుస్తున్న ఛానల్స్ ప్రసారాల పైరసీ గుట్టును రట్టు చేశారు.
     
    దేశంలోని అన్ని ఛానల్స్‌ను.....

    ఒక తెలుగు భాషకు చెందిన ఛానల్స్ ప్రసారాలనే కాదు..తమిళం, మలయాళం, హింది, కన్నడ ఇలా దేశంలోని అన్ని భాషల్లో ప్రసారమవుతున్న ఛానల్స్ ప్రసారాలను సైతం ఈ ముఠా (జాదు టీవీ) పైరసీకి పాల్పడింది. విదేశాలలో ఉన్న ఏ భాషకు చెందిన వారికైనా.. వారి భాషలో ప్రసారమయ్యే ఛానల్స్‌ను అదే విధంగా పైరసీ చేసి చూపిస్తున్నట్టు  పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు.
     
    ఏడాదికి రూ.550 కోట్లు ...

    ఈ పైరసీ ద్వారా తమకు ఏటా రూ.550 కోట్లు ఆదాయం వస్తోందని పోలీసుల విచారణలో జాదు టీవీ నిర్వాహకులు అంగీకరించారు. నాలుగేళ్లుగా వీరు ఈ విధంగా పైరసీకి పాల్పడుతుతూ సుమారు రూ.2200 కోట్లు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో సెటప్‌బాక్స్‌ను వీరు 250 నుంచి 300 డాలర్ల వరకు విక్రయించే వారు. ఇంకా లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
     
    ఇలా చేస్తారు...

    బోయిన్‌పల్లిలోని మానససరోవర అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను సాఫ్ట్‌వేర్, టీవీ ఛానల్ పేర్లతో అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ పలు డిష్‌లను ఏర్పాటు చేయడంతో పాటు హాత్‌వే, సిటీకేబుల్, డిజిటల్‌కేబుల్‌తో పాటు పలు కంపెనీల కేబుల్ ఛానల్స్‌ను వినియోగదారుల రూపంలో కనెక్షన్లు తీసుకున్నారు. ఈ కనెక్షన్ల ద్వారా వీరు అమర్చిన టీవీల నుంచి ఆయా ఛానల్స్ ప్రచారం చేస్తున్న కార్యక్రమాలను తమ సర్వర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్‌నెట్ ద్వారా జాదు టీవీ పేరుతో తయారు చేసి విక్రయించిన సెటప్‌బాక్స్‌లకు పంపిస్తారు. ఈ సెటప్‌బాక్స్‌లు కలిగిన వినియోగదారులకు పైరసీ ద్వారా పంపిస్తున్న ప్రసారాలు ప్రసారమవుతున్నాయి.
     
    బ్యాక్ ఖాతాలపై పోలీసుల దృష్టి..

    ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు బోయిన్‌పల్లిలోని జాదుటీవీ కార్యాలయాన్ని సీజ్ చేసి అందులో కోట్ల రూపాయల విలువైన డిష్‌లు, కంప్యూటర్లు, సర్వర్‌లు, హార్డ్‌డిస్క్‌లు, ఇంటర్‌నెట్‌కనెక్షన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారి సుమిత్ హౌజా మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్‌లో దాగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే వీరు లావాదేవీలు నిర్వహించిన బ్యాంకు ఖాతాలపైనా పోలీసులు దృష్టి సారించారు. విదేశాలలో వీరికున్న బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేయించేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో నగదు, సెటప్‌బాక్స్‌లను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement