వారఫలాలు | varaphalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sat, Oct 14 2017 11:59 PM | Last Updated on Sat, Oct 14 2017 11:59 PM

varaphalalu in this week

15 అక్టోబర్‌ నుంచి 21 అక్టోబర్‌ 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేరు. కొన్ని సమస్యలు వాటంతట అవే సర్దుబాటు కాగలవు. వ్యాపార లావాదేవీలు కొంత మందగించినా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంత పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు ఉండవచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. గులాబి, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడికి మించిన ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో ఖర్చులు. వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగుల సమర్థత బయటపడుతుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవులు దక్కే అవకాశం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అదనపు రాబడి అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువర్గంతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలు క్రమేపీ  తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులను కలుసుకుని వ్యవహారాలలో చర్చిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు కాస్త సర్దుబాటు కాగలవు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. భూవివాదాల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆదాయం ఆశాజనంగా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో
15 అక్టోబర్‌ నుంచి 21 అక్టోబర్, 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
చేపట్టిన పనులన్నీ కలిసివస్తాయి. చదువులో, ఉద్యోగంలో ఒక గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. మిమ్మల్ని మీరు నమ్మి గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం చూస్తారు. మంచి పేరు, గౌరవం కూడా దక్కుతుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే ఇప్పుడప్పుడే ఫలితం గురించి ఆలోచించకండి. జీవితంలో ఓ కొత్త అవకాశం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. కలిసివచ్చే రంగు : నారింజ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనా విధానంలో ఊహించని మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ఈ మార్పును స్వీకరించండి. కొత్త స్నేహాలు, ప్రేమలకు ఇది సరైన సమయం కాదని తెలుసుకుని వ్యవహరించండి. ఇప్పటికే కొన్ని స్నేహాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బందిపెడుతున్నాయి. మీకోసం ఎక్కువ సమయం కేటాయించుకోండి. భయాలు, ఆందోళనలను పక్కనబెట్టి విజయంపై ధీమాతో పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈ వారమంతా కొంత గందరగోళంగానే ఉంటుంది. ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏది జరిగినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీరు కొత్తగా మొదలుపెట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఈ పరిస్థితిని ఎదుర్కొండి. ఈ ఒక్క ప్రమాదం నుంచి బయటపడితే ముందు అంతా మంచే జరుగుతుంది. మానసికంగా ధృడంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఏ పనిమీదా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్న మీ వ్యవహార శైలే మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుందని తెలుసుకోవాలి. ఏ పని చేయాలనుకున్నా, చిత్తశుద్ధితో పనిచేయడం అలవర్చుకోండి. మీలో వచ్చే ఈ మార్పే మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. జీవితం కొత్త మలుపులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. దాన్ని మీరూ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ప్రతికూల ఆలోచనలే అన్నింట్లో మీరు వెనకబడడానికి కారణమని గ్రహించండి. ఆత్మ విశ్వాసంతో, విజయంపై ధీమాతో ముందడుగు వేయండి. పరిస్థితులకు భయపడినా కొద్దీ విజయానికి మీరొక మూడడుగులు వెనక్కి వేస్తున్నట్టే. ఈవారం మీకు అంతా శుభసూచకంగానే కనిపిస్తోంది. కొన్ని కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లైతే అందుకు ఇదే సరైన సమయం. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : వంగ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీకు ఎదురయ్యే సవాళ్లు కూడా మీ ధైర్యానికి పరీక్ష పెట్టేవిగానే ఉంటాయి. విజయం మీదేనని నమ్మండి. మంచి గుర్తింపు దక్కుతుంది. మీ జీవితాశయానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాటిపై బాగా శ్రద్ధ పెట్టండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సరికొత్త మార్గాల్లో ఆదాయ అన్వేషణను కొనసాగిస్తూ వెళ్లేందుకు ఇదే సమయం. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. కలిసివచ్చే రంగు : పీచ్‌

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ శుభవార్త ఈ వారమే వింటారు. మిమ్మల్ని ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతోన్న ప్రేమ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. విహారయాత్రలకు సన్నాహాలు చేసుకోండి. మీరు మునుపటిలా ఉల్లాసంగా పనిచేయడానికి ఈ విహారయాత్ర ఉపయోగపడుతుంది. కొత్త పదవి లేదా ఉద్యోగ మార్పు కనిపిస్తోంది. అందుకు సిద్ధంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కోరుకున్నట్లుగా జీవితం సాఫీగా సాగుతుంది. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పనులను వాయిదా వేస్తూ పోవడం మిమ్మల్ని అన్నింట్లో వెనుకబడిపోయేలా చేస్తోంది. మీరు కోరుకున్న విజయం త్వరలోనే దక్కుతుంది. కష్టపడకుండా విజయం సాధిస్తామన్న అపోహను దూరం చేసుకోవడం మంచిది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రేమ జీవితం కూడా కొత్త మలుపులు తీసుకుంటుంది. అయితే అన్నీ మీ మంచికే జరుగుతాయి. ఉల్లాసంగా ఉంటారు. గతంలో మీరు చేపట్టిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ఫలితాలిస్తాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేసేలా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మీ పరిధి దాటిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకపోతేనే మంచిది. మీకు గుర్తింపు దక్కాల్సిన చోట మౌనంగా వ్యవహరించడం మానండి. కలిసివచ్చే రంగు : లేత గులాబి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కొత్త పని మొదలుపెడతారు. మీ స్థాయికి తగ్గ విజయం ఈ కొత్త పనిలో దక్కుతుంది. చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. కష్టపడితేనే విజయం అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి గుర్తింపు దక్కుతుంది. తూర్పు దిక్కున పచ్చటి మొక్కలు నాటితే అది మీకు బాగా కలిసివస్తుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అదృష్టం మీ తలుపు తడుతుంది. గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. కొత్త ఉత్సాహంతో మీ జీవితాశయానికి మరింత దగ్గరవుతూ కష్టపడతారు. కొత్త పని మొదలుపెట్టాలని అనుకుంటూ ఉన్నట్లైతే ఇదే సరైన సమయం. వాహనయోగం ఉంది. అవకాశాలు వరుసగా వచ్చిపడతాయి. మీ స్థాయికి తగ్గవాటిని ఎంచుకొని కష్టపడండి. అనవసర భయాలతో మీరు సమర్ధంగా నిర్వహించగల బాధ్యతలను వదులుకోకండి. కలిసివచ్చే రంగు : నలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీకు రానున్నదంతా మంచి కాలమే. జరగాల్సినవి జరగకమానవు అన్న విషయాన్ని బలంగా నమ్మండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొత్త ఆలోచనలు తడతాయి. కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తారు. మీపై మీరుంచే నమ్మకమే ఈ కొత్త ఆలోచనల్లో మీకంటూ ఒక గుర్తింపు ఇవ్వగలుగుతాయని గ్రహించండి. వాస్తవానికి దగ్గరగానే మీ ఆలోచనలు ఉండేలా చూసుకోవడం అవసరమన్నది తెలుసుకోండి. కలిసివచ్చే రంగు : ఊదా
ఇన్సియా టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement