
బిగించిన నీ పిడికిలి వేళ్లు
ఇప్పుడిప్పుడే విప్పారుతున్నాయి
నినదించిన నీ సంకల్పం
ఇంటింటా సంక్షేమమై సంచరిస్తోంది
మాట తప్పని తొమ్మిదేళ్ల నీ ప్రస్థానం
నవరత్నాలై వెలుగులు పంచుతోంది
వెన్ను చూపని నీ పోరాటం
యువతకు గొప్ప పాఠమైంది
నీ నిబ్బరం గెలుపునే
అబ్బురపరచింది
నీ ఆశయం రేపటి
ఆశల జెండాగా
రెపరెపలాడుతోంది
నీ ఆత్మీయత
తెలుగింటి తోరణమై
కళకళలాడుతోంది
నీ ఆలోచన
దేశం ‘దిశ’ మారుస్తోంది
ఆకాశం వైపు చూస్తే
వైయస్ నవ్వు
నేలపై చూస్తే
ఆ నవ్వులాగే నువ్వు
నిన్నలా... నాన్నలా...
నేడు అందరికీ అన్నలా!
నీ పాలన కావాలి పండుగ
ప్రజలందరి గుండెల నిండుగా..!
హ్యాపీ బర్త్ డే సర్
– పూడి శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ : 94902 72789
Comments
Please login to add a commentAdd a comment