మన రోజువారీ జీవితంలో ఇప్పుడు దాదాపుగా ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌తో తయారు చేసిందే వాడుతున్నాం. ప్లాస్టిక్
ప్రమాదమని, కాలుష్యమని తెలిసినా.. సులభం, చౌక కాబట్టి.. ఇలా వాడి అలా పారేస్తున్నాం! అయితే, ఆరోగ్యం కోసం వాడే మందులను సైతం ప్లాస్టిక్ పెట్(పాలీ ఎథిలీన్ టెరెఫ్తాలేట్) సీసాల్లో నిల్వ చేస్తుండటంతో.. వాటిని వాడి
అనారోగ్యాన్ని మరింత కొని తెచ్చుకుంటున్నాం. దేశంలో పిల్లలు, పెద్దలు ఉపయోగించే టానిక్, ఇతర మందులను నిల్వచేసే సీసాల్లో 70 శాతం వరకూ పెట్ బాటిళ్లే ఉండటం నిజంగా విషాదం!
ఇవీ దుష్పరిణామాలు...
బెస్ఫైనాల్ ఏ, డై-ఇథైల్‌హెక్సైల్
ఫ్తాలేట్‌ల వల్ల రోగనిరోధక శక్తి
మందగిస్తుంది.
టెరెఫ్తాలేట్ యాసిడ్(టీపీఏ) వల్ల
హార్మోన్‌ల చర్యలు ప్రభావితమవుతాయి.
గర్భాశయ అభివృద్ధి, గర్భధారణలో లోపాలు ఏర్పడతాయి.
గర్భస్రావాలు పెరుగుతాయి.
పిల్లలు నెలలు నిండకుండానే, తక్కువ బరువుతో పుడతారు.
లోపాలతో పుడతారు.
{Mోమోజోమ్ సంబంధమైన సమస్యలూ వస్తాయి.
ఛాతి కేన్సర్ వచ్చే అవకాశాలు
పెరుగుతాయి.
కేన్సర్ మందులు సమర్థంగా
పని చేయవు.
టీపీఏ ప్రభావంతో డీఎన్‌ఏ ధ్వంసం
అవుతుంది. వృద్ధుల్లో మరింత ప్రమాదం.
నిషేధంపై తాత్సారం
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు నోటి ద్వారా తీసుకునే ద్రవరూప ఔషధాలను నిల్వ చేసేందుకు ప్లాస్టిక్(పెట్) బాటిళ్ల వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వం 2014 సెప్టెంబరులో నిర్ణయించింది. ఔషధాలు, వైద్య పరికరాలు, ఆహారాన్ని ప్యాక్‌చేసేందుకు పెట్ కంటెయినర్లను వినియోగించడంపైనా నిషేధం విధించాలని ప్రతిపాదించింది. అయితే, ఈ నిర్ణయం చట్ట రూపం దాలిస్తేనే పెట్ సీసాలపై నిషేధం అమల్లోకొస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఔషధ రంగంలో పెట్ బాటిళ్ల వాడకాన్ని నిషేధించకుండా ఫార్మా, ప్లాస్టిక్ పరిశ్రమల వారు అడ్డుకుంటున్నారు. పెట్ బాటిళ్లలోని టానిక్‌లు, మందుల వాడకం వల్ల తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతున్నట్లు ఇటీవలి అధ్యయనాల్లో కూడా తేలింది. అందువల్ల పెట్ బాటిళ్లు సురక్షితమేనని, చౌక కూడా అని ఫార్మా, ప్లాస్టిక్ కంపెనీలు చేస్తున్న వాదన వాస్తవం కాదు.
డాక్టర్ సీమా సింఘాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్(గైనకాలజీ) ఎయిమ్స్(ఢిల్లీ)
ఆరోగ్యంతో ఆటలు..:
Published Fri, Feb 20 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement