రాజధాని నగరంలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గత రెండ్రోజుల్లో 30 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయగా ఇద్దరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఇందులో ఒకరు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో, మరొకరు నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఆరు మాసాల్లో సుమారు 350 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు జరగగా.. అందులో 31 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో తొమ్మిది మంది మృతి చెందారు. అయితే అధికారులు దీన్ని టైఫాయిడ్, మలేరియా తరహాలోనే స్థానిక వ్యాధిగా పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. మన వాతావరణంలో హెచ్1ఎన్1 వైరస్ బాగా కలిసిపోయి ఉందని, మన రాష్ట్రంలో ఉన్నవారి నుంచే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోందని చెబుతున్నారు.
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
Published Wed, Jul 23 2014 2:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement