విశ్లేషణ
మరో ప్రాంతంలోని ఎన్నికల ప్రచార కార్యకలాపాల సమాచారం పోలింగ్ జరుగనున్న ప్రాంతానికి చేరకుండా నివారించడం అసాధ్యం. పోలింగ్ జరగాల్సిన ప్రాంతానికి ప్రసారాలను పాక్షికంగా నిలిపివేయలేరు.
పోలింగ్‌కు ముందు 48 గంటల పాటూ ‘‘ఎన్నికల ప్రచారం ఉండరాదు’’ అని చెప్పే ఎన్నికల నియమావ ళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షాకు నోటీసులు ఇవ్వక పోవడం ఎన్నికల కమిషన్ చేసిన మొదటి తప్పు. ఆ ఆరోపణతో రాహుల్ గాంధీకి నోటీసు ఇవ్వడం అది చేసిన మరో తప్పు. ఆధునిక కాలంలో మీడియా కలు గజేయగల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నియమావళిలో మార్పులను తేవటం సాధ్యమేమో పరిశీలించాలని ఎన్నికల సంఘం ఇప్పుడు నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా విస్మరించిన ఆ బాధ్యతను అది ఇప్పటికిగానీ మేల్కొని గుర్తించలేదు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవం (అది ఇంకా పూర్తి కాలేదు, దాని ప్రభావం చివరికి ఎలా ఉండనుందో తెలియదు!) కారణంగా దృశ్య, శ్రవణ, లిఖిత రూపాల్లోని సమాచారం నేడు అప్పటికప్పుడే ప్రజలకు చేరి పోతోంది. దాని ప్రతికూల ప్రభావం ఎలాంటిదో ముందుగానే తేటతెల్లం అయింది. ఓటర్లతో పార్టీ లకూ, అభ్యర్థులకు ఉండే సంబంధాలకు వర్తించే ఎన్నికల నియమావళిని సునిశితంగా పునఃపరిశీలిం చాల్సిన అవసరాన్ని ఈసీ గుర్తించి ఉండాల్సింది.
పోలింగ్‌కు ముందు వారాలు, రోజుల తరబడి హోరెత్తించిన వాగ్దానాలు, ఆరోపణలు, ప్రత్యారోప ణలు, విజయాలు, వైఫల్యాలు తదితరాలన్నిటిని సావధానంగా ఆలోచించి తగిన వారిని ఎంపిక చేసు కునే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఆ అవకాశాన్ని కల్పించాలనే 48 గంటలు ప్రచారం లేకుండా నిశ్శ బ్దంగా ఉండాలనడం. అత్యంత రణగొణధ్వనులతో సాగే ఎన్నికలు బహుశా మనవే కావచ్చు. టీవీ, ఇంట ర్నెట్, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వీధుల్లోని ఆ గోల ఇప్పుడు ఇళ్లలోకే ప్రవేశించింది. పోలింగు రోజున రాజకీయ పార్టీలు తమ ప్రకటనలను పత్రికల మొదటి పేజీలో ప్రచురించుకోవడాన్ని ఎన్నికల కమి షన్ ఆమోదిస్తూనే ఉంది. దేశానికి లేదా రాష్ట్రానికి తదుపరి పాలకులుగా తమ నేతలే ఎందుకు మెరుగైన వారో గొప్పగా ఆ ప్రకటనలు చెబుతుంటాయి. ఈ వ్యవహారంలో కెల్లా బాగా చిరాకెత్తించే విషయం అదే. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాకున్నా, దాని స్ఫూర్తికి భంగం కలిగించేది. అయినా ఈ విష యంపై ఈసీ తగినంత శ్రద్ధ చూపలేదు. ఈ వ్యవ హారంతో సంబంధమున్న వారంతా దీనివల్ల లాభప డేవాళ్లే. కనీసం ముందుగా పత్రికల్లో ప్రకటనల కోసం స్థలాన్ని బుక్ చేసుకున్నవారికైనా ఇది లాభ దాయకమైనది. ఇక మీడియాకు ఆర్థికంగా లాభదా యకమైనది. కాబట్టి ఈ విషయంపై మౌనం వహిం చడమనే కుట్రదే పైచేయి అయింది.
ఇక మనం 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో నిలబడి తమ పార్టీ ఎన్నికల గుర్తును చూపిన ఘటనను చూద్దాం. అది ఎన్నికల నిబంధనావళికి ఉల్లంఘనే. కానీ నేడు మీడియాకు ఉన్న విస్తృతిని, వేగాన్ని దృష్టిలో ఉంచు కుంటే అలాంటి దృశ్యం రెండవ దశ ప్రచారం సాగు తున్న వేరేదైనా ప్రాంతం నుంచి తరచుగా ప్రసారం అవుతూ కనిపిస్తుంటుంది. కాబట్టి, ఈ నిబంధన అమల్లో ఉన్నా దాన్ని సులువుగానే తప్పించుకో వచ్చు. అలాగే, ఆ దృశ్యం మోదీ గుజరాత్‌లో లేదా ఆ రాష్ట్రానికి వెలుపల మరెక్కడో నిర్వహించిన రోడ్ షోలోనిదీ కావచ్చు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 పరిధిని పరిశీలించడం కోసం ఆదివారం ఎన్నికల కమిషన్ ఒక కమిటీని నియమించింది. అందులో సమాచార, ప్రసార శాఖ, న్యాయ శాఖ, నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులు సభ్యులు. ఇది ఆహ్వానించదగిన చర్య. కానీ, ఇప్పుడే చెబుతున్నాను, ఆ పని చాలా కష్టమైనది. ‘‘ప్రస్తుతం ఉన్న సమాచార ప్రసార సాంకేతికతల నేపథ్యంలో’’ ఇది ఈవీఎంల విశ్వసనీయతను రుజువు చేయడం కంటే చాలా కఠినమైన పని. ఇక మీదట దశలవారీ పోలింగ్ జరపరాదని నిర్ణయిస్తే తప్ప, చాలా కష్టమైన పని. శాంతిభద్రతల పరిరక్షణ, శాంతిభద్రతలను అమలు పరచే సిబ్బంది తరలింపు తదితరాల నిర్వహణ నానాటికీ మరింత కష్టతరంగా మారుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఎన్నికల కమిషన్ దేశాన్ని లేదా రాష్ట్రాలను పలు విభాగాలుగా విభ జించి, దశలవారీ పోలింగ్‌ను నిర్వహించడం పరి పాటిగా మారింది. అయితే ఈ పద్ధతి వివిధ విభా గాల మధ్య సమాచార ప్రసారాలకు అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ జరుగుతూండగా సాగే టీవీ చర్చలు సైతం ఓటర్లను ప్రభావితం చేయగలవని సైతం ఎన్నికల కమిషన్‌కు తట్టలేదు.
మరో ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యకలాపాల సమాచారం పోలింగ్ జరుగ నున్న ప్రాంతానికి చేరకుండా నివారించడం అసా ధ్యం. పోలింగ్ జరగాల్సిన ప్రాంతానికి ప్రసారాలను పాక్షికంగా నిలిపివేయడం చేయలేరు. చివరి దఫా పోలింగ్‌లో చిట్టచివరి ఓటు పోలయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిలిపి ఉంచడం అంత మామూలు విషయమేమీ కాదు. గుజరాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాక ఆదివారం జరిగిన ఉప ఎన్ని కల్లో ఓటర్ల ఎంపికను ఆ ఫలితాలు ప్రభావితం చేసి ఉండొచ్చు.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేశ్ విజాపుర్కర్, ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment