వామ్మో... ఎంత అతి! | Variety police stories to make Entertainment for interesting with actions scenes | Sakshi
Sakshi News home page

వామ్మో... ఎంత అతి!

Published Sun, Jul 20 2014 1:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

వామ్మో... ఎంత అతి! - Sakshi

వామ్మో... ఎంత అతి!

సినిమాల్లో హీరో పోలీసాఫీసరైతే భలే బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు, అరెస్టులు అంటూ యాక్షన్ సీన్లు భలే ఆసక్తి గొలుపుతాయి. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు కూడా. అందుకే బుల్లితెర మీద కూడా పోలీసు కథలు మొదల య్యాయి. అలాంటి వాటిలో ఒకటి... ‘సూపర్‌కాప్స్ వర్సెస్ సూపర్ విలన్స్’. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌లో ఓ పోలీసు గ్రూప్ ఉంటుంది. వాళ్లకి కొన్ని వింత వింత సమస్యలు వస్తుంటాయి. విచిత్రమైన శత్రువులు ఎదురవుతుంటారు. వారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు ఖాకీలు చేసే పోరాటమే ఈ సీరియల్. స్టోరీ ఓకే కానీ ఆ సమస్యలు ఉంటాయి చూడండీ... ఎంత విచిత్రంగా ఉంటాయో. అసలు నిజ జీవితంలో అలాంటి సమస్యలు రానే రావు.
 
 అలాంటి శత్రువులు ఎదురు పడనూ పడరు. తలలేని వాళ్లు, జంతువుల్లాగా పాకుతున్నవాళ్లు, బిల్డింగుల మీద ఎగిరేవాళ్లు, ముట్టుకుంటే షాక్ కొట్టేవాళ్లు, బాంబు పెట్టి పేల్చినా ఏమీ కాని ఇనుప దేహాలు కలవాళ్లు... ఇలాంటి విచిత్రమైనవాళ్లు దాడి చేస్తుంటారు. ప్రజల్ని, దేశాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్లని మట్టుబెట్టే విధానం తెలియక కాసేపు, తెలిశాక ఎలా మట్టుబెట్టాలా అని కాసేపు పోలీసులు నానా హైరానా పడిపోతుంటారు. అవడానికి పెద్దల సీరియలే అయినా... చూడ్డానికి చిన్నపిల్లల షోలా అనిపిస్తుంది. కల్పనల్ని బాగా నమ్మేవాళ్లు, ఇష్టపడేవాళ్లు మాత్రమే దీన్ని చూడగలరు. వాస్తవికతను కోరుకునేవాళ్లెవరూ ఆ అతిని భరించలేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement